చిలుకూరి వీరభద్రరావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చిలుకురి వీరభద్రరావు(1872-1939)

చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి,ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.[1] దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది. [2] ఆయన 1939 లో మరణించాడు. [3]

రచనలు[మార్చు]

 • రాజమహేంద్రపుర చరిత్రము
 • ఆంధ్రుల చరిత్రము
 • జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము
 • తిక్కన సోమయాజి
 • తిమ్మరుసు మంత్రి
 • శ్రీనాథ కవి
 • శివాజీ చరిత్ర
 • కర్ణ సామ్రాజ్యము
 • నవరసిక మనోల్లాసిని
 • స్వయం సహాయము
 • వరలక్ష్మీ విలాసము
 • హిందూ సంసారము
 • హిందూ గృహము
 • హస్య తరంగిణి
 • సుమిత్ర
 • ఆళియరామరాయలు
 • నాయకురాలి దర్పము

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]