అక్షాంశ రేఖాంశాలు: 17°43′02″N 83°19′42″E / 17.717231°N 83.328225°E / 17.717231; 83.328225

రాజీవ్ స్మృతి భవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

17°43′02″N 83°19′42″E / 17.717231°N 83.328225°E / 17.717231; 83.328225

రాజీవ్ స్మృతి భవన్
స్థాపితం2008 (2008)
ప్రదేశంబీచ్ రోడ్, విశాఖపట్నం
రకంసాంస్కృతిక కేంద్రం
ఓనర్మహా విశాఖ నగరపాలక సంస్థ

రాజీవ్ స్మృతి భవన్, విశాఖపట్నంలోని పాండురంగపురం, బీచ్ రోడ్ వద్ద ఉన్న స్మారక, సాంస్కృతిక కేంద్రం. 2008 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాశశేఖరరెడ్డి దీనిని ప్రారంభించాడు.[1]

చరిత్ర

[మార్చు]

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి ముందు ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించాడు. ఆ తరువాత తమిళనాడులోని పెరంబదూర్ లో జరిగిన బాంబు దాడిలో మరణించాడు. ఆయన ఆఖరిసారి సమావేశం జరిపిన ప్రాంతం ఇదే కనుక ఆయన జ్ఞాపకంగా 2008లో ఇక్కడ రాజీవ్ స్మృతి భవన్ నిర్మించారు.

కార్యకలాపాలు

[మార్చు]

రాజీవ్ గాంధీకి ఈ స్మారక, సాంస్కృతిక కేంద్రం అంకితం చేయబడింది. ఇది రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను తెలిపేలా ఫోటోల ప్రదర్శనకు,[2] శాస్త్రీయ, కర్ణాటక సంగీతానికి వేదికగా ఉంది.[3]

ఇతర వివరాలు

[మార్చు]

2014లో వచ్చిన హుదూధ్ తుఫాన్ కారణంగా ఈ భవనం చెడిపోగా, అప్పటి రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామి రెడ్డి ఎంపి నిధులతో బాగుచేయించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Visakhapatnam: Rajiv Bhavan stands as Hudhud Memorial". Deccan Chronicle. 28 January 2016. Retrieved 2021-05-24.
  2. Subrahmanyam, G. S. (23 November 2014). "Multi-activity centre mooted at Rajiv Smruthi Bhavan". Retrieved 2021-05-24 – via www.thehindu.com.
  3. "Rajiv Smruthi Bhavan: Latest News, Videos and Photos - Times of India". The Times of India. Retrieved 2021-05-24.
  4. Subrahmanyam, G. S. (2014-11-23). "Multi-activity centre mooted at Rajiv Smruthi Bhavan". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-05-24.

బయటి లంకెలు

[మార్చు]