అతినీలలోహిత ఛాయాగ్రహణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అతినీలలోహిత ఛాయాగ్రహణం అనునది సంపూర్ణ వర్ణపటం నుండి కేవలం అతినీలలోహిత శ్రేణి కాంతిని ఉపయోగించే ఒక ఛాయాగ్రహపు ప్రక్రియ.

పర్యావలోకనం[మార్చు]

335 నుండి 365 ఎన్ ఎం తరంగ దైర్ఘ్యం గల అతినీలలోహిత కాంతిలో తీసిన ఒక మానవుని ముఖం యొక్క ఫోటో.

మానవ నేత్రానికి కనబడే కాంతి వర్ణపటంలో 400 నుండి 750 న్యానోమీటర్ల వరకు ఉంటుంది. (ఎటువంటి మానవ నిర్దేశాలు లేకుండానే) సాధారణ ఛాయాగ్రహణంలో ఇదే శ్రేణి ధార్మికత (అప్రమేయంగా) ఉపయోగించబడుతుంది. 1 ఎన్ ఎం నుండి 400 ఎన్ ఎం వరకూ ఉండే ధార్మికతని అతినీలలోహిత ధార్మికత అంటారు. అతినీలలోహిత వర్ణపట అనుభవజ్ఞలు దీనిని మూడు విభాగాలుగా విభజించారు.

  • సమీప అతినీలలోహితం (near UV లేదా NUV: 380–200 ఎన్ ఎం తరంగ దైర్ఘ్యం గలది)
  • దూర అతినీలలోహితం (far UV/vacuum UV లేదా FUV/VUV : 200–10 ఎన్ ఎం త దై)
  • తీవ్ర అతినీలలోహితం (extreme UV లేదా EUV/XUV: 1–31 ఎన్ ఎం త దై)

పలు కారణాల వలన అతినీలలోహిత ఛాయాగ్రహణానికి సమీప అతినీలలోహిత విభాగాన్నే వినియోగిస్తారు. సాధారణ వాయు 200 ఎన్ ఎం కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం వద్ద అపారదర్శకంగా ఉంటుంది. 180 ఎన్ ఎం కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం వద్ద కటకంలో వాడే గాజు అపారదర్శకంగా ఉంటుంది. అతినీలలోహిత ఛాయాగ్రహకులు సమీప అతినీలలోహితాన్ని మరల మూడుగా విభజించారు.

  • సుదీర్ఘ తరంగ అతినీలలోహితం (Long wave UV లేదా UV-A: 320 నుండి 400 ఎన్ ఎం)
  • మధ్యమ తరంగ అతినీలలోహితం (Medium wave UV లేదా UV-B: 280 నుండి 320 ఎన్ ఎం)
  • హ్రస్వ తరంగ అతినీలలోహితం (Short wave UV లేదా UV-C: 200 నుండి 280 ఎన్ ఎం)

అతినీలలోహిత ధార్మికతని ఉపయోగించి తీసే ఫోటోలని తీసే విధానాలు రెండు. అవి పరావర్తిత అతినీలలోహిత ఛాయాగ్రహణం, అతినీలలోహిత ప్రతిదీప్తి ఛాయాగ్రహణం. పరావర్తిత అతినీలలోహిత ఛాయాగ్రహణం వైద్యశాస్త్రము, చర్మ వ్యాధులని నయం చేయటానికి, నేర పరిశోధానా రంగం, నాటక రంగాలలో వినియోగిస్తారు. అతినీలలోహిత ధార్మికత సూర్యకాంతిలో విరివిగా లభ్యమైననూ, అందులోని నాణ్యత, అది లభించే పరిమాణము వాతావరణ పరిస్థితులని బట్టి ఉంటాయి. పొడి వాతావరణం, ప్రకాశవంతమైన రోజులలో లభించే అతినీలలోహిత ధార్మికత మేఘావృతమైన/వర్షం పడుతున్న రోజులలో లభించేదానికన్నా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యాన్మాయాలుగా (భాస్వరం పూత పూసిన) ఫ్ల్యాష్ లైట్లు కూడా వాడతారు.

పరికరాలు , మెళకువలు[మార్చు]

పరావర్తిత అతినీలలోహిత ఛాయాగ్రహణం[మార్చు]

సబ్జెక్టుపై అతినీలలోహిత దీపాల కాంతిని ప్రసరింపజేస్తారు. కటకానికి ముందు భాగంలో కనిపించే కాంతిని అడ్డుకొనే ఫిల్టర్ ని ఉంచుతారు. దీనితో ఫిల్టర్ గుండా కేవలం అతినీలలోహిత కాంతి మాత్రం కటకం పైకి ప్రసరిస్తుంది.

ఈ ఫిల్టర్లు ప్రత్యేకమైన రంగు గాజుతో తయారు చేస్తారు. వీటిలో చాలా మటుకు ఫిల్టర్లు దైర్ఘ్య అతినీలలోహిత కాంతిని మాత్రం ప్రసరించేలా చేసి (350 ఎన్ ఎం కంటే తక్కువ ఉన్న) మిగతా అతినీలలోహిత కాంతిని మొత్తం కట్టడి చేస్తాయి.

ఉదా:

  • Kodak Wratten 18A
  • B+W 403
  • Hoya U-340
  • Baader U-Filter,
  • Kenko U-360

స్ఫటికముతో చేయబడ్డ లేదా, స్ఫటికము, ఫ్లోరైట్ తో చేయబడ్డ ఫిల్టర్లతో 200 నుండి 180 ఎన్ ఎం వరకూ అతినీలలోహిత కాంతిని గుర్తించగలుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికముతో చేయబడ్డ ఫిల్టర్ లు కనిపించే కాంతికి అతినీలలోహిత కాంతికి మధ్య భేదాన్ని స్పష్టంగా గుర్తించగలవు. ఉదా:

  • Nikon UV Nikkor 105 mm
  • Hasselblad (Zeiss) UV Sonnar 105 mm,
  • Asahi Pentax Ultra Achromatic Takumar 85 mm

అతినీలలోహిత ప్రతిదీప్తి ఛాయాగ్రహణం[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]