అల్-ఫాతిహా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
       ఖురాన్ యొక్క 1వ సూరా   
الفاتحة
అల్-ఫాతిహా
ప్రారంభం

అరబిక్ వచనం · About this sound Audio file ·ఆంగ్ల అనువాదం


వర్గీకరణ మక్కా
స్థానం జుజ్ 1
నిర్మాణం 6 ఆయత్ లు, 29 పదాలు, 139 అక్షరాలు

సూరా అల్-ఫాతిహా (అరబ్బీ:الفاتحة), ఇస్లాం ధార్మికగ్రంథమైన ఖురాన్ యొక్క ముఖ "పరిచయం" మరియు మొదటి సూరా ఈ సూరా అల్-ఫాతిహా ఇది మక్కీ సూర. ఇందు 7 ఆయత్ లు గలవు. ఇది ఒక దుఆ లేక ప్రార్థన. దీనిని ప్రతి నమాజ్ యందు తప్పకుండా పఠిస్తారు.

తాత్పర్యం[మార్చు]

మూస:ఖురాను సంబంధ అల్లాహ్ ద్వారా సమస్త జనులకు అవతరింపబడ్డ గ్రంథం ఖురాన్. ఇది అరబ్బీ భాష లో గలదు. ఇది దాదాపు ప్రపంచపు అన్ని భాషలలోను గల గ్రంథం. ఈ సూరా అల్-ఫాతిహా క్రింది విధంగా కొనసాగుతుంది. (ఖురాన్: మొదటి సూరా)

ఖురాన్ క్రమం అరబిక్ తెలుగు లో అరబిక్ తెలుగు అనువాదం
1.1 بِسْمِ اللّهِ الرَّحْمـَنِ الرَّحِيم బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం కరుణామయుడు మరియు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించుచున్నాను
1.2 الْحَمْدُ للّهِ رَبِّ الْعَالَمِين అల్-హమ్ దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సకల లోకాల ప్రభువా నీకే మా స్తోత్రములు.
1.3 الرَّحْمـنِ الرَّحِيم అర్రహ్మా నిర్రహీమ్ అనంత కరుణామయుడా!, అపార కృపాశీలుడా!
1.4 مَـالِكِ يَوْمِ الدِّين మాలికి యౌమిద్దీన్ తీర్పు దినపు యజమానీ!
1.5 إِيَّاك نَعْبُدُ وإِيَّاكَ نَسْتَعِين ఇయ్యాక న ఆబుదు వ ఇయ్యాక నస్తయీన్ : మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము.
1.6 اهدِنَــــا الصِّرَاطَ المُستَقِيمَ ఇహ్ దినస్-సిరాత్ అల్-ముస్తఖీమ్ : మాకు సత్యమార్గం చూపించు.
1.7 صِرَاطَ الَّذِينَ أَنعَمتَ عَلَيهِمْ غَيرِ المَغضُوبِ عَلَيهِمْ وَلاَ الضَّالِّين సిరాత్ అల్లజీన అన్-అమ్ త అలైహిమ్ గైరిల్ మగ్ దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ : నీవు దీవించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం, నీ నుంచి దూరం కాని వారి సత్యమార్గం మాకు చూపించు"

ఈ సూరా పఠించడం పూర్తయిన తరువాత ఆమీన్ పలుకవలెను.

లేఖనం[మార్చు]

మొదటి సూరా అల్-ఫాతిహా అజీజ్ ఆఫంది ఖురాన్ వ్రాతప్రతి

ఈ సూరా మొత్తం ఒక ప్రార్థన దుఆ లాగానూ ఒక అమితభక్తుడు తన స్వామిని మొరపెట్టుకోవడంలాగానూ ఉంటుంది. సృష్టికర్తకు సృష్టి ఏవిధంగా వేడుకొంటుందో ఈ సూరాలో గోచరిస్తుంది. భక్తుడు తన ప్రభువును వేడుకొని ప్రసన్నం చేసుకునే వ్యవస్థ ఈ సూరాలోవున్నది.

అవతరణ[మార్చు]

ఇస్లామీయ ధార్మికసాహిత్య వ్యవస్థలో ఉల్లేఖనాలు అతిముఖ్యం. ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా మహమ్మద్ ప్రవక్తపై అల్లాహ్ మక్కాలో అవతరింపజేశాడు. అబూ హురైరా ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా మదీనా లో అవతరింపజేశాడు. ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనమే ముస్తనద్ అని, దాన్నే అందరూ ఆమోదించారు. మరికొందరు ఈ సూరా మక్కా మరియు మదీనా రెండుప్రదేశాలలోనూ అవతరింపబడినదని భావిస్తారు.

ఇతరనామాలు[మార్చు]

హదీసుల ప్రకారం ఈ సూరాకు క్రింది పేర్లు గూడా గలవు.

  • ఉమ్మ్ అల్-కితాబ్ (పుస్తకపు (ఖురాన్) మాత)
  • ఉమ్మ్ అల్-ఖురాన్ (ఖురాన్ (యొక్క) మాత)
  • సూరా అల్-షిఫా (మోక్షమును కలుగజేసే సూరా)
  • అల్-హిజ్ర్

గణాంకాలు[మార్చు]

ఈ సూరాలో 7 ఆయత్ లు , 29 పదములు మరియు 139 అక్షరాలు గలవు.

ప్రాముఖ్యత[మార్చు]

ఎందరో ధార్మిక పండితులు ఈ సూరా ప్రాముఖ్యత గూర్చి చర్చించారు మరియు వివరించారు. ప్రపంచంలోని ప్రతిముస్లిం ప్రతిరోజూ కనీసం 17 సార్లు ఈ సూరా పఠించవలెను. ఇలా పఠించినచో మాత్రమే ప్రార్థనలు పూర్తవును.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=అల్-ఫాతిహా&oldid=1223728" నుండి వెలికితీశారు