కోడి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| కోడి | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కోడి పుంజు
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
కోడి లేదా కుక్కుటము ఒక రకమైన పక్షులు. వీటిలో మగ కోడిని 'కోడిపుంజు' మరియు ఆడ కోడిని 'కోడిపెట్ట' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు కలవు. అవి
- నాటు కోళ్ళు
- బ్రాయిలర్
విషయ సూచిక |
[మార్చు] కోడిపెట్టలు విశేషాలు
- ఇవి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి.
[మార్చు] కోడిపుంజులు విశేషాలు
- వీటిని అధికంగా పందాలలో వాడుతుంటారు.
- వీటికి పౌరుషం పెరిగేందుకు మిర్చి మొదలుకొని అనేక రకాల ఆహారం ప్రత్యేకంగా తినిపిస్తుంటారు.
- వీటిని ఆంధ్ర ప్రాంతంలో నెమలి, డేగ, కోయిల, పరగ ఇంకా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు.
[మార్చు] ఉపయోగాలు
- వీటి మాంసం విరివిగా వాడుతుంటారు.
- వీటి గుడ్లు అత్యధికంగా వాడు ఒక ఆహార పదార్ధం
[మార్చు] కోడి ముందా? గుడ్డు ముందా?
కోడి గుడ్డు ఏర్పడడంలో ఓవోస్లిడీడిన్ 17 (ఓసీ- 17) అనే ప్రొటీన్ గుడ్డు పెంకులో మాత్రమే కనిపిస్తుంది. కోడి దేహంలో కాల్షియం కార్బొనేట్ తయారవుతుంది.కోడిలోనే ఉత్పత్తి అయ్యే ఓసీ- 17 ప్రొటీన్ కాల్షియం కార్బొనేట్‌లోని సూక్ష్మ కణాల మధ్య రసాయన లంకె (క్లాంప్)లా ఏర్పడి వాటిని పట్టి ఉంచి, అవి కాల్షైట్ స్ఫటికాలుగా మారడానికి దోహదపడుతుంది. ఆ స్ఫటికాలకు కేంద్రకంగా మారి అవి తమంతతాముగా పెరగడానికి కూడా ప్రొటీన్ దోహదపడుతుంది. అవి ఒకసారి పెరగడం పూర్తయిన తరువాత ప్రొటీన్ అదృశ్యమవుతుంది. 24 గంటల్లోపే మరో గుడ్డును తయారు చేసే పనిలో పడుతుంది. 'గుడ్డు ఏర్పడటానికి అత్యంత కీలకమైన ఈ ప్రొటీన్ కోడిలోనే ఉంటుంది తప్ప, గుడ్డులో కనిపించదు' .గుడ్డు ఏర్పడాలంటే ఈ ప్రొటీన్ ఉండాలి. అంటే గుడ్డుకన్నా ముందు ఈ ప్రొటీన్ ఉత్పత్తి జరిగింది కాబట్టి ప్రొటీన్ ఉత్పత్తి జరగాలంటే కోడి ఉండాలి కనుక, గుడ్డు కన్నా కోడే ముందు పుట్టిందట.
[మార్చు] కుక్కుట శాస్త్రం
- ప్రధాన వ్యాసం: కుక్కుట శాస్త్రం
కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ శాస్త్రాన్ని సంక్రాతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ,కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో కోడి పందెము వేయాలి, కోడి జన్మ నక్షత్రము, కోడి జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. కుక్కుట శాస్త్రము గురించి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.