దీపికా చిఖ్లియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపికా చిఖ్లియా
లోక్‌సభ సభ్యురాలు
In office
1991–1996
అంతకు ముందు వారుప్రకాష్ బ్రహ్మభట్
తరువాత వారుసత్యజిత్‌సింగ్ గైక్వాడ్
నియోజకవర్గంబరోడా
వ్యక్తిగత వివరాలు
జననం
దీప్తి చిఖ్లియా

ముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిహేమంత్ టోపివాలా
వృత్తినటి, రాజకీయ నాయకురాలు

దీపికా చిఖ్లియా టోపివాలా, మహరాష్ట్రకు చెందిన టీవి సినిమా నటి, రాజకీయ నాయకురాలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ సినిమాలలో నటించిన దీపిక, రామానంద్ సాగర్ రూపొందించిన టివి సీరియల్ రామాయణం[1]లో సీత పాత్రలో నటించి గుర్తింపు పొందింది. తెలుగులో 1989లో వచ్చిన యమపాశం, 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలలో నటించింది. 1991లో భారతీయ జనతా పార్టీ తరపున బరోడా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలు ఎన్నికయింది.

జననం[మార్చు]

దీపికా మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

1983లో వచ్చిన సన్ మేరీ లైలా సినిమాలో తొలిసారిగా నటించిన దీపికా, రాజేష్ ఖన్నాతో రూపాయే దస్ కరోడ్, ఘర్ కా చిరాగ్, ఖుదాయి అనే మూడు హిందీ సినిమాలలో నటించింది.[2] మలయాళంలో మమ్ముట్టితో 1986లో ఇతిలే ఇనియుమ్ వరు సినిమా, కన్నడంలో శంకర్ నాగ్‌తో 1990లో హోస జీవన సినిమా, 1989లో అంబరీష్‌తో ఇంద్రజిత్ సినిమా, తమిళంలో ప్రభుతో 1992లో నంగల్ సినిమా, బెంగాలీ'లో ప్రోసెంజిత్ ఛటర్జీతో 1989లో ఆశా ఓ భలోబాషా సినిమాలో నటించింది.

2019 నవంబరులో వచ్చిన బాలా సినిమాలో పారి (యామీ గౌతమ్) తల్లిగా నటించింది.[3] స్వాతంత్ర్య సమరయోధురాలు - సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటిస్తోంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శింగార్ బిందీ, టిప్స్ అండ్ టోస్ కాస్మెటిక్స్ యజమాని హేమంత్ టోపివాలా[4]తో దీపిక వివాహం జరిగింది.[5] వారికి ఇద్దరు కుమార్తెలు నిధి టోపీవాలా, జుహీ టోపీవాలా ఉన్నారు.[6]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా భాష పాత్ర ఇతర వివరాలు
1983 సన్ మేరీ లైలా హిందీ
1985 పత్తర్ హిందీ
1986 చెంప హిందీ
1986 భగవాన్ దాదా హిందీ శాంతి
1986 ఘర్ సన్సార్ హిందీ
1986 ఇథిలే ఇనియుం వారు మలయాళం ప్రియా
1987 రాత్ కే అంధేరే మే హిందీ సెక్సీ రోజీ
1987 సజన్వా బైరి భైలే హమార్ భోజ్‌పురి
1989 ఇంద్రజిత్ కన్నడ ఉష
1989 ఘర్ కా చిరాగ్ హిందీ ఆశా
1989 ఆశా ఓ భలోబాషా బెంగాలీ రూపా
1989 యమపాశం తెలుగు
1990 హోస జీవన కన్నడ శంకర్‌నాగ్ భార్యగా సీత
1990 పెరియ ఇదాతు పిళ్లై తమిళం
1991 కాల చక్ర కన్నడ
1991 బ్రహ్మర్షి విశ్వామిత్ర తెలుగు
1991 రూపాయే దస్ కరోడ్ హిందీ రవి కార్యదర్శి/హస్తినాపూర్ కి రాణి
1992 నాంగల్ తమిళం
1994 మేయర్ ప్రభాకర్ కన్నడ
1994 ఖుదాయి హిందీ పద్మిని రాజ్ ఆనంద్
1989 జోడే రహేజో రాజ్ గుజరాతీ
1992 లాజు లఖన్ గుజరాతీ
2018 గాలిబ్ హిందీ
2018 నటసామ్రాట్ గుజరాతీ
2019 బాలా హిందీ సుశీల మిశ్రా (పరి తల్లి)

మూలాలు[మార్చు]

  1. "Archived copy". Archived from the original on 15 September 2009. Retrieved 2022-03-12.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Ramayan's Sita aka Dipika Chikhalia's real life wedding was attended by this Bollywood superstar; see pic - Times of India".
  3. "'Bala': A cracker of a film, powered by 'hair' apparent Ayushmann Khurrana". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-12.
  4. "Deepika Chikhalia". khabridost.in. Archived from the original on 13 March 2018. Retrieved 2022-03-12.
  5. "Hemant Topiwala: Executive Profile & Biography - Bloomberg". www.bloomberg.com. Retrieved 2022-03-12.
  6. "Where are they now? Deepika Chikhalia". Retrieved 2022-03-12.

బయటి లింకులు[మార్చు]