Jump to content

గచ్చ కాయ

వికీపీడియా నుండి
(గచ్చ నుండి దారిమార్పు చెందింది)

Guilandina bonduc
Caesalpinia bonduc
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Caesalpinia

జాతులు

see text

గచ్చకాయ, ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్క.దీని మొక్కలు పొదలు పొదలుగా అల్లుకుంటాయి. గచ్చ పొద విస్తారంగా విస్తరించే ముళ్ల తీగ. దీని కాయలు ఆల్చిప్ప ఆకారాన్ని పోలి ఉంటాయి.లోన నాలుగైదు గింజలుంటాయి.వాటిని గచ్చక్కాయలంటారు.ఇవి చిన్న గోలీలంత పరిమాణంలో వుంటాయి. ఈ గింజలు చాల ఆయుర్వేద మందులలో కూడా వాడుతారు.

గచ్చకాయ చెట్లు భారతదేశమంతటా వ్యాపించి ఉన్నాయి.ఇవి ఎక్కువుగా అటవీ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి.బంజరు భూములు, తీరప్రాంతాలు, ఆకులు రాలే చెట్లున్న అడవులలో చెట్లును పట్టుకుని తీగలా పైకి పాకుతుంది.ముళ్ళు, కొక్కేలు కలిగిన తీగలతో పాకి ఏదొ ఒక చెట్టును, లేదా ఇతరత్రా వాటిని ఆధారం చేసుకుని పొదలు, పొదలుగా విస్తరిస్తుంది.సిసాల్పినేసి కుటుంబానికి చెందిన వృక్షజాతి మొక్క. దీని శాస్త్రీయనామం సిసాల్పినియా బొండక్.[1] (ఆంగ్లం:Sisalpinia Bondac) సంసృతంలో లతా కరంజ్, కంటకి కరంజ్, హిందిలో కట్ కరంజ్ అని అంటారు.గచ్చకాయ గింజల్లో పసుపు పచ్చని చిక్కని ద్రవం ఉంటుంది.ఇది కాకుండా, సిసాల్పిన్, అయోడిన్, సాపోవిన్, నాన్ గ్లూకోసైడల్ పదార్థాలు ఉంటాయి. వీటి గింజలు చేదును కలిగిఉంటాయి

ఆటలలో గచ్చకాయల పాత్ర

[మార్చు]
గచ్చపొద

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చిన్నప్పుడు పిల్లలు గచ్చకాయలతో రకరకాలు ఆటలు ఆడుకునే వారు.వీటి విత్తనాలను మగ పిల్లలు ఒకరికి తెలియకుండా ఒకరు పొడి రాయి మీద కాసేపు అరగదీసి వారు ఎవరినైతే ఆట పట్టించదలుచుకున్నారో, వారికి తెలియకుండా శరీరంపై అంటించేవారు.దానితో ఆవేడికి చురుక్కుమని కేక పెట్టేవారు.ఇలా ప్రతి పిల్లలు ఇష్టంగా ఒకరినొకరు ఆటపట్టించుకునేవారు. ఇక ఆడపిల్లలు ఆ విత్తనాలతో అచ్చిన గిల్లాలు అనే ఆటను ఆడేవారు.ఇంకా వివధ రకాల ఆటలు ఆడేవారు. ఆటలు ఆడుటకు ఇవి రాళ్లకన్నా అనువుగా ఉంటాయి అందువలన వీటితో పిల్లలు వివిధ రకాలు ఆటలు ఆడుకునేవారు.పిల్లలు వీటిని గోలీలలాగ ఆడు కుంటారు.

వైద్యంలో గచ్చ గింజలు, ఆకులు పాత్ర

[మార్చు]
పండిన గచ్చ కాయలు

గచ్చకాయ గింజలు కఫాన్ని, వాతాన్ని అణచివేస్తుంది.పిత్తాన్ని పెంచుతుంది.రక్త దోషాలను, వాపులను తొలగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.గింజలు ఉష్ణతత్వం గలవి.రక్త వృద్ధికి తోడ్పడతాయి. మెదడుకు, కళ్ళకు, చర్మకాంతికి గచ్చకాయ గింజలు వినియోగం మంచిది.దీని గింజల తైలం వాడడం వల్ల గాట్లు కంటి, చర్మ వ్యాధులు తగ్గుతాయి. దగ్గు, పైల్స్, వాతం, కడుపులో పురుగులు, వాపులు పోవడానికి గచ్చ ఆకులు వాడటం మంచిది.గింజలకు, మూత్రసమస్యలను నయం చేసే శక్తి ఉంది. మైగ్రేన్, తలనొప్పి తగ్గడానికి ఉపయోగిస్తారు. మధుమేహం తగ్గడానికి, వాంతులు తగ్గడానికి, సిఫిలిస్, ఇతర సుఖవ్యాధులు తగ్గడానికి, కిడ్నీలలో రాళ్ళు తగ్గడానికి, రక్తం కారే పైల్స్ తగ్గడానికి, చర్మ వ్యాధులు తగ్గడానికి, అల్సర్ల వల్ల వచ్చే వాపులు తగ్గటానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి వాడుతారు.[2]

ప్రారంభ దశలో ఉన్న గచ్చకాయ మొక్క ఆకులు వరి బీజం ఐనవారికి వైద్యంగా పనిచేస్తుంది.ఆకును ఆముదంలో వేయించి వృషణాలకు మూడు పూటలలో కట్టినయెడల వ్యాధి తగ్గుముఖం పట్టింది. జ్వరం వచ్చిన వారికి గచ్చకాయగింజలు నూరి నీటిలో కలిపి ఆనీటిని పొట్టపై కొద్దిగా వాడిన జ్వరం తగ్గటానికి అవకాశంఉంది.బట్టతలపై జుట్టు రావడానికి గచ్చకాయ గింజలు తైలాన్ని వాడతారు.వీటితో తయారుచేసిన నస్యం పీల్చిన తుమ్మలు వచ్చి లోపలి శ్లేష్మం బయటికి తలనొప్పి, జలుబు తగ్గటానికి అవకాశముంది.మూర్చ వ్యాధి తగ్గడానికి గచ్చ ఆకుల రసం వాడుతారు.కంటి జబ్బులు తగ్గడానికి గచ్చగింజలుకు తోడు 1,2 గ్రాములు సమంగా తులసి ఆకులు, మల్లె మొగ్గలు కలిపి నూరి 8 రెట్లు నీటితో ఆవిరి పడతారు. దంత రోగాలు తగ్గడానికి - పయోరియా ఉంటే గచ్చమొక్క పుల్లతో పళ్ళు తోముకుంటారు. దగ్గు తగ్గడానికి 10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం,250 - 500 మి.గ్రా . మిరియాల పొడికలిపి రోజూ మూడు పూటలు, నాలుగైదు రోజులు తాగినయెడల దగ్గు నుంచి విముక్తి పొందటానికి అవకాశముంది. కోరింత దగ్గు తగ్గడానికి మెడలో గచ్చకాయ మొక్క పూల దండను వడుతుంటారు. ఆకలి లేమి తగ్గడానికి  10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం, అంతే పరిమాణంలో చిత్రమూలం ఆకుల రసం కలిపి దానికి కాస్త మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగితే ఆకలి లేమి, పొట్టలో గ్యాస్, డయేరియా తగ్గటానికి అవకాశముంది.అజీర్ణం సమస్య కూడా తగ్గుతుంది.పొట్టలో నులిపురుగులు నశించడానికి గచ్చ కాయగింజల తైలం వాడతారు.ఉదరవ్యాధులు తగ్గడానికి, అధికంగా మలబద్ధకం ఉంటే వాడతారుపైల్స్ తగ్గడానికి  గచ్చ ఆకులను మెత్తగా నూరి పైల్స్ గడ్డలపై పూస్తారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "PlantNET - FloraOnline". plantnet.rbgsyd.nsw.gov.au. Retrieved 2020-04-26.
  2. admin (2019-09-30). "గచ్చకాయ ఉపయోగాలు?". Good Boss (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-26.[permanent dead link]
  3. "AYURVEDAM - ఆయుర్వేదం: గచ్చ కాయ / GACHA KAYA / NICKERNUTS / CAESALPINIA BONDUC / LATHA KARANJ / KAT KARANJ - ఆయుర్వేద ఉపయోగాలు / AYURVEDA UPAYOGALU". AYURVEDAM - ఆయుర్వేదం. 2014-03-03. Retrieved 2020-04-26.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గచ్చ_కాయ&oldid=3831092" నుండి వెలికితీశారు