తిమ్మమ్మ మర్రిమాను

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ మరియు అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది.

ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి వుంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద "తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప మరియు మంగమ్మ లకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది" అని చెక్కబడింది.

తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన చోట మొలచబడ్డ మొక్క ఈరోజు ఇంత పెద్ద మర్రిమాను గా వృద్ధి చెందింది అని భక్తులు భావిస్తారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వలన పిల్లలు కలుగుతారు అని భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

తిమ్మమ మర్రిమాను వృక్షము పైన ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతే కాకుండా సాయంత్రము ఆరు గంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టు పై ఉండవు. ప్రస్తుతము ఈ వృక్షపు మొదలువద్ద మరొక మొక్క మొదలు ఆయ్యింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]