దొడ్డ గణేష్

వికీపీడియా నుండి

1973, జూన్ 30న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించిన దొడ్డగణేష్ (Doddanarasiah Ganesh) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు జట్టు తరఫున 1997లో 4 టెస్టులు మరియు ఒక వన్డేలో ప్రాతినిధ్యం వహించాడు. 4 టెస్టులు ఆడిననూ తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 4 వికెట్లు మాత్రమే సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కర్ణాటక తరఫున 104 మ్యాచ్‌లు ఆడి 365 వికెట్లు సాధించాడు.

[మార్చు] టెస్ట్ గణాంకాలు

గణేష్ 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 57.39 సగటుతో 5 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 6.25 సగటుతో 25 పరుగులు చేశాడు. టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 28 పరుగులకు 2 వికెట్లు కాగా అత్యధిక వ్యక్తిగత స్కోరు 8 పరుగులు.

[మార్చు] వన్డే గణాంకాలు

దొడ్డ గణేష్ ఒకే ఒక్క వన్డే ఆడి 30 బంతులు బౌలింగ్ చేసి 20 పరుగులకు ఒక్క వికెట్టు సాధించాడు. ఆ వన్డేలో బ్యాటింగ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక టెస్టు మరియు వన్డే గణాంకాలు సరిగా లేనందున అతనికి మళ్ళీ జట్టులో స్థానం లభించలేదు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు