కల్లూరు (ఖమ్మం)

వికీపీడియా నుండి

ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ కల్లూరు చూడండి.

  ?కల్లూరు,ఖమ్మం మండలం
ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్
ఖమ్మం జిల్లా పటములో కల్లూరు,ఖమ్మం మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో కల్లూరు,ఖమ్మం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కల్లూరు,ఖమ్మం
జిల్లా(లు) ఖమ్మం
గ్రామాలు 23
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
63,336 (2001)
• 32366
• 30970
• 56.11
• 64.92
• 46.84


కల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము (గ్రామము), అదే పేరుతో గల మండలానికి కేంద్రము.

  • ఇది ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది. ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.
  • ఇక్కడ ఓ చక్కర కర్మాగారము కలదు.
  • ఈ ప్రాంతము గుండా నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ వెళ్తూ భూమిని సస్యస్యామలం చేస్తుంది.
  • ఈ పట్టాణములో మూడు "సీ" క్లాసు సినిమా హాళ్ళు కలవు(ఇప్పుడు ఒక్కటి కూడా ఆడటం లేదు) ఒకటి తీసివేసి ఇళ్ళ స్తలాలుగా అమ్మేశారు,మరొ రెండింటిని వ్యాపారులు ధాన్యపు గొడవున్లకు ఉపయొగిస్తున్నారు.
  • దగ్గరలోని చాలా గ్రామాలకు ఇది ఓ విద్యాకేంద్రముగా, వ్యాపార కూడలిగా ఉన్నది.
  • ఈ ఊరులో ఎక్కువగా రైస్ మిల్లులు ఉన్నాయి.
  • పంచాయితి ఆఫీసు ఊరి సెంటర్ లోను, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు యన్.స్.పి క్యాంప్ లోను ఉంటాయి.
  • కల్లూరులో ప్రభుత్వ కళాశాల ఉంది.
  • ఆర్.టి.సి బస్ స్టాండ్ ఊరికి కొంచెం దూరంలో ఉండటం వల్ల దీనిని ఎవరు ఉపయోగించటం లేదు, ఇది ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉంది.


విశేషాలు[మార్చు]

ఇక్కడ కల్లూరు పెద్దచెరువు అనే ఒక చెరువు ఉంది .. ఇది ఈ మండలం చుట్టుపక్కల గల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తుంది. ఈ చెరువు నాగార్జునసాగర్ కెనాల్ ద్వారా నిండుతుంది. ఈ ఊరి లొ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది . ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది .. ఇందులొ ఎక్కువగా పశువులు అమ్మకం జరుగుతుంది.



కల్లూరులో మెయిన్ రోడ్
కల్లూరు హైవే జంక్షన్
కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ


మండలంలోని గ్రామాలు[మార్చు]