ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫి

వికీపీడియా నుండి
(పరారుణ ఛాయాగ్రహణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పరారుణ ఛాయాగ్రహణము లేదా ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ (infrared photography) లో ఇన్ఫ్రారెడ్ కాంతిని గుర్తించగలిగే ఫిలిం గానీ, ఇమేజ్ సెన్సర్ని గానీ ఉపయోగిస్తారు. ఇందులో ఉపయోగించే వర్ణపట భాగాన్ని సమీప పరారుణం (near-infrared) అంటారు. కాగా సుదూర పరారుణం (far-infrared) థర్మల్ ఇమేజింగ్కి ఉపయోగపడే వర్ణపట భాగం. ఇటువంటి ఫోటోగ్రఫీకి ఉపయోగించే తరంగ దైర్ఘ్యాలు 700 ఎన్ ఎం (nm) నుండి 900 ఎన్ ఎం వరకు ఉంటాయి. అయితే ఫిలిం దృశ్యమాన వర్ణపట (కంటికి కనబడే) కాంతిని కూడా గుర్తించగలదు. అందుకే సాధారణ కాంతి మొత్తాన్ని నిరోధించి, కేవలం ఇన్ఫ్రారెడ్ కాంతిని అనుమతించే ఫిల్టర్ (అందుకే ఈ ఫిల్టర్లు నలుపు రంగులోనో లేదా ముదురు ఎరుపు రంగులోనో ఉంటాయి) ని వాడవలసిన అవసరం ఉంటుంది. (ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ కి అర్థం కేవలం ఇన్ఫ్రారెడ్ కాంతిని అనుమతించే ఫిల్టర్ అయినా కావచ్చును, లేదా కేవలం ఇన్ఫ్రారెడ్ కాంతిని నిరోధించే ఫిల్టర్ అయినా కావచ్చు.)

పరారుణ , దృశ్యమాన వర్ణపట ఫోటోల మధ్య భేదం

ఇటువంటి ఫిల్టర్ లని ఇన్ఫ్రారెడ్ కాంతిని గుర్తించగలిగే ఫిలిం/సెన్సర్ లతో కలిపి ఉపయోగించినపుడు ఆసక్తికరమైన ప్రభావానికి గురై ఫోటోలలో అవాస్తవిక రంగులు రావటం, బ్లాక్-అండ్-వైట్ ఫోటోలైతే అవి స్వాప్నికంగా కనబడటం, చెట్లకు ఉన్న పచ్చని ఆకుల పై మంచు పేరుకుపోయినట్లు కనబడటం (వుడ్ ఎఫెక్ట్) జరుగుతుంది. (ఆకులలో ఉండే క్లోరోఫిల్ వలన కొంతవరకు ఇలా జరిగినా అది నామమాత్రమే కానీ, ఈ ప్రభావానికి ఇది అసలు కారణం కాదు. అతినీలలోహిత ఛాయాగ్రహణం, పరారుణ ఛాయాగ్రహణం కనిపెట్టిన రాబర్ట్ విలియమ్స్ వుడ్ పేరుతో ఈ చర్యని అలా సంబోధిస్తారు. దీనికి, ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫిలోని ఫోటోలలో కనబడకుండా పోయే చెక్కకి సంబంధం లేదు.)

రాలీ స్కాటరింగ్ (Rayleigh scattering) వలన, మీ స్కాటరింగ్ ( Mie scattering) వలన ఆకాశం ముదురు రంగుల్లో కనబడటం, వాతావరణంలో పొగమంచు ఉన్నట్టు కనబడటం, ఇన్ఫ్రారెడ్ ఫోటోల ఇతర లక్షణాలు. ముదురు రంగులో కనబడు ఆకాశం నుండి మేఘాలు వేరు చేసినట్లు కనబడతాయి. ఇన్ఫ్రారెడ్ కాంతి యొక్క తరంగాల దైర్ఘ్యం మనుష్యుల చర్మంపై కొన్ని మిల్లీమీటర్ల వరకు చొచ్చుకుని పోయి పాలిపోయినట్టు కనబడటం, కళ్ళు చాలా వరకు నల్లగా కనబడటం జరుగుతుంది.

నడుమ వంతెన గల మిసిసిపీ నది యొక్క పరారుణ చిత్రం. ఎడమ వైపు ఉన్న ఎరుపు రంగులో ఉన్న ఆకులకి, కుడివైపు ఉన్న నీలి రంగులో ఉన్న పార్కింగ్ లాట్ లు , భవనాలకి మధ్యన ఒక ఆనకట్ట కలదు
కంటికి కనబడే కాంతిలో , ఇన్ఫ్రారెడ్ (900nm LP) ఏరియల్ ఫోటోగ్రఫితో టేనస్సీ లోని ఓల్డ్ హికరీ సరస్సు. ప్రయాణీక విమానం నుండి కొద్ది సెకన్ల వ్యవధి లోనే సోనీ H-9 డిజిటల్ కెమెరాతో ఈ ఫోటోలు తీయబడ్డాయి.

చరిత్ర[మార్చు]

ఇన్ఫ్రారెడ్ ని కెమెరా దృష్టికి తీసుకురావడం[మార్చు]

ఫిలిం కెమెరాలు[మార్చు]

కలర్ ఇన్ఫ్రారెడ్ ఫిలింలు[మార్చు]

లభ్యత[మార్చు]

డిజిటల్ కెమెరాలు[మార్చు]

పరారుణ ఛాయాచిత్రాల చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]