Jump to content

రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం

వికీపీడియా నుండి
రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం, హైదరాబాద్
దేశముభారతదేశం
తరహారాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయం
స్థాపితము1891
ప్రదేశముఅఫ్‌జల్ గంజ్, హైదరాబాద్
గ్రంధ సంగ్రహం / సేకరణ
సేకరించిన అంశాలుపుస్తకాలు, పరిశోధన గ్రంథాలు, దిన-వార-మాసిక-పక్ష-వార్షిక పత్రికలు,చేవ్రాతలు,
గ్రంధాల సంఖ్య~ 5,00,000 పుస్తకాలు/పత్రికలు
చట్టపరమైన జమఔను
ప్రాప్యత, వినియోగం
వినియోగించుటకు అర్హతలుఎవరైనా రావచ్చును

తెలంగాణ రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం( స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ ) హైదరాబాద్ నగరంలో ఉన్న సార్వజనిక గ్రంథాలయం. ఈ గ్రంథాలయం స్వాతంత్ర్యానికి ముందు అసాఫియా లైబ్రెరీగా ప్రసిద్ధం. ఈ గ్రంథాలయం ప్రస్తుతమున్న భవనాన్ని 1891లో నవాబ్ ఇమాదుల్‌ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ కట్టించాడు.[1] ఈ భవనం అపూర్వ కళాఖండం, ఇంటాక్ హైద్రాబాద్ వారు ఈ భవనాన్ని సంప్రదాయ పారంపరిక వారసత్వ కట్టడంగా 1998లో ప్రకటించింది.[2]

ఈ గ్రంథాలయం మూసీ నది తీరంలో అఫ్జల్‌గంజ్ లో ఉంది. దాదాపు ఐదు లక్షల పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి.[3]

చరిత్ర

[మార్చు]

1891లో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ తన సొంత పుస్తకాలతో ఈ గ్రంథాలయానికి నాంది పలికారు. గ్రంథాలయ భవనం 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. అజీజ్ ఆలీ అనే ఆర్కిటెక్ట్ ద్వారా భవన నిర్మాణం జరిగింది. శంకుస్థాపన 1932లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేయగా, 1936లో గ్రంథాలయాన్ని ఈ భవనంలోకి తరలించారు. పెద్ద గదులతో, ఎత్తైన పైకప్పుతో రాజప్రాసాదాన్ని తలపించేలా ఉంటుందీ భవనం. 1941లో ఈ గ్రంథాలయం గోల్దేన్ జూబిలీ (50 ఏళ్ళ ఉత్సవం) జరుపుకుంది. 1955లో స్టేట్ సెంట్రల్ లైబ్రెరీగా పేరు మార్పు పొంది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.[4]

లక్ష్యాలు

[మార్చు]
  1. విజ్ఞానం, టెక్నాలజీ, తదితర విషయాలకు సంబంధించిన సాహిత్యాన్ని సమీకరించడం.
  2. ఈ గ్రంథాలయం తెలంగాణాలో ఉన్న పరిశోధకులకు, విద్యావేత్తలకు ప్రముఖ వనరు కావాలి.
  3. అన్ని గ్రంథాలయాల మధ్య పుస్తకాల లావాదేవీకి కేంద్రంగా ఉండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉండాలి
  5. పుస్తక ప్రదర్శనలు, సెమినార్లు, గ్రంథాలయ వారోత్సవాలు, సదస్సులు నిర్వహించటం
  6. జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో, సాధారణ ప్రజలలో చదివే ఆసక్తిని పెంపొందించడం.
  7. అంధులతో సహా అన్ని వర్గాల చదువరులకు పుస్తకాలనందించడం.

పుస్తకాల వివరాలు

[మార్చు]

ఈ గ్రంథాలయంలో ఐదు లక్షల పుస్తకాలున్నాయి. 19వ శతాబ్దం తొలినాళ్ళ నుండి నేటి వరకు ప్రచురితమైన అన్ని పుస్తకాలు దొరుకుతాయి. వీటిలో ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, పర్షియన్ భాషల పుస్తకాలున్నాయి. దాదాపు 17 వేల చేవ్రాత తాళపత్రాలు ఇక్కడి నుండి తెలంగాణ ఓరియంటల్ మానుస్క్రిప్ట్ లైబ్రరీకి 1967 లో తరలించబడ్డాయి. 1941లో అప్పటి నిజాం నడిపిన పత్రిక - "హైదరాబాద్ సమాచార్" ప్రతులు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.

2004 ఏప్రిల్ 1 న వున్న 4,41,573 పుస్తకాల వివరాలు:
భాష సంఖ్య
తెలుగు 140198
ఇంగ్లీషు 140713
ఉర్దూ 68626
హిందీ 42586
అరబిక్ 6459
పర్షియన్ 6492
తమిళం 1060
కన్నడ 15009
మరాఠీ 17134
సంస్కృతము 3296

కంప్యూటరీకరణ/డిజిటలైజేషన్

[మార్చు]

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు రూపొందించిన ఈ-గ్రంథాలయ అనే సాఫ్టువేరు వాడి మొదటి దశ కంప్యూటరీకరణ చేయడం జరిగింది. కార్నెగీ-మెల్లన్ యూనివర్సిటీతో భారతప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన భారత డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టు పధకం కింద దాదాపు 40,000 పుస్తకాలు డైజిటైజ్ చేయబడ్డాయి. హిందీ, ఆంగ్లం, తెలుగు, ఉర్దూ, పర్షియా భాషల పుస్తకాలు డిజిటైజ్ చేసారు.

ఇవీ చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. "State Central Library to sport a grand look again". The Hindu. 2005-08-06.
  2. "State Central Library calls for uplift". The Hindu. 2009-07-05. Archived from the original on 2012-11-07. Retrieved 2016-10-30.
  3. R. Bhattacharjee, (2002-09-19). "Public Library Services in India: Systems and Deficiencies". International Federation of Library Associations and Institutions. Archived from the original on 2012-07-12. Retrieved 2016-10-30.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  4. "State Government - Oriental Manuscripts Library and Research Institute (OMLRI) - Osmania University Campus, Hyderabad 500 007" Archived 2010-01-31 at the Wayback Machine, కనుగొన్న తేదీ 17 డిసెంబర్ 2009.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

[మార్చు]