సునీల్ దత్
సునీల్ దత్ | |
---|---|
మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ (ఇండియా) | |
In office 2004 మే 22 – 2005 మే 25 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | విక్రమ్ వర్మ |
తరువాత వారు | మణిశంకర్ అయ్యర్ |
పార్లమెంటు సభ్యుడు, (లోక్ సభ) | |
In office 1984–1996 | |
అంతకు ముందు వారు | రామ్ జెఠ్మలానీ |
తరువాత వారు | మధుకర్ సర్పోత్దార్ |
నియోజకవర్గం | ముంబయి నార్త్ వెస్ట్ (లోక్ సభ నియోజకవర్గం) |
In office 1999–2005 | |
అంతకు ముందు వారు | మధుకర్ సర్పోత్దార్ |
తరువాత వారు | ప్రియా దత్ |
నియోజకవర్గం | ముంబై నార్త్ వెస్ట్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | బాల్‌రాజ్ దత్ 1929 జూన్ 6 నక్కా ఖుర్ద్, పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్),[1][2] |
మరణం | 2005 మే 25 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 75)
మరణ కారణం | గుండెపోటు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | |
సంతానం | 3, సంజయ్ దత్, ప్రియా దత్ సహా |
నివాసం | బాంద్రా, వెస్ట్రన్ సబర్బ్స్, ముంబై |
కళాశాల | జై హింద్ కళాశాల |
వృత్తి |
|
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (1968) |
సునీల్ దత్ (జూన్ 6 1930 – మే 25 2005) అసలు పేరు బాల్ రాజ్ దత్. ఈయన ప్రముఖ భారత సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సునీల్ క్రీడా, యువజన వ్యవహారాల శాఖా మంత్రిగా వ్యవహరించారు. ఆయన కొడుకు సంజయ్ దత్ కూడా ప్రముఖ నటుడే. ఆయన కూతురు ప్రియ దత్ మాజీ ఎంపిగా పని చేశారు.[3]
1968లో భారత ప్రభుత్వం సునీల్ ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరి, వాయువ్య ముంబై నియోజకవర్గం నుండి 5సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]సునీల్ దత్ 6 జూన్ 1930న[4] పాకిస్థానీ పంజాబ్ లోని ఝేలం మండలంలోని ఖుర్ద్ గ్రామంలో పుట్టారు.[1][2] ఆయన 5వ ఏటనే తన తండ్రి చనిపోయారు. 18వ ఏట భారతదేశం ఇండియా, పాకిస్థాన్ లుగా విడిపోయింది. సునీల్ తండ్రి యొక్క ముస్లిం స్నేహితుడు యాకూబ్ వీరికుటుంబాన్ని కాపాడారు.[5] తరువాత పంజాబ్ లోని యమునా నగర్ సమీపంలోని మండేలీ అనే గ్రామంలో స్థిరపడ్డారు. ఈ గ్రామం యమునా నది ఒడ్డున ఉంది. ప్రస్తుతం ఈ యమునా నగర్ హర్యానా ప్రాంతంలోని ఒక మండలం. ఆ తరువాత లక్నోకు మారారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో అమీనాబాద్ గల్లీలో గడిపారు సునీల్. ముంబైలోని జై హింద్ కళాశాలలో చదువుకుని, నగరంలోని బెస్ట్ ట్రాన్స్ పోర్ట్ డివిజన్ లో ఉద్యగం చేశారు.[6]
కెరీర్
[మార్చు]రేడియో కార్యక్రమాలతో కెరీర్ ప్రారంభించారు సునీల్. సిలోన్ రేడియోలో హిందీ ప్రసారాల్లో ఆయన చాలా ప్రఖ్యాతులు. దక్షిణ ఆసియాలో ఈ సిలోన్ రేడియో చాలా ప్రసిద్ధమైనది. 1955లో విడుదలైన రైల్వే ప్లాట్ ఫాం సినిమాతో మొదటిసారి నటునిగా పరిచయం అయ్యారు ఆయన.
1957లో విడుదలైన మదర్ ఇండియా సినిమాతో స్టార్ గా ఎదిగారు సునీల్. ఈ సినిమాలో తనతో కలసి నటించిన నర్గిస్ దత్ నే 11 మార్చి 1958న వివాహం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అగ్నిప్రమాదం జరగగా, నర్గిస్ ను సునీల్ కాపాడి ఆమె ప్రేమను గెలుచుకున్నారని అప్పట్లో చెప్పుకునేవారు.
వీరి కుమారుడు సంజయ్ దత్ కూడా విజయవంతమైన నటుడు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు. ప్రియ దత్, నమ్రతా దత్. మదర్ ఇండియా సినిమాలో తనతో కలసి నటించిన రాజేంద్ర కుమార్ కొడుకు కుమార్ గౌరవ్ కు ఇచ్చి తన రెండో కూతురు నమ్రతా దత్ కు ఇచ్చి వివాహం చేశారు సునీల్.
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]- 1963 – ముఝే జానే దో సినిమాకిగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు
- 1964 – యాదే సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా, హిందీ భాషలోని ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులు
- 1965 – ఖాందాన్ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు
- 1967 – మిలన్ సినిమాకు బి.ఎఫ్.జె.ఎ అవార్డులు అందించిన ఉత్తమ నటుడు పురస్కారం[7]
- 1968 – పద్మశ్రీ
- 1982 –షరీఫ్ ఆఫ్ ముంబై
- 1995 – ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం
- 1997 – స్టార్ స్క్రీన్ జీవిత సాఫల్య పురస్కారం
- 1998 – రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన పురస్కారం[8]
- 2000 – ఆనందలోక్ అవార్డులు ఇచ్చిన జీవిత సాఫల్య పురస్కారం
- 2001 –జీ సినీ అవార్డులు అందించిన జీవిత సాఫల్య పురస్కారం
- 2005 – దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ చే ఫాల్కే రత్న అవార్డు[9]
- ఐ.ఐ.ఎఫ్.ఎస్, లండన్, గ్లోరీ ఆఫ్ ఇండియా అవార్డ్ అందించింది.[10]
సినిమాలు
[మార్చు]చిత్రం | పాత్ర |
---|---|
రైల్వే ప్లాట్ ఫాం (1955) | రామ్ |
కుందన్ (1955) | అమృత్ |
ఏక్ హీ రాస్తా (1956) | అమర్ |
కిస్మత్ కా ఖేల్ (1956) | ప్రతాప్ |
మదర్ ఇండియా (1957) | బిర్జు |
సాధన (1958) | మోహన్ |
సుజాత (1959) | అధిర్ |
ఇన్సాన్ జాగ్ ఉఠా (1959) | రంజీత్ |
ఏక్ ఫూల్ చార్ కాంతే (1960) | సంజీవ్ |
హమ్ హిందుస్తానీ (1960) | సురేంద్ర నాథ్ |
చయ్యా (1961) | అరుణ్ / రహీ |
మై చుప్ రహూంగీ (1962) | కమల్ కుమార్ |
గుమ్రాహ్ (1963) | రాజేంద్ర |
ముఝే జీనే దో (1963) | ఠాకూర్ జర్నైల్ సింగ్ |
నర్తకి (1963) | ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ |
యే రాస్తే హై ప్యార్ కే (1963) | అనిల్ కుమార్ జి. సహ్నీ |
ఆజ్ ఔర్ కల్ (1963) | డాక్టర్.సంజయ్ |
బేటీ బేటే (1964) | రాము |
యాదేం (1964) | అనిల్ |
గజల్ (1964) | ఈగజ్ |
ఖాందాన్ (1965) | గోవింద్ |
వక్త్ (1965) | రవి |
మేరా సాయా (1966) | ఠాకూర్ రాకేష్ సింగ్ |
హమ్రాజ్ (1967) | కుమార్ |
మెహెర్బాన్ (1967) | |
మిలన్ (1967) | గోపి |
పడోసన్ (1968) | భోలా |
గౌరి (1968) | సునిల్ |
చిరగ్ (1969) | అజయ్ సింగ్ |
జ్వాలా (1971) | |
రేష్మ ఔర్ షెరా (1971) | షేరా |
జమీన్ ఆస్మాన్ (1972) | రవి |
హీరా (1973) | హీరా |
గీతా మేరా నామ్ (1974) | జానీ |
36 గంటే (1974) | హిమ్మత్ |
జఖ్మీ (1975) | |
నాగిన్ (1976) | ప్రొఫెసర్ విజయ్ |
దరిందా (1977) | |
పాపీ (1977) | రాజ్ కుమార్ |
కాలా ఆద్మీ (1978) | బిర్జూ |
డాకూ ఔర్ జవాన్ (1978) | |
జానీ దుష్మన్ (1979) | లఖన్ |
అహింసా (1979) | బిర్జూ |
షాన్ (1980) | ఇన్ స్పెక్టర్ శివ్ కుమార్ |
రాకీ (1981) | రాకీ తండ్రి (అతిధి పాత్ర) |
బద్లేకీ ఆగ్ (1982) | లఖన్ |
దర్ద్ కా రిష్తా (1982) | డాక్టర్. రవి |
రాజ్ తిలక్ (1984) | జై సింగ్ |
ఫాస్లే (1985) | విక్రమ్ |
ధర్మ్ యుద్ధ్ (1989) | |
ఖుర్బాన్ (1991) | పృధ్వీ సింగ్ |
యే ఆగ్ కబ్ భుజేగీ (1991) | |
పరంపరా (1992) | ఠాకూర్ భవానీ సింగ్ |
ఫూల్ (1993) | బలరామ్ చౌదరి |
క్షత్రియా (1993) | మహారాజా భవానీ సింగ్ |
మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ (2003) | హరిప్రసాద్ శర్మ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Kumar, Shiv (25 May 2005). "Sunil Dutt is no more". The Tribune. Retrieved 2016-03-27.
- ↑ 2.0 2.1 "Bollywood legend Sunil Dutt dies". BBC News. 25 May 2005. Retrieved 2016-03-27.
- ↑ "Current Lok Sabha Members Biographical Sketch". Web.archive.org. Archived from the original on 12 నవంబరు 2007. Retrieved 18 జూలై 2016.
- ↑ "Zee Premiere- The Triumph of Spirit". May 2001. Archived from the original on 28 జనవరి 2016. Retrieved 18 January 2001.
- ↑ "'We all are one, whichever religion we belong to'". Rediff.com. 25 May 2005. Retrieved 12 July 2013.
- ↑ "Sunil Dutt: The Man Stardom Never Dared to Change". The Quint. Retrieved 2016-02-28.
- ↑ [1] Archived 13 January 2009 at the Wayback Machine.
- ↑ "Sunil Dutt – film star, peace activist, secularist, politician extraordinary". The Hindu. Chennai, India. 26 May 2005. Archived from the original on 27 మే 2005. Retrieved 18 జూలై 2016.
- ↑ "Phalke award for B.R. Chopra : Happenings News". ApunKaChoice.Com. 3 April 2008. Archived from the original on 1 అక్టోబరు 2012. Retrieved 12 July 2013.
- ↑ "Tribute to a son of the soil". The Telegraph. Calcutta, India. 25 May 2007.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 13వ లోక్సభ సభ్యులు
- 14వ లోక్సభ సభ్యులు
- 1929 జననాలు
- 2005 మరణాలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు