త్రొక్కిసలాట మరణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొక్కిసలాట మరణాలు, (Stampede deaths) అంటే జనం విపరీతముగా గుమికూడి తోసుకోవడం వలన కలిగే ప్రమాదపు మరణాలు. త్రొక్కిసలాట మరణాలను ఈ విధంగా “ది డాక్టర్స్ ఫ్రీ డిక్షనరీ లో నిర్వచించారు “  మతపరమైన తీర్థయాత్రలలో, క్రీడలలో, సంగీత కార్యక్రమాల సమయంలో సంభవించే మానవ విపత్తు, పేలుడు, అగ్నిప్రమాదం లేదా తొక్కిసలాటకు కారణమయ్యే ఇతర  ఆకస్మిక  సంఘటనలన  కారణంగా, జనం సామూహిక భయాందోళనలకు గురైనప్పుడు. ఊపిరాడకపోవడం (క్రౌడ్ క్రష్) వల్ల ఇలాంటి సంఘటనలు సంభవిస్థాయి[1].  “ డి డిక్షనరీ.కామ్ “  నిర్వచించిన ప్రకారం “  అకస్మాత్తుగా, ఉన్మాదంతో కూడిన హడావిడి లేదా భయంకరమైన జంతువుల గుంపు రావడం, ముఖ్యంగా పశువులు లేదా గుర్రాల గుంపు  ఇతర జంతువులనుంచి ప్రమాదం వచ్చినప్పుడు త్రొక్కిసలాట మరణాలు సంభవిస్తాయి”[2] .

అవలోకనం[మార్చు]

ఫ్నోమ్ పెన్హ్ తొక్కిసలాట - బౌద్ధ సన్యాసుల వేడుక

తొక్కిసలాట మరణాలు ప్రపంచపు నలుమూలలా జరుగుతూ ఉన్నా అవి ఎక్కువగా మూడవ ప్రపంచపు దేశాలలోనే జరుగుతాయి. అధిక జనాభా, ఎక్కువ మంది గుమికూడుట , ప్రభుత్వాధికారులకు గుంపుల నిర్వహణలలో తగిన శిక్షణ లేకపోవుట ( అందుచే వారికి ఏర్పడే అశక్తత, ఉదాసీనత ), ముందుగా త్రొక్కిసలాటలను నిరోధించుటకు ప్రణాళికలు, ముందు జాగ్రత్తలు లేకపోవుట , ప్రజలలో క్రమశిక్షణారాహిత్యం దీనికి కారణాలు కావచ్చును.[3]

21 వ శతాబ్దములో జరిగిన కొన్ని ముఖ్యమైన తొక్కిసలాటల మరణాలు[మార్చు]

  • 2004 ఏప్రిల్ 12 లో లక్నో నగరములో ఉచిత చీరల పంపిణీలో 21 మంది స్త్రీలు మరణించారు.
  • 2005 జనవరి లో మహారాష్ట్రలో ఒకగుడి వద్ద త్రొక్కిసలాటలో 265 మంది హిందూ యాత్రికులు మరణించారు.
  • 2005 డిసెంబరు లో 42 మంది వఱద బాధితులు వస్తువుల పంపిణి సందర్భములో దక్షిణ భారతములో మరణించారు.
  • 2007 అక్టోబర్ 3 న ఉత్తర భారతములో 14 మంది స్త్రీలు ఒక రైల్వే స్టేషనులో మరణించారు.
  • 2008 మార్చి 27 న ఒక గుడిలో 8 మంది మరణించారు.
  • 2008 ఆగష్టు 3 న హిమాచల్ ప్రదేశ్ లో నైనాదేవి గుడి వద్ద 162 మంది భక్తులు మరణించారు .
  • 2008 సెప్టెంబరు 30 న జోధ్ పూరులో చాముండేశ్వరి దేవి గుడి వద్ద 224 మంది భక్తులు మరణించారు. బాంబు ఉందనే పుకారు విని పరుగులు పెట్టడం యీ ప్రమాదం జరిగింది.
  • 2010 మార్చి 4 న రాం- జానకి గుడి వద్ద కుందా లో 71 మంది మరణించారు.
  • 2011 జనవరి 15 న శబరిమల గుడి వద్ద 102 మంది భక్తులు మరణించారు.
  • 2011 నవంబరు 8 న హరిద్వార్ లో గంగానదీ తీరములో 16 గురు మరణించారు.
  • 2013 ఫిబ్రవరి 10 న అలహాబాద్ లో కుంభమేళా ఉత్సవాలలో 36 మంది మరణించారు
  • 2013 అక్టోబరు 13 న నవరాత్రి ఉత్సవాలలో రత్నాఘర్ మాత గుడి ,మధ్యప్రదేశ్ లో 115 మంది మరణించారు.
  • (2014 అక్టోబరు 3 న పాట్నా గాంధీ మైదానములో దశరా ఉత్సవాలలో 32 మంది మరణించారు.
  • 2015 జూలై 14 న గోదావరి పుష్కరాల ప్రారంభ దినమునాడు రాజమండ్రిలో 27 మంది యాత్రికులు మరణించారు.
  • 2015 ఆగష్టు 10 న ఝార్ఖండ్ రాష్త్రము దియోగఢ్ లో దుర్గామాత ఆలయములో తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు.
  • 2015 సెప్టెంబరు 24 నాడు మక్కాలో 769 మంది హాజ్ యాత్రికులు త్రొక్కిసలాటలో మరణించారు. 2006 తర్వాత హాజ్ యాత్రలో మరల అధిక సంఖ్యలో యింతమంది యాత్రికులు మరణించడము అనేకులు గాయపడడం జరిగింది. యాత్రికులను గుంపులుగా విభజించి, జనసందోహమును నియంత్రిచడములో సౌదీ రక్షకభటులు, కార్యకర్తలు వైఫల్యము చెందారు.
  • 2017 సెప్టెంబరు 29 నాడు ముంబాయి ఎల్ఫిన్ స్టోన్ ట్రైన్ స్టేషన్ వద్ద కాలివంతెనపై జరిగిన త్రొక్కిసలాటలో 22 మంది మరణించారు. వంతెన కూలిపోతుందేమో అనే భయముతో ప్రజలు తోపులాట ప్రారంభించారు.
  • 2020 జనవరి 7 నాడు ఇరాన్ లో ఖాసిం సోలైమని అంత్యక్రియల ఊరేగింపు త్రొక్కిసలాటలో 56 మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.
  • 2020 ఆగష్టు 22 నాడు లాస్ ఒలివోస్ , లిమా , పెరూ లో చట్ట వ్యతిరేకముగా జనులు గుమికూడిన నైట్ క్లబ్ పై పోలీసులు దాడి చేసినపుడు త్రొక్కిసలాటలో 13 గురు చనిపోయారు. కోవిడ్ ను నియంత్రించుటకు జనులు గుమికూడుటను అచటి ప్రభుత్వము నిషేధించింది.
  • 2021 ఏప్రిల్ 30, న , మౌంట్ మేరన్ , ఇజ్రాయిల్ లో మత సంబంధ ఉత్సవములో జరిగిన త్రొక్కిసలాటలో 45 మరణించారు, 150 మంది గాయపడ్డారు.
  • 2021 నవంబరు 5 , న ఉత్తర అమెరికా దేశం హ్యూష్టన్ నగరములో ‘ ఆష్ట్రో వరల్డ్ ‘ గాన కచేరీ సభలో జరిగిన త్రొక్కిసలాటలో 9 మంది మరణించారు , 300 మంది గాయపడ్డారు[4][5].
  • 2022 అక్టోబరు 29, న దక్షిణ కొరియా, సియోల్ లో హేలొవిన్ ఉత్సవ వేడుకల సందర్భముగా జరిగిన త్రొక్కిసలాటలో 154 మంది మృతిచెందారు. ఒక సినిమానటి వచ్చారనే వార్తతో ఆమెను చూడటానికి ప్రజలు తోసుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడము వలన ఈ ప్రమాదము జరిగింది[6][7].
  • 2022 డిసెంబరు 28 న భారతదేశం ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లా కందుకూరులో ఒక రాజకీయపక్ష సభలో తొక్కిసలాట వలన కొందఱు కాలువలో పడగా, ఎనమండుగురు మృతిచెందారు. మరికొందఱు గాయపడ్డారు[8].
  • 2023 జనవరి 1, న ఆంధ్రప్రదేశ్, గుంటూరులో ఒక రాజకీయపక్ష సభలో చీరలు, వస్తువులు కానుకలు పంపిణీ సందర్భములో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
  • 2023 ఫిబ్రవరి 4 న చెన్నై తిరుపత్తూరు జిల్లాలో వాణియంబాడి ప్రాంతములో మురుగన్ తైపూసం ఉత్సవాల సందర్భములో ఒక ప్రైవేటు సంస్థ తలపెట్టిన ఉచిత చీరలు ధోవతీల పంపిణి కార్యక్రమములో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మహిళలు మరణించారు. పదిమంది గాయపడ్డారు[9].

వెనుక నుంచి ఆత్రుత పడే జనులకు ముందు వారి అవస్థ తెలియదు. సరియైన శిక్షణ, ముందుచూపు, ప్రణాళికా లోపించడం వలన యీ ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలు నివారించ దగినవే! ఈ ప్రమాదాలలో యాత్రికులను, ప్రజలను నిందించుట పొరబాటు.

నివారణ[మార్చు]

ఇలాంటి ప్రమాదాలలో కొన్ని అనివార్యమైనా , చాలా త్రొక్కిసలాటలను ముందు జాగ్రత్త చర్యలతో నివారించ వచ్చును .

  • అధికారులకు , స్వయంసేవకులకు ముందుగానే జనసందోహాలను గౌరవపూర్వకముగా నియంత్రించడములో తగిన శిక్షణలు ఇచ్చి వారిని గుంపులను నియంత్రించుటకు నియోగించాలి.
  • అట్టి శిక్షణ గల అధికారులను ప్రజలు గుమికూడే సందర్భాలలో తప్పక వినియోగించుకోవాలి.
  • జనసందోహములను నిర్ణీత సమయయములలోను, నిర్ణీత స్థలములలోను గుంపులుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో ముందుకి నడిపించాలి.
  • యాత్రికులు వారంతట వారొక చోటికి చేరుకోలేరు కాబట్టి అదుపులో ఉంచగలిగిన అంత మందినే నిర్వాహకుకులు ఆ యా స్థలములకు నిర్ణీత సమయాలలో విభజించి చేర్చాలి.
  • తగిన ఉక్కు అడ్డుకట్టలు , త్రాళ్ళుతో , గుంపులను నియంత్రించాలి.
  • విపరీతమైన ఎండ , చలి వంటి వాతావరణ పరిస్థితుల నుంచి కొంత రక్షణ కలిపించాలి.
  • ప్రజలు అసహనానికి లోనవకుండా చూసుకోవాలి.
  • వరుసలలో నిలబడుట ఇష్టము లేనివారు బయట పడడానికి అవకాశాలు కల్పించాలి.
  • పిల్లా పాప ఉన్నవారిని , వృద్థులను, వికలాంగులను గౌరవముతో పరిరక్షించుకోవాలని ప్రజలకు హెచ్చరికలు చేస్తూ ఉండాలి. స్వయంసేవకులు గాని , రక్షకభటులు గాని వారి రక్షణకు పూనుకోవాలి
  • సభలు జరిపేటప్పుడు, జనసందోహమును సమీకరించేటప్పుడు విశాలమైన ప్రదేశాలను ఎన్నుకొని జన సాంద్రతను నివారించాలి.
  • ప్రమాదాలు జరిగినపుడు రాజకీయాలు , పరస్పర నిందలు చేస్తే సాధించేది లేదు.

ఈ ప్రమాదాలను అరికట్టే సత్తా ప్రభుత్వ యంత్రాంగాలకే ఉంటుంది కాబట్టి, ప్రజలకు క్రమశిక్షణ లేదని నిందిస్తే లాభము లేదు. వ్యక్తిగతముగా బాధ్యతాపరులైనా, గుంపులో ఉన్న జనులకు క్రమశిక్షణ ఉండదు, వ్యక్తులకు గుంపులపై ఆధీనము ఉండదు . ఆ భావనతోనే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ త్రొక్కిసలాటలను కావాలని ఎవరూ ప్రారంభించరు. ముందుకు పోదామని వెనుక ఉన్నవారు తొందఱపడుతారు. మనుజుల వత్తిడితో ముందున్నవారు ఉక్కిరి బిక్కిరయి ఊపిరి ఆడక ( Compressive Asphyxiation ) మరణించడమో , సొమ్మసిల్లడమో జరుగుతుంది. మనుష్యులపై మనుష్యులు పడినప్పుడు కూడా క్రిందవారికి ఊపిరి ఆడదు. పడిపోవుట వలన గాయాలు తగులుతాయి.

ముందున్నవారి పరిస్థితి వెనుక ఉన్నవారికి తెలియదు. వెనుక ఉన్నవారికి ముందున్న వారి పరిస్థితిని తెలియ పఱచి తోపులాటలు అరికట్టాలి. ముఖ్యముగా ప్రజలను చిన్న చిన్న గుంపులుగా విభజించాలి.

1900- 2015 ల మధ్య విపత్తులు (ప్రపంచం)[మార్చు]

తొక్కిసలాట కదలడానికి తక్కువ స్థలం ఉన్న ఒక మార్గంలో  ఒక పెద్ద గుంపు తొందరలో ఉన్నప్పుడు  ప్రమాదాలు సంభవిస్తాయి. 1943 లో బెత్నాల్ గ్రీన్ ట్యూబ్ డయాస్టర్ గురించి ఒక రచయిత పేర్కొన్న దాని ప్రకారం , "మంద-ప్రవృత్తి ద్వారా మార్గనిర్దేశం చేయబడిన జంతువులు గ్రహించిన ప్రమాదం నుండి గ్రహించిన భద్రత వైపు వెళ్ళినప్పుడు అడవిలో తొక్కిసలాటలు ప్రారంభమవుతాయి. ప్రజలు మరింత హేతుబద్ధమైన జీవులుగా భావించబడుతున్నప్పటికీ, అదే కారణంతో తొక్కిసలాటలలో గుంపులతో రావడం వల్ల జరుగుతాయి.

32 సంవత్సరాలలో (1990–2022) తొక్కిసలాటలో జరిగిన మరణాలు, ఇతర గాయాల కారణంగా మరణాలు

వంతెనలు, సొరంగాలు వంటి స్థానిక నిర్మాణాలను భారీ జనసమూహంతో తరచుగా ఉన్నప్పుడు, భయాలు, పుకార్లు  ప్రారంభించినప్పుడు, విషాదం జరుగుతాయి.  సౌదీ అరేబియాలోని మినాలో 2015లో జరిగిన తొక్కిసలాట దీనికి ఉదాహరణ. సాకర్ ఆటలు, పండుగలు, సెలవులు, నైట్ క్లబ్బులు, థియేటర్లు, మతపరమైన ఉత్సవాలు, సరైన భద్రత లేకపోవడం, నియంత్రణ లేకపోవడం, మనుషుల ఆందోళన కారణాలుగా అన్నీ తొక్కిసలాటలకు మూలకారణాలుగా పేర్కొనవచ్చును. యునైటెడ్ స్టేట్స్ లో భద్రతా నిబంధనలు ప్రస్తుతం  ప్రపంచంలోనే కఠినంగా ఉన్నాయి[10][11].

  • 1903 ఇరోక్వోయిస్ థియేటర్ అగ్నిప్రమాదం - యుఎస్ చరిత్రలో అత్యంత ఘోరమైన సింగిల్ బిల్డింగ్ అగ్నిప్రమాదాలలో ఒకటైన ఇరోక్వోయిస్ థియేటర్ అగ్నిప్రమాదం నిర్లక్ష్య అగ్ని రక్షణ, పేలవమైన భద్రతా ప్రమాణాలు, రద్దీ, ఆదిమ అగ్నిమాపక సాంకేతికత  ప్రాణాంతక కలయిక వల్ల సంభవించింది.
  • 1913 ఇటాలియన్ హాల్ విపత్తు - 1913 క్రిస్మస్ రోజున, మిచిగాన్ లోని కాపర్ కంట్రీలో సమ్మె చేస్తున్న గని కార్మికులు, వారి కుటుంబాలు స్థానిక ఇటాలియన్ హాల్ లో యూనియన్ ప్రాయోజిత క్రిస్మస్ వేడుకకు హాజరయ్యారు. ఆ రోజు సాయంత్రం 500 మందికి పైగా హాజరవుతారని భావించిన గని కార్మికుల యూనియన్ వ్యతిరేక వ్యక్తి "ఫైర్!" అని అరవడంతో, మంటలు లేకపోయినా జనం భయాందోళనకు గురై, మొదటి అంతస్తు మెట్ల వైపు పరుగులు తీశారు. జరిగిన తొక్కిసలాటలో 59 మంది చిన్నారులతో సహా మొత్తం 73 మంది మరణించారు
  • 1942 కోకోనట్ గ్రోవ్ అగ్నిప్రమాదం- అలంకరణతో నిండిన నైట్ క్లబ్ లో 1942 నవంబరులో 15 నిమిషాల్లో మంటలు చెలరేగి, కాలిన గాయాలు, ఊపిరాడక, తొక్కివేయడంతో సుమారు 490 మంది మరణించారు.
  • 1943 బెత్నాల్ గ్రీన్ ట్యూబ్ స్టేషన్ విపత్తు - 1943 మార్చి 1 న బెర్లిన్ పై ఒక పెద్ద ఆర్ఎఎఫ్ బాంబు దాడి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ ప్రతీకార చర్యల పుకార్లకు దారితీసింది. ఎక్కువమంది చీకట్లో నేలమీద గుంపులుగా ఇరుక్కుపోయి కింద ఉన్న 170 మందికి పైగా చనిపోయారు. ఈ  విపత్తు జరిగిన డెబ్బై నాలుగు సంవత్సరాల తరువాత, మరణించిన వారి గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు.
  • 1954 కుంభమేళా తొక్కిసలాట- అలహాబాద్ - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి అమావాస్య పండుగ (మౌని అమావాస్య) అలహాబాద్ లో భయంకరమైన తొక్కిసలాట లో  గంగా నదిపై ఉన్న ఒక చిన్న భూభాగంలో ప్రజలు గుమిగూడి ఉన్నారు, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో సుమారు 800 మంది మరణించారు. 2013లో అలహాబాద్ లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు.
  • 1989 హిల్స్ బరో విపత్తు- ఏప్రిల్ 15, 1989న లివర్ పూల్, నాటింగ్ హామ్ ఫారెస్ట్ మధ్య జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ బ్రిటిష్ క్రీడా చరిత్రలో అతిపెద్ద విపత్తుగా మారింది. కేవలం 1,600 మంది సేఫ్టీ కెపాసిటీ ఉన్న స్టాండింగ్ రూమ్ ఓన్లీ ఏరియాలోకి 3,000 మందికి పైగా అభిమానులు తరలిరావడంతో స్టేడియం వెలుపల భారీ జనసందోహం తొక్కిసలాటగా మారింది.
  • 1990 హజ్ తొక్కిసలాట - 1990లో సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో "దెయ్యం రాళ్లతో కొట్టడం" ఆచారం సందర్భంగా భారీగా రద్దీగా ఉండే పాదచారుల సొరంగంలో తొక్కిసలాట జరిగింది. పక్కనే ఉన్న వంతెన కూలిపోవడంతో సొరంగంలోకి వెళ్తున్న జనంలో ఏడుగురు పడిపోయారు. తొక్కిసలాటలో 1,426 మంది యాత్రికులు మరణించారు.
  • 2001 అక్రా స్పోర్ట్స్ స్టేడియం తొక్కిసలాట- ఘనాలోని రెండు అత్యంత ప్రజాదరణ పొందిన సాకర్ జట్లైన అక్రా హార్ట్స్ ఆఫ్ ఓక్ స్పోర్టింగ్ క్లబ్, అసంటే కొటోకో మధ్య జరిగిన మ్యాచ్ విషాదంగా మారింది,  అల్లర్ల నియంత్రణ అధికారులు మైదానంలోకి బాటిళ్లు, రాళ్లను విసురుతున్న భారీ గుంపుపై బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో తొక్కిసలాట జరిగి 127 మంది అభిమానులు చనిపోయారు. ఆఫ్రికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన స్టేడియం విపత్తుల్లో ఇదొకటి.
  • 2003 స్టేషన్ నైట్ క్లబ్ అగ్నిప్రమాదం - హెవీ మెటల్ బ్యాండ్ గ్రేట్ వైట్ ఫిబ్రవరి 2003 క్లబ్ ప్రదర్శన రోడ్ ఐలాండ్ లోని వెస్ట్ వార్విక్ లోని స్టేషన్ నైట్ క్లబ్ పైకప్పుపై అక్రమ పైరోటెక్నిక్స్ ధ్వని ఇన్సులేషన్ నురగను కాల్చడంతో తొక్కిసలాటగా మారింది. ఐదు నిమిషాల్లో క్లబ్ గుండా మంటలు వ్యాపించాయి, ప్రేక్షకులు (సామర్థ్యానికి మించి) ముందు ద్వారం వైపు దూసుకొచ్చారు. తొక్కిసలాట, మంటలు, పొగ పీల్చడంతో 100 మంది మృతి చెందగా, 200 మంది గాయపడ్డారు.
  • 2004 జమారత్ బ్రిడ్జి తొక్కిసలాట- 2004లో జమారత్ బ్రిడ్జిపై మరో 'దెయ్యం రాళ్లదాడి' తొక్కిసలాట జరిగి 250 మంది యాత్రికులు మరణించారు. ఈ ఘటన తర్వాత బ్రిడ్జి డిజైన్లో పలు భద్రతా చర్యలు చేపట్టారు. 2006లో మరో తొక్కిసలాట జరిగి 380 మంది చనిపోయారు.
  • 2005 బాగ్దాద్ వంతెన తొక్కిసలాట -ఆగస్టు 31, 2005 న, ఉత్తర బాగ్దాద్ లో ఉన్న ఒక పుణ్యక్షేత్రం వైపు సుమారు పది లక్షల మంది యాత్రికులు ఉన్నారు . జనం టైగ్రిస్ నదిపై ఉన్న వంతెనను దాటాల్సి వచ్చింది. ఆ రోజు మోర్టార్ దాడి జరగడంతో అప్పటికే జనసమూహం ఉద్రిక్తంగా ఉంది, మూతపడిన వంతెన వైపు వేలాది మంది పరుగులు తీయడంతో భారీ ప్రమాదం సంభవించింది. ప్రజలు వంతెనకు ఇరువైపులా నలిగిపోయారు, నదిలో పడిపోయారు. మొత్తంగా 965 మంది నీటమునిగి చనిపోయారు.
  • 2010 ప్నోమ్ పెన్హ్ తొక్కిసలాట -2010లో కంబోడియాలోని ప్నోమ్ పెన్ లో బోన్ ఓం టౌక్ గా పిలిచే మూడు రోజుల వాటర్ ఫెస్టివల్ సందర్భంగా (వంతెన కూలిపోబోతోందన్న వార్త జనంలో వ్యాపించడంతో జరిగిన తొక్కిసలాటలో 340 మందికి పైగా మరణించారు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
  • 2015 మినా తొక్కిసలాట - 2015 సెప్టెంబరు 24న హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 760 మందికి పైగా ముస్లిం యాత్రికులు మరణించారు. మక్కాకు కేవలం మూడు మైళ్ల దూరంలో ఉన్న మినా లోయలో రెండు మిలియన్ల మంది యాత్రికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మినా జమారత్ ప్రదేశం, ఇక్కడ నాలుగు-అంతస్తుల పాదచారుల వంతెనలో స్తంభాలను ఏర్పాటు చేస్తారు, యాత్రికులు దెయ్యాన్ని  గులకరాళ్ళతో స్తంభాలను కొట్టడం జరుగుతుంది

మూలాలు[మార్చు]

  1. "human stampede". TheFreeDictionary.com. Retrieved 2023-02-06.
  2. "Definition of stampede | Dictionary.com". www.dictionary.com. Retrieved 2023-02-06.
  3. Nomads, World. "How to Survive a Stampede". www.worldnomads.com. Retrieved 2023-02-06.
  4. "Texas A&M student hurt at Astroworld dies; death toll at 9". www.yahoo.com. Retrieved 2023-02-07.
  5. Bursztynsky, Jessica. "Officials confirm eight people, including two teens, are among the dead after Houston music festival stampede". CNBC. Retrieved 2023-02-07.
  6. Yeung, Sophie Jeong,Gawon Bae,Paula Hancocks,Hilary Whiteman,Jessie (2022-10-30). "What we know about the deadly Halloween disaster in Seoul". CNN. Retrieved 2023-02-07.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  7. Varma, P. Sujatha (2022-12-29). "Eight die in stampede at Chandrababu Naidu's public meeting". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-02-07.
  8. Varma, P. Sujatha (2022-12-29). "Eight die in stampede at Chandrababu Naidu's public meeting". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-02-07.
  9. "Tamil Nadu: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళల మృతి". EENADU. Retrieved 2023-02-07.
  10. "The Worst Human Stampedes". Ranker (in ఇంగ్లీష్). Retrieved 2023-02-06.
  11. "Timeline: Deadliest stampedes". BBC News. 2010-11-23. Retrieved 2023-02-06.