Jump to content

సూర్యకాంతం (2019 సినిమా)

వికీపీడియా నుండి
సూర్యకాంతం
సూర్యకాంతం సినిమా పోస్టర్
దర్శకత్వంప్రణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి
నిర్మాతసందీప్ ఎర్రంరెడ్డి
సృజన్ ఎరబోలు
తారాగణంనీహారిక కొణిదెల
రాహుల్ విజయ్
పెర్లెన్ భేసానియా
శివాజీ రాజా
సుహాసిని
ఛాయాగ్రహణంహరి జాస్తి
కూర్పురవితేజ గిరిజల
సంగీతంమార్క్ కె రాబిన్
నిర్మాణ
సంస్థ
నిర్వాణ సినిమాస్[2]
విడుదల తేదీ
29 మార్చి 2019 (2019-03-29)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

సూర్యకాంతం 2019, మార్చి 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. నిర్వాణ సినిమాస్ పతాకంపై సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ ఎరబోలు నిర్మాణ సారథ్యంలో[3] ప్రణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లీన్ భేసానియా, శివాజీ రాజా, సుహాసిని తదితరులు నటించగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు.[4]

సూర్యకాంతం (నిహారిక) పేరుకు తగ్గట్టే ఎవరికీ అర్ధం కాని ఓ వింత పాత్ర. తనకు నచ్చింది మాత్రమే చేస్తుంది. ఎవ్వరి కోసం తను మారదు. ఎవరూ తనకోసం మారాలని అనుకోదు. తనకు తానే ముద్దు.. తన తరువాతే ఎవరైనా. ఇలాంటి ఇంట్రస్ట్రింగ్ క్యారెక్టర్‌ని తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు అమాయకపు అభి (రాహుల్ విజయ్). లవ్, కమిట్మెంట్, ఎమోషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండే సూర్యకాంతం.. అభి ప్రేమను వద్దంటూనే అట్రాక్ట్ అవుతుంది. అదే సందర్భంలో అభి లవ్ ప్రపోజ్‌కి ఎలా స్పందించాలా తెలియని కన్ఫ్యూజన్‌లో ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళిపోతుంది. దీంతో అభి చిన్ననాటి స్నేహితురాలు పూజతో (పెర్లిన్ భెసానియా)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. వీరి కథ పెళ్లితో సుఖాంతం అవుతుందనుకుంటున్న సందర్భంలో సూర్యకాంతం కథలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ప్రణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి
  • నిర్మాణం: సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ ఎరబోలు
  • సంగీతం: మార్క్ కె రాబిన్ సంగీతం
  • సినిమాటోగ్రఫీ: హరి జస్తి
  • కూర్పు: రవితేజ గిరిజల
  • నిర్మాణ సంస్థ: నిర్వాణ సినిమాస్

పాటలు

[మార్చు]
Untitled

ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు.

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:

సం.పాటగాయకులుపాట నిడివి
1."ఇంతేనా ఇంతేనా"సిద్ శ్రీరామ్, శక్తిశ్రీ గోపాలన్ 
2."బిస్కట్"మౌనిక రెడ్డి 
3."పో పోవే"కార్తీక్ 
4."బ్రేకింగ్ మై హార్ట్"సునీత సారధి 
5."నేనేనా నేనేనా"సిద్ శ్రీరామ్, శక్తిశ్రీ గోపాలన్ 
6."ఫ్రైడే నైట్ బేబి"రోల్ రైడా (రాప్స్), అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ 

స్పందన

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చింది. "సూర్యకాంతం పాత్ర ఆడపిల్లల బాధల నుండి రిఫ్రెష్ చేసేలా ఉంది" అని రాసింది.[5] "సినిమా ఇతివృత్తం కొత్తగా లేదు, చిత్రం పూర్తయ్యేసరికి మరొక వెబ్ సిరీస్ ని వెండితెరపై చూసినట్టు అనిపిస్తుంది" అని ది హిందూ పత్రికలో రాశారు.[6] న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది.[7] "బలహీనమైన కథ, ఎక్కువ నిడివి ఉన్న సన్నివేశాలు ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్ గా ఉన్నప్నటికి ఒక్కసారి చూడదగ్గ మంచి చిత్రమిది" అని ది హన్స్ ఇండియా పత్రిక రాసింది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Vyas (29 March 2019). "Suryakantham Movie Review & Rating {2.75/5}". The Hans India. Retrieved 31 October 2020.
  2. "Niharika Konidela preps for the pre-release event of Suryakantham by humming Po Pove song from the movie". The Times of India. Retrieved 31 October 2020.
  3. "Suryakantham will be a huge hit: Vijay Deverakonda". The Times of India. Retrieved 31 October 2020.
  4. "I play a girl who can be an angel and a nightmare at the same time in my next: Niharika Konidela". The Times of India. Retrieved 31 October 2020.
  5. 5.0 5.1 "Suryakantham movie review {2.5/5}: A wacky tale turns into a sob-fest!". The Times of India. Retrieved 31 October 2020.
  6. 6.0 6.1 Chowdhary, Y. Sunita (30 March 2019). "Not quite absorbing". The Hindu. Retrieved 31 October 2020.
  7. "'Suryakantham' review: Too much of Kantham". The New Indian Express. Retrieved 31 October 2020.

ఇతర లంకెలు

[మార్చు]