కీలుగుర్రం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కీలుగుర్రం
(1949 తెలుగు సినిమా)
Keelugurram 1949film.jpg
దర్శకత్వం మీర్జాపురం రాజా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి,
జి.వరలక్ష్మి,
లక్ష్మీరాజ్యం,
సూర్యశ్రీ,
బాలామణి,
కనకం,
ఏ.వి.సుబ్బారావు,
రేలంగి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన తాపీ ధర్మారావు
ఛాయాగ్రహణం డి.ఎల్.నారాయణ
కళ శర్మ
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
విడుదల తేదీ ఫిబ్రవరి 19, 1949
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

ఇది జానపద చిత్రకథ. అనగనగా ఒక రాజు. ఆ రాజు వేటకి వెళ్ళినప్పుడు ఒక మోహిని (అంజలీదేవి) ని ప్రేమించి రాజ్యానికి తీసుకొని వచ్చి రెండవ భార్యగా స్వీకరిస్తాడు. నిజానికి ఆమె ఒక రాక్షసి. రాత్రివేళల్లో రాక్షసిగా ఏనుగుల్ని చంపి తిని ఆ నేరాన్ని పెద్ద రాణిపై వేస్తుంది. అది నమ్మిన రాజు, గర్భవతి అయిన పెద్ద రాణిని అడవులకు పంపిస్తాడు. అడవిలో కోయగూడెంలో ఆమె జన్మనిచ్చిన బిడ్డ (అక్కినేని) పెరిగి అన్ని విద్యలలో ప్రవీణుడౌతాడు. ఆకాశంలో విహరించే కీలుగుర్రాన్ని అధిరోహిస్తాడు. దొంగలబారి నుండి కథానాయిక (లక్ష్మీరాజ్యం) ను కాపాడతాడు. హీరో సంగతి తెలిసిన మోహిని తనకు తలనొప్పిగా వుందని అందుకు తగిన మందు తెమ్మని కథానాయకున్ని పంపుతుంది. కీలుగుర్రం సహాయంతో ఆ మందు తెచ్చే ప్రయత్నంలో ఎన్నో సాహసాలు చేస్తాడు కథానాయకుడు. ఆ మందు కంటే విలువైన రాక్షసి ప్రాణాలు చిన్న పురుగులో వుండడం గమనించి వాటిని సంగ్రహిస్తాడు. తల్లిని ఉరి తీసే సమయానికి అక్కడకు వచ్చి రాక్షసిని అంతమొందిస్తాడు. తల్లికి తిరిగి రాజరిక ప్రవేశం కలిగిస్తాడు.

వివరాలు[మార్చు]

మరో ప్రకటన

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
కాదు సుమా కలకాదు సుమా తాపీ ధర్మారావు ఘంటసాల ఘంటసాల, వి.సరళ
తెలియ వశమా పలుకగలమా తాపీ ధర్మారావు ఘంటసాల సి.కృష్ణవేణి, ఘంటసాల
శోభనగిరి నిలయా దయామయా తాపీ ధర్మారావు ఘంటసాల సి.కృష్ణవేణి
ఎంత కృపామతివే భవానీ ఎంత దయామయివే తాపీ ధర్మారావు ఘంటసాల ఘంటసాల, శ్రీదేవి
  • ఎంతానందంబాయెనహో
  • ఎవరు చేసిన కర్మ వారనుభవింపక
  • చెంపవేసి నాకింపు చేసితివే
  • చూచి తీరవలదానందము

మూలాలు[మార్చు]

  • ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.

[1]