Coordinates: 22°18′19″N 74°21′9″E / 22.30528°N 74.35250°E / 22.30528; 74.35250

అలీరాజ్‌పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలీరాజ్‌పూర్
అలీరాజ్‌పూర్
పట్టణం
అలీరాజ్‌పూర్ is located in Madhya Pradesh
అలీరాజ్‌పూర్
అలీరాజ్‌పూర్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్య్థానం
Coordinates: 22°18′19″N 74°21′9″E / 22.30528°N 74.35250°E / 22.30528; 74.35250
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఅలీరాజ్‌పూర్
Population
 (2011)
 • Total28,498
భాషలు
 • అధికారికహిందీ, English
Time zoneUTC+5:30 (IST)

అలీరాజ్‌పూర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్‌పూర్ జిల్లాలోని పట్టణం. 76.5% కంటే ఎక్కువ జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న అలిరాజ్‌పూర్ జిల్లా, భారతదేశంలోని అత్యంత పేద జిల్లాగా పేరుపొందింది.[1][2]

అలీరాజ్‌పూర్ గతంలో సంస్థానం. మధ్య భారతదేశంలోని భోపవర్ ఏజెన్సీలో భాగంగా ఉండేది. ఇది గుజరాత్, మహారాష్ట్రల సరిహద్దులకు సమీపంలో మధ్యప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతంలో ఉంది. అలీరాజ్‌పూర్‌లోని విక్టోరియా వంతెన 1897 రాణి పరిపాలన వజ్రోత్సవం జ్ఞాపకార్థం నిర్మించారు.

జనాభా[మార్చు]

2001 భారత జనగణన ప్రకారం,[3] అలీరాజ్‌పూర్ జనాభా 25,161. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%, ఆరేళ్ళ లోపు పిల్లలు 15% ఉన్నారు.

చరిత్ర[మార్చు]

బ్రిటీష్ రాజ్ కాలంలో అలీరాజ్‌పూర్ అలీరాజ్‌పూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది. [4] 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం లభించిన తరువాత, అలీరాజ్‌పూర్ పాలక కుటుంబం ఢిల్లీకి తరలి వెళ్లింది, అలీ రాజ్‌పూర్ చివరి పాలకుడైన సురేంద్ర సింగ్ 1980 లలో స్పెయిన్‌లో భారత రాయబారిగా పనిచేశారు.

భౌగోళికం[మార్చు]

అలీరాజ్‌పూర్ ప్రధానంగా కొండ. ప్రాంతం. మాజీ అలీరాజ్‌పూర్ తాలూకా ఝాబువా జిల్లాలోని ఝాబువా తాలూకా కంటే పెద్దది. ఇప్పుడు అలీరాజ్‌పూర్ ఒక జిల్లా. రాజ్వరా కోట పట్టణం మధ్యలో ఉంది.

రవాణా[మార్చు]

అలీరాజ్‌పూర్ నుండి ఇండోర్‌కు, సమీప జిల్లాలకూ చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.

2019 అక్టోబరు 30 న అలీరాజ్‌పూర్ నుండి వడోదర లోని ప్రతాప్‌నగర్‌కు కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించారు.

మూలాలు[మార్చు]

  1. "Alirajpur district in Madhya Pradesh poorest in the country: Global report". www.downtoearth.org.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-01. Retrieved 2021-01-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2020-10-18 suggested (help)
  2. "Alirajpur is the Black Hole of Indian Democracy - Politics News , Firstpost". Firstpost. 2019-04-19. Archived from the original on 2021-01-01. Retrieved 2021-01-01.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  4. Malleson, G. B.: An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984