నీతి నిజాయితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీతి నిజాయితి
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం సతీష్ ఆరోరా
కాంచన
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ సంజీవి మూవీస్
భాష తెలుగు

నీతి నిజాయితి సినిమా 1972లో విడుదలైన సాంఘిక చిత్రం. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. చిత్రంలో ప్రధానపాత్రలను సతీష్ ఆరోరా, కాంచన , గుమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు పోషించారు.[1]

సినిమా నేపథ్యం[మార్చు]

ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద దర్శకత్వశాఖలో సింగీతం శ్రీనివాసరావు చాన్నాళ్ళు పనిచేశారు. బళ్ళారికి చెందిన పారిశ్రామికవేత్తలు హెచ్.వి.సంజీవరెడ్డి, ఎం.లక్ష్మీకాంతరెడ్డి సింగీతం శ్రీనివాసరావును కలిసి సింగీతం దర్శకత్వంలో, కె.వి.రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సినిమా నిర్మిస్తామని అవకాశం ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని కె.వి.రెడ్డికి చెప్పిచూడమని సింగీతం వారికి చెప్పారు. అప్పటికే సినిమాల్లో పరాజయాల పాలై సినిమా అవకాశాలు లేని స్థితిలో ఉన్న కె.వి.రెడ్డి, వారితో మీ రెండవ సినిమా సింగీతంతో చేద్దురుగాని, మొదటి సినిమా నన్ను దర్శకునిగా పెట్టుకుని తీయమన్నారు. పరాజయాల్లో ఉన్న దర్శకుడు కావడంతో కె.వి.రెడ్డికి దర్శకత్వం ఇవ్వలేక వారు ఆ సినిమా సంగతి వదిలేశారు.
కె.వి.రెడ్డి స్థితి చూసి ఎన్.టి.రామారావు తన స్వంత పతాకంపై నిర్మిస్తున్న శ్రీకృష్ణసత్య సినిమాకు కె.వి.రెడ్డిని దర్శకునిగా పెట్టుకున్నారు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు కదా మరి మీరూ మా సినిమా చేసిపెట్టండి అంటూ సంజీవరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి మళ్ళీ సింగీతం శ్రీనివాసరావును సంప్రదించారు. దాంతో సినిమా ప్రారంభమైంది.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాతలు: ఎం.లక్ష్మీకాంతం రెడ్డి, హెచ్.వి.సంజీవి రెడ్డి
  • స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
  • ఛాయాగ్రహణం: కమల్ ఘోష్
  • కూర్పు: డి.వాసు
  • సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
  • పాటలు: పింగళి నాగేంద్రరావు, శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్యచౌదరి
  • మాటలు: పింగళి నాగేంద్రరావు
  • కళ: తోట వెంకటేశ్వరరావు
  • నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి, కె.బి.కె.మోహనరాజు, ఎల్.ఆర్.ఈశ్వరి

విడుదల[మార్చు]

నీతి నిజాయితీ సినిమా 1972 ఆగస్టు 11వ తేదీన విడుదలైంది. సినిమా పాటలు విజయవంతమయ్యాయి. అయితే సినిమా పరాజయం పాలైంది.[2]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
పట్నం వదలాలి ఈ పట్నం వదలాలి పల్లెకు కదలాలి[3] శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

భలే మజాలే ! భలే భలే కుషిలే , ఘంటసాల, బాలు, రచన: పింగళి నాగేంద్ర రావు

మూలాలు[మార్చు]

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2009/06/1972_06.html?m=1
  2. 2.0 2.1 ఎం.బి.ఎస్., ప్రసాద్. "రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 July 2015.
  3. సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007

బయటిలింకులు[మార్చు]