అజిత్ అగార్కర్

వికీపీడియా నుండి

1977 డిసెంబర్ 4ముంబాయి లో జన్మించిన అజిత్ అగార్కర్ భారతదేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతని పూర్తి పేరు అజిత్ భాలచంద్ర అగార్కర్ (Ajit Bhalchandra Agarkar} (Marathi:अजित भालचंद्र आगरकर).తన క్రీడాజీవితం ప్రారంభంలోనే వన్డే క్రికెట్ లో అత్యంతవేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టులలో కూడా 2002 లో లార్డ్స్ లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్ గా బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ సాధించాడు.

[మార్చు] వ్యక్తిగతం

చిన్నప్పుడు అజిత్ శివాజీ పార్క్ లో నివాసముండే అతని తాతయ్య ఇంట్లో పెరిగాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై క్రికెటర్లు ఇక్కడ సాధన చేసిన వారే. అజిత్ అగార్కర్ ప్రస్తుతం ముంబాయి లోని వోర్లి లో నారాయణ పూజారి నగర్ అనే ప్రాంతంలో నివాసముంటున్నాడు. అజిత్ మతుంగ లోని రూపారెల్ కళాశాల లో చదివాడు.అగార్కర్ ఫాతిమా ఘడియాలీ ని వివాహం చేసుకున్నాడు. [1]వారికి రాజ్ అనే కుమారుడున్నాడు.

1998 లో కోచి లోని నెహ్రూ స్టేడియం లో తన తొలి వన్డే మ్యాచ్ ఆడినాడు. అందులో కొద్ది పరుగులకే ఆడం గిల్‌క్రిస్ట్ చేతిలో ఔటైనాడు. అగార్కర్ వన్డే లో సాధించిన మరో ప్రపంచ రికార్డు 200 వికెట్లు మరియు 1000 పరుగులు అతి తక్కువ మ్యాచ్‌లలో సాధించడం. అగార్కర్ ఈ ఘనతకు కేవలం 133 వన్డేలలో సాధించి ఇంతకు క్రితం దక్షిణాఫ్రికా కు చెందిన షాన్ పోలాక్ రికార్డును అధికమించాడు.

వన్డేలలో రికార్డులు సృష్టించిననూ టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఒకటి, రెండు సందర్భాలు మినహా అతని గణాంకాలు పేవలంగా ఉన్నాయి. 2003 లో ఆస్త్రేలియా పై అడిలైడ్ టెస్ట్ లో 41 పరుగులకు 6 వికెట్లు సాధించి రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ విజయం సాధించుటకు కృషిచేశాడు.

[మార్చు] మూలాలు

  1. http://timesofindia.indiatimes.com/articleshow/468425.cms
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు