ఉబుంటు
| ఉబుంటు | |
ఉబుంటు 11.04 ( నాటీ నార్వాల్) |
|
| వెబ్‌సైట్ | www.ubuntu.com |
|---|---|
| అభివృద్ధిచేసినవారు | కెనానికల్ లిమిటెడ్ / ఉబుంటు ఫౌండేషన్ |
| OS కుటుంబం | యునిక్స్ |
| మూలము నమూనా | ఉచిత సాఫ్ట్వేర్ / స్వేచ్ఛాయుత మూలములు |
| మెదటి విడుదల | 2004-10-20 |
| సరికొత్త విడుదల | 12.04 / 2012-04-26 |
| భాషల లభ్యత | అనేకమైన ( 55 కన్న ఎక్కువ) |
| నవీకరణ పద్ధతి | ఆప్ట్ (జియుఐ ) |
| ప్యాకేజీ నిర్వాహకం | డిపికెజి |
| కెర్నల్ | లినక్స్ |
| వాడుకరి అంతరవర్తి | గ్నోమ్ (రూపు రేఖలు కె డి ఇ, ఎక్స్ఎఫ్‌సిఇ మరియు ఎల్ఎక్స్‌డ్ఇ) |
| లైసెన్సు | వివిధ, ముఖ్యంగా జి పి ఎల్ మరియు జి ఎఫ్ డి ఎల్ |
| ప్రస్తుత స్థితి | ప్రస్తుతము |
ఉబుంటు లినక్సు [1]ఒక లినక్సు పంపిణీ, ఇది డెబియన్ గ్నూ/లినక్స్ మీద నిర్మించబడింది. దీని పంపిణీదారు కనోనికల్ లిమిటెడ్, (మార్క్ షటిల్‌వర్త్ దీని యజమాని). ఈ పంపిణీ పేరు దక్షిణ ఆఫ్రికా భావన ఐన ఉబుంటు నుండి వచ్చింది. బంటు భాషలో ఉబుంటు అనగా ఇతరులపట్ల మానవత్వం. ప్రతి 6 నెలలకు ఒక కొత్త రూపాంతరం(వెర్షన్) విదుదలచేయబడును. ఉబుంటు లినక్స్ ను స్వేచ్ఛగా, ఉచితంగా వాడుకొనవచ్చును, మరియు కాపీలను సంకోచములేకుండ ఇతరులకు ఈయవచ్చును. పాఠశాలల కొరకు ప్రత్యేక ఎడ్యుబుంటు అను రపాంతరం, ఇంకా కుబుంటు, క్జుబుంటు మరియు ఇతర రూపాంతరములు గలవు.
విషయ సూచిక |
లక్షణాలు [మార్చు]
సులువుగా వాడటం కోసం నిర్వహణ విధులకొరకు సుడో పరికరాన్ని ముఖ్యంగా దీనిలో వాడతారు. స్థాపన మాధ్యమం నుండి హార్డుడిస్క్ లో స్థాపించవచ్చు. కంప్యూటర్ ని తిరిగి ప్రారంభించనవసరంలేదు. అశక్తులైనవారికి సౌకర్యాలు, అంతర్జాతీయంగా వాడటం దీనిలో ప్రాముఖ్యతకలిగివున్నది. యు టి ఎఫ్-8 అక్షరపు ఎన్కోడింగు 5.04 విడుదలతో అప్రమేయంగా వాడబడుతున్నది. దీనివలన అన్ని భాషల వారు వాడటం కుదురుతుంది. దీనితోపాటు కార్యాలయ పనుల కొరకు అనువర్తనం లిబ్రెఆఫీస్ , అంతర్జాల విహరిణి ఫైర్‌ఫాక్స్, త్వరిత వార్తావాహినిపిడ్జిన్, చిత్రాలను మార్పుచేయు అనువర్తనముగింప్ , రకరకాలైన ఆటలు సుడోకు, చదరంగం సాఫ్ట్వేర్ దొరకుతాయి. అవసరంలేని నెట్ వర్క్ పోర్టులు మూసి వుంటాయు కాబట్టి, కంప్యూటర్ ని రక్షణ పెరుగుతుంది. 11.04 విడుదల లో తెలుగు, కన్నడ భాషలతో సహా 10 భారతదేశ భాషలలో బూట్ నుండే తోడ్పాటు వుండటంతో, ఇంగ్లీషు అంతగా రాని వారు కూడా సులభంగా కంప్యూటర్ వాడవచ్చు.
తాజా విశేషాలు [మార్చు]
యూనిటీ అంతర్వర్తి [మార్చు]
కొత్త యూనిటీ అంతర్వర్తి (ఇంటర్ఫేస్) తో కంప్యూటర్ వాడుక మరింత సులభం. 3D రూపంలో వుండే సచేతనంతో కూడిన ప్రతిమలతో పాటు బహుళ స్పర్శా సాంకేతికాల తోడ్పాటు కూడా వుంది.
ఉబుంటు ఒన్ (క్లౌడ్ నిల్వ స్థలము) [మార్చు]
క్లౌడ్ నిల్వ స్థలము ద్వారా డేటాని ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోటానికి, భద్రం చేసుకునేలా ప్రత్యేక సర్వీసుని రూపొందించారు. అదే ఉబుంటు ఒన్[2]. దీంట్లో ఉచితంగా ఖాతా సృష్టించుకొని ముఖ్యమైన దస్త్రాలను భద్రం చేయవచ్చు. దీంతో అంతర్జాల సంపర్కముతో ఎక్కడనుండైనా డేటాని పొందవచ్చు. ఇష్టాంశాలు, సంపర్కాలు, సంగీతం, ఫైళ్లు, బొమ్మలు దీంట్లోకి భద్రం చేసుకోవచ్చు. 2 జీబీ క్లౌడ్ నిల్వ స్థలము (క్లౌడ్ స్టోరేజీ స్పేస్)ను ఉచితంగా అందిస్తున్నారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి 1000 నెంబర్లను భద్రం చేసుకోవచ్చు.
తెలుగు రంగస్థలము [మార్చు]
ఉబుంటు తెలుగురూపంలో అందుబాటులో వుంది. దీనికొరకు సిడి/డివిడి నుండి నేరుగా తెలుగు ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీషు స్థాపన పూర్తయివుంటే తర్వాత System->Administration->Language support లో Install/Remove Languages లో తెలుగు ని ఎంపికచేసుకొని స్థాపించుకోవాలి.తెలుగులోటైపుచెయ్యడానికి x కీ బోర్డు వ్యవస్థలో ఇన్స్క్రిప్ట్ వాడుకోవచ్చు. దానితో వాడినపుడు కీ బోర్డు తెలుగు విధానంలో వున్నప్పుడు తెరపై కీ బోర్డు స్థితి తెలుగుని సూచింటంతోపాటు, కీ బోర్డు పై బల్బు వెలుగుతుంది. దీనికొరకై ఉబుంటు(11.10 వర్షను) లో Applications=>Customisation=>Keyboard ని ఎంచుకుని , దానిలో Layouts ఎంచుకుని, '+" ని నొక్కి తెలుగు layout ను add చేయవలెను. Panel లో వచ్చిన Keyboard గుర్తును నొక్కి layout ను English, తెలుగు ల మధ్య మార్చ వచ్చును.
ఇతర కీ బోర్డు నమూనాలు కావలంటే ibus-m17n పేకేజి స్థాపించుకొని Keyboard input method system లో ఐబస్ ఎంచుకోవాలి.ఐబస్ ఆభీష్టాలలో(System->Preferences->Ibus Preferences) మనకు నచ్చిన ప్రవేశ పద్ధతులు అనగా కీ బోర్డు రూపాలు (ఇన్స్క్రిప్ట్,ఐట్రాన్స్,ఆర్టిఎస్, ఏపిల్,పోతన) ఎంచుకోవాలి.
విడుదలలు [మార్చు]
| రూపాంతరం | సంకేతం పేరు | విడుదల తేదీ | మద్ధతు | |
|---|---|---|---|---|
| డెస్కుటాప్ | సేవకం | |||
| 4.10 | వార్టీ వార్తాగ్ | 2004-10-20 | 2006-04-30 | |
| 5.04 | హోరి హెడ్జ్ హాగ్ | 2005-04-08 | 2006-10-31 | |
| 5.10 | బ్రీజీ బ్యాడ్జర్ | 2005-10-13 | 2007-04-13 | |
| 6.06 LTS | డాపర్ డ్రేక్ | 2006-06-01 | 2009-07-14 | 2011-06-01 |
| 6.10 | ఎడ్జి ఎఫ్ట్ | 2006-10-26 | 2008-04-25 | |
| 7.04 | ఫీస్టీ ఫాన్ | 2007-04-19 | 2008-10-19 | |
| 7.10 | గస్టి గిబ్బన్ | 2007-10-18 | 2009-04-18 | |
| 8.04 LTS | హార్డీ హిరాన్ | 2008-04-24 | 2011-05-12 | 2013-04 |
| 8.10 | ఇంట్రెపిడ్ ఇబెక్స్ | 2008-10-30 | 2010-04-30 | |
| 9.04 | జాంటీ జాకలోప్ | 2009-04-23 | 2010-10-23 | |
| 9.10 | కార్మిక్ కోలా | 2009-10-29 | 2011-04-30 | |
| 10.04 LTS | ల్యూసిడ్ లినక్స్ | 2010-04-29 | 2013-04 | 2015-04 |
| 10.10 | మేవరిక్ మీర్కట్ | 2010-10-10 | 2012-04 | |
| 11.04 | నాటీ నార్వాల్ | 2011-04-28 | 2012-10 | |
| 11.10 | ఆనెరిక్ ఆస్లెట్ | 2011-10-13 | 2013-04 | |
| 12.04 LTS | ప్రిసైజ్ పాంగోలిన్ | 2012-04-26 | 2017-04 | |
| 12.10 | క్వాంటాల్ కెట్జాల్ | 2012-10-18 | 2014-04 | |
| రంగు | అర్థం | |||
| ఎరుపు | మద్ధతులేని విడుదల | |||
| పచ్చ | ఇంకా మద్ధతు ఉన్న విడుదల | |||
| నీలం | భవిష్యత్ విడుదల | |||
ఉబుంటు ప్రతీ ఏటా ఏప్రిల్ మరియు అక్టోబరులో విడుదలవుతుంది. ప్రతీ విడుదలకూ రూపాంతరం సంఖ్య మరియు పేరు ఉంటాయి.
తెలుగు స్ధానికీకరణ [మార్చు]
తెలుగు అనువాదాన్ని మెరుగు పరచడానికి తెలుగు స్థానికీకరణ జట్టు [3] పనిచేస్తున్నది.