చార్లెస్ డార్విన్

వికీపీడియా నుండి
ఛార్లెస్ డార్విన్
Charles Robert Darwin (1809-1882). At the age of 51, Charles Darwin had just published  ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్.
Charles Robert Darwin (1809-1882). At the age of 51, Charles Darwin had just published
ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్.
జననం ఫిబ్రవరి 12 1809(1809-02-12)
మౌంట్ హౌస్, en:ష్ర్యూస్‌బరి, ష్రోప్‌షైర్, ఇంగ్లాండు
మరణం ఏప్రిల్ 19, 1882(1882-04-19) (వయసు 73)
డౌన్‍హౌస్, డౌనే, కెంట్, ఇంగ్లాండు
నివాసం ఇంగ్లాండు
జాతీయత బ్రిటిష్
మాతృ సంస్థ ఎడిన్‌బర్గ్ యూనివర్శిటి
కేంబ్రిజ్ యూనివర్సిటి
ప్రాముఖ్యత en:The Voyage of the Beagle
On The Origin of Species
Natural selection
మతం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, though యూనిటేరియన్ family background, Agnostic after 1851.
He was a grandson of Erasmus Darwin and a grandson of Josiah Wedgwood, and married his cousin Emma Wedgwood.

చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఆంగ్లం :Charles Robert Darwin) (ఫిబ్రవరి 12, 1809ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది,[I] ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు.[1] మరియు జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.[1]

చార్లెస్ డార్విన్ పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిమాణ సిద్ధాంతం. ప్రకృతి లో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానిని - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.

విషయ సూచిక

బాల్యం-విద్యాభ్యాసం [మార్చు]

ఈయన ష్రివ్స్ బర్గ్ లో 1809 లో జన్మించాడు.చిన్నవాడుగా ఉండేటప్పటినుండి కీటకాలను, ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16 యేండ్ల వయస్సులో మెడిసన్ చదవటం కోసం ఈయనను ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం లో చేర్పించారు. కాని - మత్తుమందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి - ఆ చిత్రహింసకు ఈయన కలత చెంది - మెదిసన్ కు మనసు పెట్టి చదవలేక పోయాడు. 1828 లో కేంబ్రిడ్జ్ కి వెళ్ళి ధియాలజీ చదివాడు.

నేచురల్ సెలక్షన్ థీరీ [మార్చు]

1831 లో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం యురోపియన్ దేశాలకు చుట్టిరావటానికి బయలు దేరిన బీగల్ సముద్ర నౌక లో నేచురలిస్ట్ గా ప్రయాణం చేసే అవకాశం డార్విన్ కి లభించింది. యీ అవకాశం ఆయన పాలిట సువర్ణావకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరనకు ఆధారభూతమైంది. అయిదేళ్ళపాటు కొనసాగిన యీ సముద్ర యానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను దర్శించాడు. ప్రకృతికి,జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ ఆలోచన ఫలితమే ప్రకృతి వరణ సిద్ధాంతంగా (నేచురల్ సెలక్షన్ థీరీ) గాపరినమించింది.

పరిశోధనలు [మార్చు]

సరిగ్గా ఈ సమయంలోనే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే వెలువరించాడు. డార్విన్ కు ఉత్తరం కూడా రాసాడు. 1558 లో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా! 1859 లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు. ఈ పుస్తకం విదుదలైన రోజునె ఆన్ని ప్రతులూ అమ్ముడు పోయి సరికొత్త రికార్డును సృష్టించింది.

పరిణామ సిద్ధాంతం [మార్చు]

జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణ లో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థకమ జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిధ్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం.అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు. అయితె బైబిల్ లో చెప్పినట్లు ఏడు రోజుల లోనే సమస్త సృష్టి , సకల జీవ జలాలు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం.

రచనలు [మార్చు]

1868 లో డార్విన్ "ది వారియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. "ఇంసెక్టివోరస్ ప్లాంట్స్" "డీసెంట్ ఆఫ్ మ్యాన్", "ది ఫార్మేషన్ ఆఫ్ గజిటబుల్ మౌల్డ్ థ్రూ ది ఏక్షన్ ఆఫ్ వర్మ్స్" వంటి వి ఈయన రాసిన మరికొన్ని పుస్తకాలు.

అస్తమయం [మార్చు]

ఈయన 74 యేండ్ల వయస్సులో చనిపోయారు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన కూడా సమాధి చేయబడటం కాక తాళీయం. డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతివరన సిద్దాంతం నిలిచే ఉంటుంది.

ఇవీ చూడండి [మార్చు]

పాద పీఠికలు [మార్చు]

I. ^  Darwin was eminent as a naturalist, geologist, biologist, and author; after working as a physician’s assistant and two years as a medical student was educated as a clergyman; and was trained in taxidermy.

IV. ^  See, for example, the song “A lady fair of lineage high” from Gilbert and Sullivan’s Princess Ida, which describes the descent of man (but not woman!) from apes.

మూలాలు [మార్చు]

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]