నేరెళ్ళ వేణుమాధవ్

వికీపీడియా నుండి

నేరెళ్ళ వేణుమాధవ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. ఈయనకి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు. ఇతను 1932 డిసెంబరు 28న వరంగల్ జిల్లాలో జన్మించాడు. [1].తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు. ముఖ్యంగా ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు. ధ్వన్యనుకరణకు ఇతని వలన తెలుగునాట విశిష్టమైన ప్రాచుర్యం లభించింది. 2001లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 1981లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి లభించింది. ఇతని శిష్యులలో ప్రసిద్ధుడైన మరొక మిమిక్రీ కళాకారుడు హరికిషన్

మూలాల జాబితా [మార్చు]

బయటి లింకులు [మార్చు]