తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2021)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీర్తి పురస్కారాలు (2021)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2020
మొత్తం బహూకరణలు 45
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116
Award Rank
2020కీర్తి పురస్కారాలు (2021)2022

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు[మార్చు]

2021 సంవత్సర కీర్తి పురస్కారానికి 45మంది ప్రముఖులు జాబితా 2023 ఆగస్టు 24న ప్రకటించబడింది.[2]

2023 సెప్టెంబరు 11, 12న హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారాలు అందజేయబడ్డాయి.

11న జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్‌ కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి హాజరై 23మందికి పురస్కారాన్ని అందించాడు.[3]

12న జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా తమిళనాడు కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ విశ్వ మహావిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్. జయరామరెడ్డి హాజరై 22మందికి పురస్కారాన్ని అందించాడు.[4]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 సంగెవేని రవీంద్ర సృజనాత్మక సాహిత్యం బెజవాడ పట్టాభిరామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
2 డా. గుంజి వెంకటరత్నం పరిశోధన తిక్కవరపు రామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
3 రాచమళ్ళ ఉపేందర్ హాస్యరచన బులుసు బుచ్చి సర్వారాయడు ఎస్.బి.బి. పట్టాభిరామారావు
4 డా. షేక్ హసీన జీవిత చరిత్ర ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు
5 రేగులపాటి విజయలక్ష్మి ఉత్తమ రచయిత్రి నాళం కృష్ణారావు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
5 బెంగళూరు పద్మ ఉత్తమ నటి పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
7 దొంతి జంగయ్యగౌడ్ ఉత్తమ నటుడు పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
8 నాగబాల సురేష్ కుమార్ ఉత్తమ నాటక రచయిత పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
9 టి. రమేష్ హేతువాదం త్రిపురనేని రామస్వామి కోటపాటి మురహరిరావు
10 చలసాని వసుమతి ఉత్తమ రచయిత్రి వాసిరెడ్డి రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి
11 కె. ప్రభాకర్ వచన కవిత ఎ. లక్ష్మీరమణ అమిలినేని లక్ష్మీరమణ
12 ఎస్.ఆర్. పృథ్వి వివిధ ప్రక్రియలు ఏటుకూరి వెంకట నర్సయ్య డా. యస్.యస్. కృష్ణమూర్తి
13 పరాకుంశం వేణుగోపాలస్వామి పత్రికారచన తాపీ ధర్మారావు కోటపాటి మురహరిరావు
14 వల్లూరి రమేష్ అవధానం కార్యమపూడి రాజమన్నారు కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు
15 డా. సాకే భారతి మహిళాభ్యుధయం మల్లాది సుబ్బమ్మ మల్లాది సుబ్బమ్మ
16 వేముల శ్రీనివాసులు గ్రంథాలయ కర్త అయ్యంకి వెంకటరమణయ్య డా. వెలగా వెంకటప్పయ్య
17 ప్రొ. కందిమళ్ళ భారతి గ్రంథాలయ సమాచార విజ్ఞానం పర్వతనేని గంగాధరరావు డా. వెలగా వెంకటప్పయ్య
18 కూర చిదంబరం కథ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
19 అభినయ శ్రీనివాస్ నాటకం బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
20 మేకిరి దామోదర్ ఉత్తమ ఉపాధ్యాయుడు బైరగోని మల్లయ్య గౌడ్
21 పేరిణి శ్రీనివాస్ పేరిణి డా. నటరాజ రామకృష్ణ డా. నటరాజ రామకృష్ణ
22 చుండూరు సీత నవల బి. అరుణ కుమారి ఆచార్య వి. రామకృష్ణారావు
23 డా. రూప్ కుమార్ డబ్బీకార్ అనువాదం అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు అబ్బూరి ట్రస్ట్
24 వై. గంగాధర్ జానపద కళలు సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
25 డా. చెన్నమనేని హన్మంతరావు ఆధ్యాత్మిక సాహిత్యం బాదం సరోజదేవి బాదం రామస్వామి
26 ప్రొ. అన్నంరాజు సుబ్బారావు సాహిత్య విమర్శ పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం ఆచార్య పి. లీల
27 సందాపురం బిచ్చయ్య పద్యం నండూరి రామకృష్ణమాచార్య నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం
28 వేముల వెంకటేశ్వర్లు సాంస్కృతిక సంస్థ నిర్వహణ వంగా లక్ష్మణరెడ్డి వి.వి. రాఘవరెడ్డి
29 వెంకు జనరంజక విజ్ఞానం నాగసూరి సంజీవయ్య నాగసూరి వేణుగోపాల్
30 తేలు విజయ జానపద గాయకురాలు బుర్రా రాజసోమిదేవి పి. రాజ్యలక్ష్మీ
31 సంగనభట్ల చిన్న రామకృష్ణయ్య బాల సాహిత్యం అంగలకుదిటి సుదంరాచార్య కందేపి రాణిప్రసాద్
32 అలీ ఇంద్రజాలం డా. బి.వి.పట్టాభిరామ్ బి.వి.పట్టాభిరామ్
33 డా. శాస్త్రుల రఘుపతి పద్య రచన కె.వి. రమణాచారి డా. కె.వి. రమణాచారి
34 శ్యాంమోహన్ కార్టూనిస్ట్ జి. అమృతలత జి. అమృతలత
35 విన్నకోట మురళీకృష్ణ లలిత సంగీతం జి. రాజారెడ్డి జి. రాజారెడ్డి
36 చెరకు సత్యనారాయణ రెడ్డి గేయ కవిత
37 డా. చల్లా విజయలక్ష్మి శాస్త్రీయ సంగీతం డా. రావూరి భరద్వాజ కాంతమ్మ డా. రావూరి భరద్వాజ
38 డా. సంధ్యాలక్ష్మి జ్యోతిషం మాటేటి రామప్ప
39 ఎన్. గోపాలకృష్ణ కాల్పనిక సాహిత్యం నాయని సుబ్బారావు
40 ధనంజయ లాడె సంఘపేవ గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి
41 డా. చింతా రవి బాలకృష్ణ కూచిపూడి నృత్యం కర్కాల దేవకమల
42 డా. వెలుదండ వెంకటేశ్వరరావు ప్రాచీన సాహిత్యం బండ్ల సుబ్రహ్మణ్యం
43 చేవూరు సుబ్బారావు అనువాద సాహిత్యం నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు
44 భార్గవి చిత్రలేఖనం పాములపర్తి సత్తెమ్మ నరసింహరావు
45 ప్రొ. అమరేశం రాజేశ్వర శర్మ ఛందస్సు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2023-09-13.
  2. Global, Telugu (2023-08-24). "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన". www.teluguglobal.com. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.
  3. ABN (2023-09-12). "23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.
  4. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2023-09-13. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.