దిలీప్ కొణతం
దిలీప్ కొణతం | |
---|---|
జననం | సెప్టెంబర్ 22 మోత్కూర్ యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ప్రసిద్ధి | రచయిత, సాంకేతిక నిపుణుడు |
మతం | హిందూ |
భాగస్వాములు | స్వర్ణ కిలారి |
పిల్లలు | అర్ణవ్ |
తండ్రి | బక్కారెడ్డి |
తల్లి | అరుణ |
దిలీప్ కొణతం, (ఆంగ్లం:Dileep Konatham) తెలంగాణకు చెందిన రచయిత, సాంకేతిక నిపుణుడు.[1] ఇంగ్లీషులో బహుళ ప్రజాదరణ పొందిన "కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్" అనే ఆంగ్ల పుస్తకాన్ని ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరిట తెలుగులోకి అనువదించి తెలుగు పుస్తక ప్రపంచంలో సంచలనం సృష్టించిన దిలీప్, తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[2][3]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]దిలీప్ స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లాలోని మోత్కూర్. ఆయన సెప్టెంబరు 22న భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) నాయకుడు కొణతం బక్కారెడ్డి,[4][5] అరుణ దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన దిలీప్, వివేకవర్ధిని డిగ్రీ కళాశాల నుండి బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయము అనుబంధ కళాశాల వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.
వివాహం - ఉద్యోగం
[మార్చు]2000, ఏప్రిల్ 19న స్వర్ణ కిలారి[6]తో దిలీప్ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (అర్ణవ్)
తెలంగాణ ఉద్యమంలో
[మార్చు]తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, ఉద్యమ లక్ష్యాలనూ సామాజిక మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయడంతోపాటూ, తెలంగాణ వ్యతిరేక శక్తుల పన్నాగాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమం వేదికల్లో తిప్పికొట్టేవాడు. మిషన్ తెలంగాణ అనే వెబ్ పోర్టల్ స్థాపించి ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమం విశేషాలు ప్రపంచవ్యాప్తంగా చేరవేశాడు. గూగుల్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం నిరంతరం శ్రమించాడు.[7]
డిజిటల్ మీడియా డైరెక్టర్ గా
[మార్చు]సామాజిక మాధ్యమం వేదికగా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన దిలీప్ కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, దిలీప్ ను తెలంగాణ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్ గా నియమించాడు. 2014 నుండి 2023, డిసెంబరు వరకు డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిన దిలీప్, తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ రూపొందించిన పలు కార్యక్రమాలలో కీలకపాత్ర పోషించాడు.
రచనలు
[మార్చు]- ఒక దళారీ పశ్చాత్తాపం (అనువాదం)[8][9]
- కుట్రాజకీయం (అనువాదం)
- జంగల్ నామా (అనువాదం)
- ఏ రిబట్టల్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగాండా
- ఫ్యూచర్ ఫర్ఫెక్ట్ కేటీఆర్[10][11][12]
- 13 (థాయ్‌లాండ్ బాలల ఫుట్ బాల్ టీ రెస్క్యూ ఆపరేషన్ కథ) 2024, ఫిబ్రవరి 15
అవార్డులు
[మార్చు]- కొణతం దిలీప్ 2020 ఫిబ్రవరి 23న కోవిడ్–19 సమయంలో కమ్యూనికేషన్ ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్ మీడియా వింగ్‌కు ‘పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ)–2020’ అవార్డును అందుకున్నాడు.[13]
- గోవాలో 2021 సెప్టెంబర్ 17న జరిగిన 15వ పీఆర్‌సీఐ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డిజిటల్ మీడియా శాఖ పనితీరును గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ‘పీఆర్‌సీఐ చాణక్య’ అవార్డును అందుకున్నాడు.[14][15][16]
- న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్ 21న జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్‌లో మాజీ కేంద్రమంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా ‘సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నాడు.[17][18]
మూలాలు
[మార్చు]- ↑ "సాంకేతిక సారథి.. అనువాద వారధి". EENADU. 2024-01-28. Archived from the original on 2024-01-28. Retrieved 2024-01-28.
- ↑ TelanganaToday (21 June 2017). "Public Libraries in Telangana to go digital". Archived from the original on 22 September 2018. Retrieved 22 September 2018.
- ↑ TelanganaToday (4 October 2017). "Telangana to link libraries with fibre optic lines: Dileep Konatham". Archived from the original on 22 September 2018. Retrieved 22 September 2018.
- ↑ విశాలాంధ్ర, నల్లగొండ (10 May 2019). "ఉద్యమమే ఊపిరిగా..." Archived from the original on 19 May 2019. Retrieved 19 May 2019.
- ↑ విశాలాంధ్ర, నల్లగొండ రూరల్/భువనగిరి (18 May 2010). "బక్కారెడ్డి మృతికి సిపిఐ సంతాపం". Archived from the original on 19 May 2019. Retrieved 19 May 2019.
- ↑ నవ తెలంగాణ, స్టోరి (6 October 2019). "ఏడేండ్ల జీవితానికి స్వర్ణాక్షర నివాళి". NavaTelangana. కవిత కట్టా. Archived from the original on 6 October 2019. Retrieved 6 October 2019.
- ↑ The Pynr, Dil Se (18 July 2021). "Dil Se : Dileep Konatham - Passionate Telanganaite" (in ఇంగ్లీష్). Yalala Sridhar. Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ https://dalaari.wordpress.com/2007/06/23/dalari-reviews1/ఒక[permanent dead link] దళారీ పశ్చాత్తాపం – సమీక్షలు – ఒకటవ భాగం
- ↑ https://dalaari.wordpress.com/page/2/ఒక[permanent dead link] దళారీ పశ్చాత్తాపం – సమీక్షలు – రెండవ భాగం
- ↑ TelanganaToday (24 July 2017). "KTR did not achieve success overnight, he was made to work hard". Archived from the original on 22 September 2018. Retrieved 22 September 2018.
- ↑ నమస్తే తెలంగాణ (25 July 2017). "భిన్న వ్యక్తిత్వం కేటీఆర్ సొంతం". Archived from the original on 22 September 2018. Retrieved 22 September 2018.
- ↑ Namasthe Telangana (23 July 2021). "అందరివాడు ఆధునికుడు". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
- ↑ Sakshi Education (20 March 2021). "ఫిబ్రవరి 2021 అవార్డ్స్". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
- ↑ Namasthe Telangana (18 September 2021). "రెండోసారి చాణక్య అవార్డు గెలుచుకున్న కొణతం దిలీప్". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
- ↑ The New Indian Express (19 September 2021). "Telangana government's digital media chief bags Chanakya Award for the second time". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
- ↑ Andrajyothy (19 September 2021). "డిజిటల్ మీడియా డైరెక్టర్‌కు చాణక్య అవార్డు". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
- ↑ Bureau, The Hindu (2023-09-23). "Digital Media team of Telangana wins big at PRSI national awards". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2023-09-23. Retrieved 2023-09-23.
- ↑ "Public Relations Council of India Excellence Awards 2023 : తెలంగాణ డిజిటల్ మీడియా విభాగానికి 5 ప్రతిష్ఠాత్మక అవార్డులు". ETV Bharat News. 2023-09-22. Archived from the original on 2023-09-23. Retrieved 2023-09-23.