Jump to content

వెంకటాద్రిపురం

వికీపీడియా నుండి
వెంకటాద్రిపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నూజివీడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521201
ఎస్.టి.డి కోడ్

వెంకటాద్రిపురం, కృష్ణా జిల్లా, నూజివీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది నూజివీడు-తిరుఊరు మార్గంలో నూజివీడు నుండి సుమారు 5 కి.మీ. దూరంలో ఉంది. గ్రామం జనాభా సుమారు 1000. వోట్ల సంఖ్య 520. ఇది వ్యవసాయ ప్రధానమైన ఊరు. ఇది ‌అన్నవరం పంచాయితీలో ఉంది.

వెంకటాద్రిపురం గ్రామంలో ఒక వీధి, గ్రామం పేరున్న మైలురాయి

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు, పండ్లతోటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఈ గ్రామానికి సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1922లో ఈ గ్రామం వ్వవస్థాపన జరిగింది. గ్రామం వ్యవస్థాపకుడైన చలసాని మల్లికార్జునుడు వుయ్యూరు మండలానికి (నెప్పల్?) చెందిన వ్యక్తి. అతను, మరికొంతమంది కలిసి ఈ గ్రామాన్ని స్థాపించినపుడు స్మారకచిహ్నంగా ఒక శంకుస్థాపన రాయిని పాతారు. వుయ్యూరు జమీందారు మేకా వెంకటాద్రి అప్పారావు వీరికి 50 ఎకరాల భూమిని కేటాయించాడు. ఇలా "వెంకటాద్రిపురం" అనే పేరు వచ్చింది. పొనుకుమాడుకు చెందిన సుంకర రాజయ్య ఈ గ్రామానికి వలస వచ్చి ఒక ధర్మసత్రాన్ని కట్టించాడు. అలా ఈ వూరికి "సత్రపు అన్నవరం" లేదా "క్రొత్త అన్నవరం" అనే పేర్లు కూడా వచ్చాయి. గ్రామానికి తూర్పు దిశలో "కావిళ్ళ చెరువు" అనే చెరువు ఉంది. పశ్చిమాన 150 ఎకరాల అడవి భూమి ఉంది. దీనిని 1985లో పేదవారికి పంచారు.

గ్రామానికి చెందిన కొందరు ప్రముఖులు

[మార్చు]
వెంకటాద్రిపురం గ్రామం గుడి, గ్రంథాలయం

పై ఇద్దరి పేర్లమీద ఇప్పుడొక స్మారక గ్రంథాలయం ఉంది.

  • వేములపల్లి కృష్ణమూర్తి
  • వీరంకి వసంతరాయుడు
  • చలసాని గోపాలకృష్ణమూర్తి
  • చలసాని జగన్నాధరావు - కమ్యూనిస్టు నాయకుడు
  • చలసాని వెంకటరామారావు - కమ్యూనిస్టు నాయకుడు

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 9 రోజుల ఉత్సవాల తరువాత "కావిడి చెరువు"లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

మూలాలు

[మార్చు]