చిట్టెలుక

వికీపీడియా నుండి

చిట్టెలుక
శిలాజ విస్తృతి: Late Miocene - Recent
Wood mouse, Apodemus sylvaticus
Wood mouse, Apodemus sylvaticus
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: రోడెన్షియా
Superfamily: Muroidea
కుటుంబము: మ్యూరిడే
ఉపకుటుంబము: మ్యూరినే
ప్రజాతి: Mus
లిన్నేయస్, 1758
జాతులు
30 species; see text

చుంచు లేదా చిట్టెలుక (ఆంగ్లం: Mouse; బహువచనం: Mice) ఒక చిన్న ఎలుక లాంటి జంతువు. ఇవి రోడెన్షియా (Rodentia) తరగతికి చెందినవి; వీనిలో అందరికీ తెలిసిన ఇంటిలోని చిట్టెలుక శాస్త్రీయ నామం మస్ మస్కులస్ (Mus musculus). వీనిని కొంతమంది పెంపుడు జంతువుగా పెంచుకొంటారు.


చిట్టెలుక సుమారు రెండున్నర సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి పరభక్షకాలు అయిన పిల్లి, కుక్క, నక్క, గద్దలు, పాములు మొదలైన జీవులచే భక్షించబడతాయి. అయితే వీటికున్న సానుకూలత వలన, మానవులతో ఇవి సాగించే సహజీవనం వలన, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలుగుతాయి. ఇవి భూమి మీద జీవించే జీవులన్నింటిలోకి మానవుని తర్వాత అత్యంత సాఫల్యత కలిగిన క్షీరదాలు.


చిట్టెలుకలు మనకెంతో హాని కలిగిస్తున్నాయి. ఇవి పంటల్ని తిని నాశనం చేస్తాయి. ఇవి కొన్ని వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. మనిషి పిల్లుల్ని పెంచుకొవడానికి ముఖ్యమైన కారణం ఈ ఎలుకల బెడత తప్పించుకోవడానికని భావిస్తారు.


[మార్చు] ప్రయోగశాల చిట్టెలుక

చిట్టెలుకలు సామాన్యంగా ప్రయోగశాలలో జీవ పరిశోధనల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఈ క్షీరదాలు మానవులకు జన్యుపరంగా చాలా పోలికలుండడమే. ఎలుకల కన్నా వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులలో చేయలేని ప్రయోగాలను చిట్టెలుకల మీద చేస్తారు. ప్రయోగశాలలో చిట్టెలుకలను పెంచడం సులువు, చౌక మరియు తొందరగా పెరుగుతాయి. కొన్ని తరాల చిట్టెలుకల్ని తక్కువ సమయంలో పరిశోధించవచ్చును.

[మార్చు] జాతులు

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు