సత్యబ్రాత రౌత్
సత్యబ్రాత రౌత్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా |
వృత్తి | నాటక దర్శకుడు |
సత్యబ్రాత రౌత్, ఒడిశా రాష్ట్రానికి చెందిన నాటకరంగ దర్శకుడు, రచయిత, ప్రొఫెసర్.[1][2] నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఫ్యాకల్టీ సభ్యుడిగా బోధన చేశాడు. ప్రస్తుతం హైదరాబాదులోని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, నాటకశాఖ విభాగానికి అధిపతిగా ఉన్నాడు. భారతదేశంలో విజువల్ థియేటర్‌కి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. 2016లో న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నాటకరంగంలో దర్శకత్వ కృషికి సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు.[3][4][5]
జననం, విద్య
[మార్చు]సత్యబ్రాత రౌత్ 1958, మార్చి 17న ఒడిశాలో జన్మించాడు. 1977లో రావెన్‌షా విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. 1983లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి[6] అక్కడ డిజైన్, దర్శకత్వంలో స్పెషలైజేషన్‌తో నాటకరంగంలో మాస్టర్స్ డిగ్రీ చేసాడు.[7] మీరట్‌లోని సిసిఎస్ విశ్వవిద్యాలయం నుండి "భారతీయ నాటకరంగంపై బివి కారంత్ ప్రభావం: ఒక అధ్యయనం" అనే అంశంపై తన పిహెచ్.డి., "న్యూ డైరెక్షన్ థియరీస్"పై ఐకెఎస్వి ఖైరాఘడ్ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ చేసాడు.
దర్శకత్వం వహించిన నాటకాలు
[మార్చు]- పస్సా (1988)
- నాగమండలం (1993)
- ఊరుభంగం (1994)
- బాజీ (1998)
- హేవదన్ (2002)
- రషోమోన్ (2005)
- పిగ్మాలియన్ (2007)
- 30 డేస్ ఇన్ సెప్టెంబర్ (2008)
- ఏవం ఇంద్రజిత్ (2010)
- మాట్టే ఏకలవ్య (వెయిటింగ్ ఫర్ గోడాట్ ) (2011)
- మృగ్ తృష్ణ (2012)
- యానిమల్ ఫామ్ (2013)
- తుమ్హారా విన్సెంట్ (2015)[4]
- రెత్ (2016)
- శకుంతల (2019)
అవార్డులు
[మార్చు]- 2013లో 'మట్టే ఏకలవ్య' (మరోసారి ఏకలవ్య) కోసం మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డు[8]
- 2015లో 'తుమ్హారా విన్సెంట్' నాటకానికి ఉత్తమ మాన్యుస్క్రిప్ట్ అవార్డు ద్వారా సాహిత్య కళా పరిషత్ అవార్డు
- నాటకరంగానికి చేసిన సేవలకు మనోహర్ సింగ్ స్మృతి పురస్కారం[9]
- 2016లో నాటకరంగంలో దర్శకత్వ కృషికి సంగీత నాటక అకాడమీ అవార్డు[3]
- నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ద్వారా 2019లో బివి కారంత్ మెమోరియల్ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ "Satyabrata Rout gets Sangeet Natak Akademi Puraskar". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2023-02-11.
- ↑ "Satyabrata Rout: Deccan Chronicle". deccanchronicle.com. India: Deccan Chronicle. Archived from the original on 2023-02-11. Retrieved 2023-02-11.
- ↑ 3.0 3.1 AuthorTelanganaToday. "Hyderabad varsity's Satyabrata Rout receives Sangeet Natak Akademi award". Telangana Today. Retrieved 2023-02-11.
- ↑ 4.0 4.1 "CUR_TITLE". sangeetnatak.gov.in. Sangeet Natak Akademi. Retrieved 2023-02-11.
- ↑ "सत्यव्रत राउत: खुरदुरी रूह का रचनाकार". aajtak.intoday.in. Retrieved 2023-02-11.
- ↑ "delhi/wp-content/uploads" (PDF). nsd.gov.in. Retrieved 2023-02-11.
- ↑ Datta, Sravasti (2013-04-25). "A retelling of Ekalavya". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-02-11.
- ↑ Singh, Pallavi (2013-04-20). "Theatre | Hullabaloo in the hinterland". Mint (in ఇంగ్లీష్). Retrieved 2023-02-11.
- ↑ IANS (2019-03-26). "National School of Drama awards 19 seasoned graduates". Business Standard India. Retrieved 2023-02-11.