గేలక్సీ
గేలక్సీ (ఆంగ్లం : Galaxy) ఓ ఘనమైన గురుత్వాకర్షక వర్తుల విధానం, ఇందులో కోటానుకోట్ల నక్షత్రాలు, అంతర్ నక్షత్ర యానకం ఐన వాయువు మరియు అంతరిక్ష ధూళి మరియు చీకటి పదార్థం గలవు.[2][3] గేలక్సీ అనే పేరుకు మూలం గ్రీకు భాష పదం 'గేలక్సియాస్' [γαλαξίας], అర్థం "పాలతోకూడిన" గేలక్సీ, (పాలపుంతలో లాగ). ఈ గేలక్సీల పరిధి మరుగుజ్జు వీటిలో కనీసం ఓ కోటి నక్షత్రాల [4] (107) నుండి రాకాసులు వెయ్యికోట్ల నక్షత్రాలను కలిగి వుంటాయి.[5] (1012) ఈ నక్షత్రాలన్నీ ఓ అత్యధిక గరిమ గల కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ వుంటాయి. ఈ గేలక్సీలలో నక్షత్ర కుటుంబాలూ వుంటాయి, నక్షత్ర కూటమి మరియు అనేక అంతర్ నక్షత్ర మేఘాలు వుంటాయి. మన సూర్యుడు, పాలపుంత గేలక్సీ లోని ఒక నక్షత్రం; మన సౌరమండలము లో భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ పరి భ్రమిస్తూ ఉంటాయి.
చారిత్రకంగా గేలక్సీలు తమ ఆకారాన్ని బట్టి గుర్తింపబడ్డాయి, వాటి ఆకారాలు శాస్త్రీయంగా, క్రింది విధంగా గుర్తింప బడ్డాయి :
- వర్తులాకార గేలక్సీలు, ఇవి వర్తులాకారంలో వుంటాయి.[6]
- సర్పిలాకార గేలక్సీలు, ఇవి సర్పిలాకారంలో వుంటాయి.
- అనాకార గేలక్సీలు లేదా ప్రత్యేక గేలక్సీలు, వీటికి ప్రత్యేకమైన ఆకారమంటూ వుండదు, వీటిలో 'నక్షత్రాల పుట్టుక'కు ఆస్కారమెక్కువ. [7]
విశ్వం లో దాదాపు 100 బిలియన్ల గేలక్సీలు గలవు. మనం వీక్షించగలిగే విశ్వంలో (1011) గేలక్సీలు గలవు.[8] దాదాపు గేలక్సీలు 1,000 నుండి 100,000 పార్సెక్లు గల వ్యాసం గలిగి వుంటాయి. [5] మరియు మిలియన్ల పార్సెక్కుల దూరాలనూ గలిగి వుంటాయి.[9] అంతర్ గేలక్సీ అంతరాళం (Intergalactic space) లేదా గేలక్సీలకు మధ్య దూరం, సాధారణంగా వాయువు, సరాసరి సాంద్రత, ఒక ఘనపు మీటరుకు ఒక అణువు తో నింపబడివుంటుంది.[10] సాధారంగా గేలక్సీల 90% గరిమ చీకటి పదార్థం తో నింపబడివుంటుందని భావిస్తాం. శాస్త్రవేత్తల వీక్షణాల ఆధారంగా ఇంకనూ భావించడమేమంటే, ఈ గేలక్సీలకు మధ్య కాలబిలం లేదా బ్లాక్ హోల్లు వుండవచ్చునని.[11]
విషయ సూచిక |
[మార్చు] నామ రూపాలు
గేలక్సీ, గ్రీకు పదంనుండి పుట్టినది. అంతరిక్ష సాహిత్యంలో 'గేలక్సీ' అనే పదము, మనముంటున్న పాలపుంత గేలక్సీ కొరకు ఉపయోగిస్తారు.[12]
[మార్చు] వీక్షణ చరిత
మనముంటున్న గేలక్సీ, లేదా పాలపుంత గేలక్సీని శాస్త్రవేత్తలు, వీక్షకులూ, క్షుణ్ణంగా అనేక యుగాలుగా వీక్షిస్తూ నిర్దిష్టమైన సమాచారాన్ని క్రోడీకరించారు. మరియు వీటికి శాస్త్రీయ నామాలు పెట్టారు.
[మార్చు] పాలపుంత
చూడండి : పాలపుంత.
విలియం హెర్షెల్, మొదటి సారిగా పాలపుంత గురించి విపులంగా వర్ణించాడు. మరియు మనం నివసిస్తున్న సౌరకుటుంబం లేదా సౌరమండలము, దీని మధ్యలో వున్నట్టుగా అభివర్ణించాడు.[13][14]
[మార్చు] ఇతర నెబ్యూలా లు
18వ శతాబ్దపు ఆఖరులో, చార్లెస్ మెస్సియర్, 109 కాంతివంతమైన నెబ్యూలాల జాబితా తయారు చేశాడు. తరువాత విలియమ్ హెర్షెల్ చే 5,000 నెబ్యూలాల జాబితా తయారు చేశాడు.[15] 1845 లో, లార్డ్ రాస్సె, ఓ కొత్త దూరదర్శిని (టెలీస్కోపు) ను తయారుచేసి, వర్తులాకార మరియు సర్పిలాకార నెబ్యూలాల మధ్య తేడాలు తెలుపగలిగాడు.[16]
1917 లో, హెర్బర్ కుర్టిస్, ఎస్.ఆండ్రోమిడే నెబ్యూలాను మహా ఆండ్రోమిడా లో కనుగొన్నాడు. [17]
[మార్చు] నవీన శోధనలు
1944 లో హెండ్రిక్ సీ.వాన్ డె, మైక్రోవేవ్ రేడియేషన్ గురించి చెప్పాడు. [18] ఈ రేడియేషన్ 1951 లో గమనించబడినది. ఈ రేడియేషన్ వలన గేలక్సీల అధ్యయనం చాలా సుళువైంది. డాప్లర్ షిఫ్ట్ మరియు ధూళి సంగ్రహణ వలన దీనిపై ప్రభావం తక్కువ. [19] అభివృద్ధి చెందిన రేడియో టెలీస్కోపుల ద్వారా, ఇతర గేలక్సీలలో గల హైడ్రోజన్ ను సైతం, కనుగొనవచ్చును.
[మార్చు] పలు రకాలు మరియు ఆకారాలు
గేలక్సీలు ప్రధానంగా మూడు రకాలు: వర్తులాకార, సర్పిలాకార, మరియు అనాకార గేలక్సీలు. వీటి ఆకారాలను నిర్ణయించే వర్గీకరణలను 'హబుల్ సీక్వెన్స్' అని అంటారు. ఇవి వీక్షణాలపై మాత్రమే ఆధారపడి వుంటుంది. ఇంకా పలువిషయాలు లెక్కలోకి తీసుకుంటారు, అవి, 'నక్షత్రాల పుట్టుక' రేటు (నక్షత్రాల విస్ఫోటక గేలక్సీలు), 'కేంద్రకాలలో క్రియాశీలత' (క్రియాశీలక గేలక్సీలలో).[7]
[మార్చు] వర్తులాకార
- ప్రధాన వ్యాసం: వర్తులాకార గేలక్సీ
వర్తులాకార గేలక్సీలు రాక్షసాకారాలలో వుంటాయి. ఇవి అతి పెద్ద గేలక్సీలు. ఈ రకం గేలక్సీలు ఏర్పడుటకు కారణం 'గేలక్సీల ఆకర్షణ' వల ఏకమై పెద్ద గేలక్సీలేర్పడుట అని భావిస్తున్నారు. ఈ ఏకీకరణ వలన రెండు లేదా అంతకన్నా ఎక్కువ గేలక్సీలు మమేకమైనపుడు, ఢీకొనడాలు మరియు మమేకాలు, ప్రళయపాతాలుగా వుంటాయని భావిస్తారు.[20] నక్షత్రవిస్ఫోట గేలక్సీలు వీటికి ఉదాహరణ అని, గేలక్సీల ఢీకొనడాల వలన వర్తులాకార గేలక్సీలు ఏర్పడుటకు సహాయ పడుతాయి[21]
[మార్చు] సర్పిలాకార
- ప్రధాన వ్యాసం: సర్పిలాకార గేలక్సీ
సర్పిలాకార గేలక్సీలలో పరిభ్రమిస్తున్న నక్షత్రాల పళ్ళెం మరియు అంతర్-నక్షత్ర మాధ్యమం, వీటితో పాటు ప్రాచీన నక్షత్రాల సమూహం వుంటాయి. ఇవి బయటివైపు విస్తరిస్తూ వుంటుంది. హబుల్ వర్గీకరణ అనుసారం వీటిని S, మరియు (a, b, లేదా c) తో సూచిస్తారు.[22]
[మార్చు] ఇతర రూపాలు
ప్రత్యేక గేలక్సీలు, గేలక్సీల రూపాంతరాలు. వీటికి చక్కటి ఉదాహరణ రింగ్ గేలక్సీలు లేదా గుండ్రటి గేలక్సీలు. ఇవి ఇతర గేలక్సీలతో పోటుపాటుల సంబంధాలు కలిగివుంటాయి. వీటిలో రింగులలాంటి నక్షత్రాలుంటాయి. సర్పిలాకార గేలక్సీల గుండా చిన్న చిన్న గేలక్సీలు చొచ్చుకొని పోయినపుడు ఈ రింగ్ గేలక్సీలు ఏర్పడుతాయి.[23]
[మార్చు] మరుగుజ్జులు
- ప్రధాన వ్యాసం: మరుగుజ్జు గేలక్సీ
పెద్ద పద్ద వర్తులాకార గేలక్సీలు విశ్వంలో ప్రాముఖ్యతలను సంతరించుకొన్ననూ, చాలా గేలక్సీలు మరుగుజ్జులే. ఈ గేలక్సీలు పాలపుంతలో నూరవ వంతు మాత్రమే వుంటాయి. ఈ చిన్న గేలక్సీలు కొన్ని బిలియన్ల నక్షత్రాలను మాత్రమే కలిగివుంటాయి.[24]
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] నోట్స్
- ^ Galaxies to the left side of the Hubble classification scheme are sometimes referred to as "early-type", while those to the right are "late-type".
- ^ The term "field galaxy" is sometimes used to mean an isolated galaxy, although the same term is also used to describe galaxies that do not belong to a cluster but may be a member of a group of galaxies.
[మార్చు] మూలాలు
- ↑ Happy Sweet Sixteen, Hubble Telescope!. NASA (April 24 2006). తీసుకొన్న తేదీ: 2006-08-10.
- ↑ L. S. Sparke, J. S. Gallagher III (2000). Galaxies in the Universe: An Introduction. Cambridge: Cambridge University Press. ISBN 0-521-59704-4.
- ↑ Hupp, E.; Roy, S.; Watzke, M. (August 21, 2006). NASA Finds Direct Proof of Dark Matter. NASA. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ Unveiling the Secret of a Virgo Dwarf Galaxy. ESO (May 3 2000). తీసుకొన్న తేదీ: 2007-01-03.
- ↑ 5.0 5.1 Hubble's Largest Galaxy Portrait Offers a New High-Definition View. NASA (February 28 2006). తీసుకొన్న తేదీ: 2007-01-03.
- ↑ Hoover, Aaron. "UF Astronomers: Universe Slightly Simpler Than Expected", Hubble News Desk, June 16, 2003. Retrieved on 2007-02-05.
- ↑ 7.0 7.1 Jarrett, T.H.. Near-Infrared Galaxy Morphology Atlas. California Institute of Technology. తీసుకొన్న తేదీ: 2007-01-09.
- ↑ Mackie, Glen (February 1 2002). To see the Universe in a Grain of Taranaki Sand. Swinburne University. తీసుకొన్న తేదీ: 2006-12-20.
- ↑ D. Gilman. The Galaxies: Islands of Stars. NASA WMAP. తీసుకొన్న తేదీ: 2006-08-10.
- ↑ Galaxy Clusters and Large-Scale Structure. University of Cambridge. తీసుకొన్న తేదీ: 2007-01-15.
- ↑ D. Finley, D. Aguilar (November 2 2005). Astronomers Get Closest Look Yet At Milky Way's Mysterious Core. National Radio Astronomy Observatory. తీసుకొన్న తేదీ: 2006-08-10.
- ↑ Koneãn˘, Lubomír. Emblematics, Agriculture, and Mythography in The Origin of the Milky Way (PDF). Academy of Sciences of the Czech Republic. తీసుకొన్న తేదీ: 2007-01-05.
- ↑ Marschall, Laurence A. (October 21, 1999). How did scientists determine our location within the Milky Way galaxy--in other words, how do we know that our solar system is in the arm of a spiral galaxy, far from the galaxy's center?. Scientific American. తీసుకొన్న తేదీ: 2007-12-13.
- ↑ Kuhn, Karl F.; Koupelis, Theo (2004). In Quest of the Universe. Jones and Bartlett Publishers. ISBN 0-7637-0810-0.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;our_galaxyఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Abbey, Lenny. The Earl of Rosse and the Leviathan of Parsontown. The Compleat Amateur Astronomer. తీసుకొన్న తేదీ: 2007-01-04.
- ↑ Heber D. Curtis (1988). "Novae in Spiral Nebulae and the Island Universe Theory". Publications of the Astronomical Society of the Pacific 100: 6.
- ↑ Tenn, Joe. Hendrik Christoffel van de Hulst. Sonoma State University. తీసుకొన్న తేదీ: 2007-01-05.
- ↑ M. López-Corredoira, P. L. Hammersley, F. Garzón, A. Cabrera-Lavers, N. Castro-Rodríguez, M. Schultheis, T. J. Mahoney (2001). "Searching for the in-plane Galactic bar and ring in DENIS". Astronomy and Astrophysics 373: 139–152. Retrieved on 2007-01-08.
- ↑ Galaxies. Cornell University (October 20 2005). తీసుకొన్న తేదీ: 2006-08-10.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;ellipticalఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Smith, Gene (March 6 2000). Galaxies — The Spiral Nebulae. University of California, San Diego Center for Astrophysics & Space Sciences. తీసుకొన్న తేదీ: 2006-11-30.
- ↑ R. A. Gerber, S. A. Lamb, D. S. Balsara (1994). "Ring Galaxy Evolution as a Function of "Intruder" Mass". Bulletin of the American Astronomical Society 26: 911.
- ↑ S. Phillipps, M. J. Drinkwater, M. D. Gregg, J. B. Jones (2001). "Ultracompact Dwarf Galaxies in the Fornax Cluster". The Astrophysical Journal 560 (1): 201–206.
General references:
- Dickinson, Terence (2004). The Universe and Beyond, 4th, Firefly Books Ltd.. ISBN 1-55297-901-6.
- James Binney, Michael Merrifield (1998). Galactic Astronomy. Princeton University Press. ISBN 0-691-00402-1.
[మార్చు] బయటి లింకులు
- Galaxies, SEDS Messier pages
- An Atlas of The Universe
- Galaxies — Information and amateur observations
- The Oldest Galaxy Yet Found
- Galaxies — discussed on BBC Radio 4's "In Our Time" programme
- Galaxy classification project, harnessing the power of the internet and the human brain