ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి
| ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి | |
|---|---|
ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి
|
|
| Born | 15 October 1608 Faenza, Province of Ravenna, Papal States |
| Died | 25 October 1647 (aged 39) Florence, Grand Duchy of Tuscany |
| Citizenship | Papal States |
| Ethnicity | Italian |
| Fields | Physicist, mathematician |
| Doctoral advisor | Benedetto Castelli |
| ప్రసిద్ధి | Barometer Torricelli's Law |
| Influences | Galileo Galilei |
టోరసెల్లి ఎన్నో విషయాలను కనుగొన్నప్పటికి ఆయన పేరు వింటే మాత్రం ఎవరికైనా సరె గుర్తుకు వచ్చేది భారమితి ఒక్కటే!
విషయ సూచిక |
టెలిస్కోపిక్ లెన్సు [మార్చు]
ఇటలీ లోని ప్లోరెన్స్ లో విజ్ఞాన శాస్త్ర చరిత్రను తెలిపే మ్యూజియం ఒకటి ఉంది. అందులో అద్భుతమనిపించే ఎన్నో శాస్త్ర పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలలో ఒకటి అతి సామాన్యంగా కనిపించే టెలిస్కోపిక్ లెన్సు. నాలుగు అంగుళాల వ్యాసమున్న ఈ కటకం నిర్మాణాన్ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అది ఎంత ఖచ్చితంగా ఉందంటే మిల్లీమీటర్ లో పదివేల వంతు లోపం కూడా రాదు. ఈ అంశం ఎంతో విచిత్రముగా కనిపించవచ్చు. అంతకంటె చిత్రమైన విషయం ఆ కటకం 1646 లో తయారు చేయబడిందనే వాస్తవం! యీ కటకాన్ని తయారు చేసింది ఎవరో కాదు... ఇవాంజెలిస్టా టొరిసెల్లీ. యీ ఒక్క కటకం అధారంగా టొరసెల్లి పరికరాల విషయంలో ఎంత ఖచ్చితముగా ఉంటాడో తెలుసుకోవచ్చు.
భారమితి వెనుక కథ [మార్చు]
భారమితి సృష్టి కర్త టొర్రిసెల్లి అని ఎంతో మందికి తెలుసు కాని ఈ సృష్టి వెనుక కథ చాలామందికి తెలియదు.
టస్కానీ రాజు తన భవనం పెరటిలో ఒక పెద్ద బావి త్రవ్వించాడు. ఆ బావిలోని నీటి మట్టం నేల నుండి 40 అడుగుల లోపలికి ఉంది. బావిలోని నీటిని పైకి చేదడానికి ఒక చేతి యంత్రాన్ని అమర్చాలు. ఎంత కష్టపడ్డా నీరు 33 అడుగులు దాటి మరిపైకి రావటం లేదు. మొదట్లో చేతి యంత్రంలో లోపం ఉందని అనుకున్నారు. కాని అది సయైందేనని తెలిసి పోయింది. ఈ విషయం గురించి రాజుకు తెలియచేయబడింది. ఈ సమస్య గురించి ప్రఖ్యాత గణిత వేత్త గెలీలియోకు తెలిపారు. అయితే అప్పటికె గెలీలియో వృద్ధుడు. అందుకని ఆ విషయాన్ని టొర్రిసెల్లీని చూడమన్నారు. దాంతో రంగంలోకి దిగాడు టొర్రిసెల్లి.
బరువైన ద్రవం పైకి రావడం తేలికైన ద్రవం పైకి రావడమంత తేలిక కాదని టొర్రిసెల్లికి తెలుసు. అందుకోసమే ఆయన తన ప్రయోగం కోసం పాదరసాన్ని ఎన్నుకున్నాడు. ఈ పాదరసం నీటి కన్నా సుమారుగా పదమూడున్నర రెట్లు ఎక్కువ బరువుగా ఉంటుంది. అంటే 33 అడుగులు ఎత్తుకు నీరు పైకి లేస్తే పాదరసం 2.4 అదుగుల వరకు మాత్రమె లేవగలుగుతుందని టొర్రిసెల్లీ గుర్తించాడు. ప్రయోగం కోసం తొర్రిసెల్లి ఒక గజం పొడవు గల గాజు గొట్టం ఎన్నుకున్నాడు. ఈ గొట్టం ఒక చివర ముసివేశాడు. దానిని పాదరసంతో నింపాడు. ఆ తరువాత ఆ గొట్టాన్ని చేతి బొటన వేలితో మూసి దానిని జాగ్రత్తగా తలకిందులు చేసి పాదరసం నిండుగా ఉన్న గాజు తొట్టెలో ముంచాడు. అలా ముంచిన తరువాత టొర్రిసెల్లి బొటనవేలు జాగ్రత్తగా తీసివేశాడు. ఇలా చేసి నప్పుదు గాజు గొట్టంలోని పాదరసం కొద్దిగా గాజు తొట్టెలోకి చేరుకుని 30 అంగుళాలు వద్ద పాదరసం మట్టం నిలిచి పోయింది. కాగా గాజు గొట్టం పై భాగం ఖాళీగా మిగులుతుంది. యీ ఖాళీ ప్రదేశాన్ని 'టొర్రిసెల్లీ శూన్య ప్రదేశం" అని పిలవడం ఆనవాయితీ అయింది. యీ ప్రయోగ ఫలితంగా టొర్రిసెల్లీ బావిలోని నీరు 33 అడుగుల ఎత్తు కంటె ఎక్కువగా దాటి రావడం కుదరదని తెలుసుకోగలిగాడు. యీ బావి విషయం తేల్చుకోవటానికి చేసిన యీప్రయోగ ఫలితంగానె భారమితిని కూడా యీయన రూపొందించగలిగాడు.
టొర్రిసెల్లి భారమితినికొంత పైకి తీసుకుని వెళ్ళీంప్పుడు పాదరస మట్టం తగ్గుతుంది. దీని ఆధారంగా భూమి ఉపరితలం నుండి పైకి పోయినకొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుందని స్పష్టంగా చెప్పడానికి వీలవుతుంది. ఈ ప్రయోగం ఆధారంగా బ్లైస్ పాస్కల్ గాలికి బరువు ఉంది అని చెప్పిన గెలీలియో వాదాన్ని సరియైనదని ఋజువు చేశాడు.
పరిశోధనలు [మార్చు]
టొర్రిసెల్లి రకరకాల టెలిస్కోప్ లను, మైక్రోస్కోప్ లను రూపొందించాడు. ఈ పరికరాలు ఊహాతీతమైన శాస్త్రీయపు అంచనాలతో ఉండటం ఎవరినైనా కదిలించే విషయం.టొర్రిసెల్లి గణిత శాస్త్రవేత్త కూడా! ఈయన "ఇంటెగ్రల్ క్యాలిక్యులస్" కు ప్రాథమిక సూత్రం నిర్దేశించాడు. 19 యెళ్ళ వయస్సులో రోం యూనివర్సిటీ లో ఈయనగూర్చి ఎంతో మంది చెప్పుకునేవారు. గెలీలియో పరిశోధనల మీద యీయన చేసిన వ్యాఖ్యానాలు 1641 లో ప్రచురించబడ్డాయి. విల్లియం హార్వే,గెలీలియో, పాస్కల్, వంటి మహానుభావులకు ఈయన సమకాలీకులు.
అస్తమయం [మార్చు]
ఎన్నో విషయాలకు కొత్త దారులు చూపించి విజ్ఞాన శాస్త్రాలకు వింత వెలుగులను రప్పించిన టొర్రిసెల్లి అతి చిన్న వయస్సు (39 సం. లకే) లో అనగా 25 అక్టోబర్ 1647 లో మరణించాడు.
బయటి లింకులు [మార్చు]
|
|
|
|---|---|
| పైథాగరస్ · హిప్పోక్రటిస్ · అరిస్టాటిల్ · ఆర్కిమెడిస్ · యూక్లిడ్ · టోలెమీ · లియొనార్డో డావిన్సి · నికోలస్ కోపర్నికస్ · జాన్ నేపియర్ · గెలీలియో గెలీలి · విలియం హార్వె · ఆట్టో వాన్ గెరిక్ · ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి · బ్లైసీ పాస్కల్ · ఐజాక్ న్యూటన్ · బెంజమిన్ ఫ్రాంక్లిన్ · ఎడ్వర్డ్ జెన్నర్ · సర్ హంప్రీ డేవి · మైకేల్ ఫెరడే · చార్లెస్ డార్విన్ · గ్రెగర్ జోహన్ మెండల్ · ఫ్రెడరిక్ ఆగస్టు కెకులే · మాక్స్ వెల్ · ఆల్ఫ్రెడ్ నోబెల్ · విల్ హెల్ం కొన్ రాడ్ రాయింట్జెన్ · గ్రహంబెల్ · థామస్ అల్వా ఎడిసన్ · జగదీశ్ చంద్రబోస్ · మాక్స్ ప్లాంక్ · థేల్స్ · ప్రపుల్ల చంద్ర రే · మేడం క్యూరీ · విల్బర్ ఆర్విల్లె రైట్ సోదరులు · ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ · మార్కోనీ · ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ · అలెగ్జాండర్ ఫ్లెమింగ్ · శ్రీనివాస రామానుజన్ · జాన్ లోగి బయర్డ్ · సర్ సి.వి.రామన్ · జేమ్స్ చాడ్విక్ · సత్యేంద్రనాథ్ బోస్ · సలీం ఆలీ · ఎన్ రికో ఫెర్మి · హోమీ జహంగీర్ బాబా · హరగోవింద ఖురానా |