Jump to content

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

అక్షాంశ రేఖాంశాలు: 18°58′03″N 78°20′35″E / 18.96750°N 78.34306°E / 18.96750; 78.34306
వికీపీడియా నుండి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డాం (పోచంపాడు డాం)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు is located in Telangana
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Telangana లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్థానం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు is located in India
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (India)
ప్రదేశంబాల్కొండ మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు18°58′03″N 78°20′35″E / 18.96750°N 78.34306°E / 18.96750; 78.34306
నిర్మాణం ప్రారంభం1963
ప్రారంభ తేదీ1977
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుగోదావరి నది
Height43 మీటర్లు (141 అ.) from river level
పొడవు15,600 మీటర్లు (51,181 అ.)
జలాశయం
మొత్తం సామర్థ్యం3,172,000,000 మీ3 (2,571,582 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం2,322,000,000 మీ3 (1,882,476 acre⋅ft)[1]
ఉపరితల వైశాల్యం451 కి.మీ2 (174 చ. మై.)

గోదావరి నదిపై నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలములో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది.[2] దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరినదిపై తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరువాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు ఇది. దీనికి కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ అనే మూడు కాల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల నిజామాబాదు జిల్లా కంటే ఇతర జిల్లాలకే అధికలాభం చేకూరినది.[3] 1963లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలం నీటిని నిల్వచేసి నీటిపారుదలకు ఉపయోగపడే జలాశయం గానే ఉండేది. 1983 తర్వాత నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు. ఈ రిజర్వాయర్‌ యొక్క పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 112 టీఎంసీల

పటం
Map

భౌగోళిక ఉనికి

[మార్చు]

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లా కేంద్రమైన నిజామాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 44 వ నెంబరు జాతీయ రహదారి నుండి 3 కిలోమీటర్లు లోనికి ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రం నిర్మల్ పట్టణం నుండి దీని దూరం 20 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు 18°58' ఉత్తర అక్షాంశం, 78°19' తూర్పు రేఖాంశం పై ఉంది.

ప్రారంభం

[మార్చు]

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 1953లో హైదరాబాదు రాష్ట్రంలో ప్రతిపాదించబడింది. 1963లో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగానే సేవలందించగా, రెండు దశబ్దాల అనంతరం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి హయాంలో ఈ ప్రాజెక్టు విద్యుదుత్పాదన ప్రాజెక్టుగా అవతరించింది.

నిర్మాణం

[మార్చు]

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 75 శాతం డిపెండెబిలిటీపై సుమారు 156 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, దీంతో 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించి, 196 టీఎంసీల నీటిని వినియోగించుకొనేలా రూపకల్పన చేయబడింది. 1964లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనులు రెండు దశాబ్దాలపాటు కొనసాగాయి. దాంతో అంచనా వ్యయం 15 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్సారెస్పీ ప్రధాన కాలువలతోపాటు, డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణ చేశారు. 2,000 కోట్ల రూపాయలతో కాకతీయ కెనాల్‌తోపాటు ఉపకాలువలను బాగు చేయించారు. వానకాలం, యాసంగి కలిపి ఎస్సారెస్పీ కింద రెండు పంటలకు 24,30,753 ఎకరాలకు సాగు నీరందుతోంది.[4]

జలాశయ సామర్థ్యం

[మార్చు]
  • శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిష్ఠ ఎత్తు 1091 అడుగులు,
  • జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపుటడుగులు
  • ఈ ప్రాజెక్టునకు మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి.
  • ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాఆయె కాలువలు: కాకతీయ కాల్వ 284 కి.మీ, సరస్వతి కాల్వ 47 కి.మీ, లక్ష్మి కాల్వ 3.5 కి.మీ, వరద కాల్వ.
  • విద్యుదుత్పత్తి సామర్ద్యం 36 మెగావాట్లు, మూడు టర్బయిన్‌ల సహాయంతో కాకతీయ కాలువకు నీటి విడుదలచేస్తారు.

నీటి ప్రవాహం, విడుదల

[మార్చు]

2023 జూలైలో పడిన భారీ వర్షాల వల్ల ఈ ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం పెరగడంతో జూలై 27న ప్రాజెక్టు 26 గేట్లను, జూలై 31న 16 గేట్లను ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. ఇందులో ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 52,548 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 52,548 క్యూసెక్కులుగా ఉంది.[5]

కామారెడ్డి ఎత్తిపోతల పథకం

[మార్చు]

నిజామాబాదు జిల్లా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 83 గ్రామాలకు తాగునీటిని అందించడానికి శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా అందించడానికి రూ. 140 కోట్లతో ఒక పథకాన్ని చేపట్టనున్నారు. దీని ద్వారా కామారెడ్డి, తాడ్వాయి, సదాశివ నగర్, దోమకొండ, బిక్నూరు, మాచారెడ్డి మండలాలకు తాగునీటు అందుతుంది. ఈ పథకం పూర్తి కావడానికి సుమారు 520 కిలో మీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సుమారు 5 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 20 August 2014. Retrieved 26 August 2014.
  2. ఈనాడు. "శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  3. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 36
  4. telugu, NT News (2022-12-17). "శ్రీరాంసాగర్‌ పరవశం.. 60 ఏండ్ల చరిత్రను తిరగరాసిన ప్రాజెక్టు". www.ntnews.com. Archived from the original on 2022-12-19. Retrieved 2023-07-31.
  5. "SRSP: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద.. 26 గేట్లు ఎత్తివేత". Sakshi. 2023-07-27. Archived from the original on 2023-07-31. Retrieved 2023-07-31.