శ్రీసిటీ
శ్రీసిటీ | |
---|---|
టౌన్ | |
Coordinates: 13°33′28″N 80°01′46″E / 13.557673°N 80.029489°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
విస్తీర్ణం | |
• Total | 69.88697 కి.మీ2 (26.98351 చ. మై) |
• Rank | 24 |
• Rank | 414 |
Languages | |
• Official | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
శ్రీసిటీ లేదా సత్యవేడు రిజర్వ్ ఇన్‌ఫ్రా సిటీ (Satyavedu Reserve Infracity Pvt. Ltd)[3] ఆంధ్రప్రదేశ్ లో 16 వ జాతీయ రహదారి పక్కనే ఉన్న పారిశ్రామిక వాడ. ఇది తిరుపతి జిల్లాలో విస్తరించి ఉంది.
భౌగోళికం
[మార్చు]ఇది 13°29'50" & 13°34'40" ఉత్తర అక్షాంశాలు, 79°57'30" & 80°02'50" తూర్పు రేఖాంశాల మధ్య, సగటున 20 మీటర్ల ఎత్తులో ఉంది. MSL (66 ft) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వ్యాపించివుంది. ఇది స్వర్ణ చతుర్భుజంలో భాగమైన NH 5 పక్కన ఉంది. తడకు ఉత్తరాన కరిపేటి కాలవ పులికాట్ సరస్సును చేరే మార్గంలో శ్రీ సిటీ గుండా ప్రవహిస్తుంది. పశ్చిమ సరిహద్దులో అటవీ ప్రాంతం ఉంది. కృష్ణా నది నీటిని చెన్నైకి తీసుకువెళ్లే తెలుగు గంగ ప్రాజెక్ట్ శ్రీ సిటీ పశ్చిమ సరిహద్దులోవుంది.
ప్రత్యేక ఆర్థిక మండలి
[మార్చు]ఈ ప్రాంతం పారిశ్రామికం, జనావాసాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వినోద రంగాల కోసం విభజించబడి ఉంది. సమీకృత పట్టణంలో పారిశ్రామిక, నివాస, విద్యా, వాణిజ్య, వినోద వలయాలున్నాయి. పారిశ్రామిక విభాగంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో ఎగుమతి కోసం ఉద్దేశించిన పరిశ్రమలకు, దేశీయ ఉత్పత్తులకు వేర్వేరు ఉపవలయాలున్నాయి. ఈ వ్యవస్థ ఉత్పత్తి, సేవలు, వాణిజ్య రంగాలలోని బహళదేశీ సంస్థలకు అనువుగా వుంటుంది.[4]
ప్రత్యేక ఆర్థిక మండలిని సింగపూరుకు చెందిన జురాంగ్ కన్సల్టంట్స్[5] అనే సంస్థ రూపకల్పన చేసింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇది రూపకల్పన చేశారు.[6] దీనిని ఆంధ్రప్రదేశ్ వ్యాపార అవస్థాపన సంస్థ (Andhra Pradesh Industrial Infrastructure Corporation (APIIC))[7], పారిశ్రామిక ప్రాధికార స్థానిక సంస్థ నిర్వహణలో సహాయపడతాయి. భారత వ్యాపార, పారిశ్రమల మంత్రిత్వశాఖ నియమించిన కమీషనర్ కు ఈ ప్రాంత నిర్వహణ బాధ్యత వుంటుంది.
సంస్థలు
[మార్చు]- క్రియా విశ్వవిద్యాలయం
- శంకర నేత్రాలయా
- ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ రీసర్చ్ IFMR (India)
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ
- చిన్మయా విద్యాలయా [8]
రవాణా సౌకర్యాలు
[మార్చు]భారత జాతీయ రహదారి 16 మార్గం ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంది.[9] సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు తడ, ఆరంబాకంలో ఉన్నాయి.[10] ఇక్కడికి సమీప విమానాశ్రయాలు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (86 కి.మీ), తిరుపతి విమానాశ్రయం (82 కి.మీ). దీనికి దగ్గరల్లో ఉన్న ఓడరేవులు చెన్నై, ఎన్నూరులో ఉన్నాయి. దీనికి ఉత్తరంగా 100 కి.మీ దూరంలో కృష్ణపట్నం ఓడరేవు కూడా ఉంది.[11]
ఇది కూడ చూడు
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sri city".
- ↑ "SEZ Benefits in India". Archived from the original on 2017-05-14. Retrieved 2022-03-22.
- ↑ "SEZs in AndhraPradesh | Andhra Pradesh Industrial Infrastructure Corporation". Archived from the original on 2021-04-18. Retrieved 2022-03-16.
- ↑ Multi-product SEZ at Nellore-Source-Financial Express
- ↑ Sri City Master-planned by Jurong Consultants, Singapore – Source – Site Selection Magazine Online
- ↑ Sri City SEZ eyes Rs 20,000-cr turnover-Source-The Hindu Business Line
- ↑ "SEZs Assisted by APIIC-Source-Andhra Pradesh Industrial Infrastructure Corporation". Archived from the original on 2012-05-12. Retrieved 2022-03-22.
- ↑ "SEZ India - Customers, Clients, Special Economic Zone, VRV, Venture, Busanaremaja Agracipta, EURA, BFG, Free Trade Zone, Industrial Park, SEZ". www.sricity.in. Archived from the original on 2015-05-09. Retrieved 2016-04-25.
- ↑ "Set up Nano car project in Sathyavedu SEZ". The Hindu (in Indian English). 31 August 2008. Archived from the original on 14 సెప్టెంబరు 2008. Retrieved 24 January 2016.
- ↑ "TADA/Tada (3 PFs) Railway Station Map/Atlas – India Rail Info". India Rail Info. Retrieved 24 January 2016.
- ↑ Special Economic Zones in India: Recent Developments and Future Prospects, Sri City distance from Chennai, Ennore and Krishnapattnam Ports, refer Page 8-Source-Indian Institute of South Asian Studies, National University of Singapore [1] Archived 11 అక్టోబరు 2010 at the Wayback Machine