Coordinates: 17°50′15″N 80°49′46″E / 17.83744°N 80.829477°E / 17.83744; 80.829477

అశ్వాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్వాపురం
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, అశ్వాపురం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, అశ్వాపురం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, అశ్వాపురం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°50′15″N 80°49′46″E / 17.83744°N 80.829477°E / 17.83744; 80.829477
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం అశ్వాపురం
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 582 km² (224.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 43,067
 - పురుషులు 21,757
 - స్త్రీలు 21,310
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.68%
 - పురుషులు 67.94%
 - స్త్రీలు 49.02%
పిన్‌కోడ్ 507116


అశ్వాపురం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1].ఇది గొల్లగూడెం గ్రామ పంచాయితీలోని ఒక గ్రామం.ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం అశ్వాపురం.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా- మొత్తం 43,067 - పురుషులు 21,757 - స్త్రీలు 21,310

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 582 చ.కి.మీ. కాగా, జనాభా 59,652. జనాభాలో పురుషులు 29,963 కాగా, స్త్రీల సంఖ్య 29,689. మండలంలో 15,775 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ అశ్వాపురం మండలం,ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అశ్వాపురం మండలాన్ని (1+10) 11 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అశ్వాపురం
  2. కుమ్మరిగూడెం
  3. అమ్మగారిపల్లి
  4. పాములపల్లి
  5. అమెర్ల
  6. గందిగూడెం
  7. చింత్రియాల
  8. నెల్లిపాక
  9. మామిళ్ళవాయి
  10. తుమ్మలచెరువు

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.

వెలుపలి లంకెలు[మార్చు]