టీవీ నారాయణ
టీవీ నారాయణ | |
---|---|
జననం | బొల్లారం, సికింద్రాబాదు, తెలంగాణ | 1925 జూలై 26
మరణం | 2022 జనవరి 11 | (వయసు 96)
వృత్తి | కవి, రచయిత, సామాజికవేత్త |
జీవిత భాగస్వామి | టి.ఎన్.సదాలక్ష్మి |
తల్లిదండ్రులు | వెంకయ్య, నర్సమ్మ |
పురస్కారాలు | పద్మశ్రీ |
డా.టీవీ నారాయణ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్య, సామాజిక రంగాలల్లో సుపరితుడైన వ్వక్తి. తెలంగాణా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. పాఠశాల అధ్యాపకుడుగా జీవితం ఆరంబించిన వీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడి స్థాయికి ఎదిగారు.[1]
జననం
[మార్చు]టీవీ నారాయణగా ప్రసిద్ధి చెందిన తక్కెళ్ల వెంకట నారాయణ 1925, జూలై 26న వెంకయ్య, నర్సమ్మ దంపతులకు సికింద్రాబాదు సమీపంలోని బొల్లారంలో జన్మించారు. మాజీ మంత్రి టి.ఎన్.సదాలక్ష్మి వీరి భార్య. టీవీ నారాయణ సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారు.
విద్య
[మార్చు]ప్రాథమిక విద్యాభ్యాసం బొల్లారం రెసిడెంట్ స్కూల్లో జరిగింది. నిజాం కళాశాలలో బి.ఎ. గణిత శాస్త్రము చదివిన వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో ఎం.ఎ. పట్టా పొందారు. వీరు నిత్య విద్యార్థిగా వుంటూ తన 71 వ ఏట కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు. వీరు అనేక సామజిక కార్యక్రమాల్లో పాల్గొని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి బందు సేవా మండలి స్థాపించారు. వేదాలు, ఉపనిషత్తులు చదివారు.
ఉద్యమ జీవితం
[మార్చు]నారాయణ రాజకీయ కార్యకలాపాలు హిందూత్వకు దగ్గరగా ఉండడంతో రజాకార్లకు టార్గెట్‌గా మారారు. ఇదే సమయంలో స్వామి రామానంద తీర్థతో కలిసి పనిచేశారు. రజాకార్ల నుండి తప్పించుకోవడానికి అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళారు.
ఉద్యోగం
[మార్చు]1954లో హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేశారు. బోర్డ్‌ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఉద్యోగం చేశారు. 1974లో సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో డిప్యూటి డైరెక్టర్‌గా రిటైరై 1974-80 మధ్యకాలంలో పబ్లిక్‌సర్విస్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.
ఉపాధ్యాయుడిగా ఖమ్మం, జనగామ, జోగిపేట, సూర్యాపేట, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పనిజేశారు. మాజీ డిజిపి పేర్వారం రాములు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సంతోష్‌రెడ్డి, ముకుందరెడ్డి తదితరులందరికి విద్యను బోధించారు.
రచనలు
[మార్చు]నారాయణ 20 వరకూ పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని:
- జీవనవేదం
- ఆర్షపుత్ర శతకం[2]
- భవ్యచరిత శతకం
- ఆత్మదర్శనం (కవితా సంపుటి)
- అమర వాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాస సంపుటి)
పురస్కారాలు
[మార్చు]- 2016లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం[3]
- భారత రాష్ట్రపతి చేతులమీదుగా వేద పండిత్ పురస్కారం
- తెలుగు విశ్వ విద్యాలయం నుండి ధర్మరత్న పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి దళిత రత్న పురస్కారం
పదవులు
[మార్చు]నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కార్య నిర్వాహక మండలి సభ్యుడిగా, ఆర్య ప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షుడిగా, భాగ్యనగర్ ఖాది కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
మరణం
[మార్చు]టివి నారాయణ 2022, జనవరి 11న హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో మరణించాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "చదువుల రేడు టీవీ అస్తమయం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-11. Archived from the original on 2022-01-12. Retrieved 2022-01-12.
- ↑ E-books available at Tirumala Tirupati Devasthanams, తెలుగు విభాగం
- ↑ Apr 26; 2016. "Padmashri awardee Dr T V Narayana felicitated |". herald.uohyd.ac.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-17. Retrieved 2022-01-11.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "టీవీ నారాయణ కన్నుమూత". andhrajyothy. Archived from the original on 2022-01-12. Retrieved 2022-01-12.
- ↑ "స్వాతంత్ర్య సమరయోధుడు, కవి టీవీ నారాయణ మృతి". EENADU. Archived from the original on 2022-01-12. Retrieved 2022-01-12.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 errors: numeric name
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- 1925 జననాలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన తెలంగాణ వ్యక్తులు
- 2022 మరణాలు
- హైదరాబాదు జిల్లా వ్యక్తులు
- హైదరాబాదు జిల్లా రచయితలు
- హైదరాబాదు జిల్లా సామాజిక కార్యకర్తలు
- హైదరాబాదు జిల్లా ఉపాధ్యాయులు
- హైదరాబాదు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- తెలంగాణ ఉద్యమకారులు
- నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు