Jump to content

ఎ.ఎస్.జగన్నాథశర్మ

వికీపీడియా నుండి
ఎ.ఎన్.జగన్నాథశర్మ
జననంఅయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ
(1956-04-13)1956 ఏప్రిల్ 13
పార్వతీపురం, విజయనగరం జిల్లా
ప్రసిద్ధిరచయిత, సంపాదకుడు
మతంహిందూ

అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ (ఎ.ఎస్.జగన్నాథశర్మగా ప్రసిద్ధులు) శతాధిక తెలుగు కథా రచయిత. [1] 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం అందుకున్నారు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం లో ఏప్రిల్ 13 1956 లో జన్మించారు. చిన్ననాటినుండే కథలపై ఆసక్తి పెంచుకున్న వీరు తన పదిహేనవ ఏటనే కథలు వ్రాయటం ప్రారంబించారు. ఇప్పటివరకు వీరు ఐదు వందల కథలు వ్రాశారు. వీరు వ్రాసిన కథలు వివిథ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆ కోవలో వీరి రాజధాని కథలు యువ మాస పత్రికలో, మా ఊరి కథలు పల్లకి వార పత్రికలో, అగ్రహారంకథలు ఆదివారం ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమయ్యాయి.

కథలతో పాటు వీరు 18 నవలలు కూడ వ్రాశారు. వాటిలో అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం వంటి నవలలు కూడ వ్రాసి పాఠకుల మన్ననలు పొందారు. అంతేకాకుండా వీరు సినిమా, టి.వి. రచయితగా కూడ ప్రసిద్ధులు.

ప్రస్తుతం వీరు ఆంధ్రజ్యోతి యాజమాన్యంలోని నవ్య వీక్లీకి సంపాదకులుగా వ్వవహరిస్తున్నారు.[3]

రచనలు

[మార్చు]

వీరి రదనలలో జగన్నాథ రథచక్రాల్, కథా సరిత్సాగరం,[4] పంచతంత్రం, పాలపిట్టి, నెమలీక, పేదరాసి పెద్దమ్మ వంటి కథలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డా శర్మగారి భారత, భాగవత[5] రామయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

పురస్కారాలు

[మార్చు]

బహుముఖ సాహితీవేత్త బలివాడ కాంతారావు స్మారక జీవన సాహితీ పురస్కారాన్ని 2018.[6]

మూలాలు

[మార్చు]
  1. "నాన్నంటే! - ఎ.ఎన్.జగన్నాథశర్మ". Archived from the original on 2012-07-29. Retrieved 2016-05-24.
  2. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  3. సలీం నవలలపై పరిశోధనాత్మక విశ్లేషణ నవతెలంగాణ - కల్చరల్‌ రిపోర్టర్‌
  4. Katha saritsagaram by: Jagannadha sarma (author)
  5. There are 10 Available Books by the Author A.N. Jagannadha Sarma
  6. "జగన్నాథశర్మకు 'బలివాడ' సాహితీ పురస్కారం".[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]