నేరేడు

వికీపీడియా నుండి
నేరేడు (గిన్నె చెట్టు)
Jambul (Syzygium cumini)
Jambul (Syzygium cumini)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: మిర్టేలిస్
కుటుంబము: మిర్టేసి
ప్రజాతి: షైజీజియం
జాతి: షై. క్యుమిని
ద్వినామము
షైజీజియం క్యుమిని
(లి.) Skeels.

నేరేడు (లేదా గిన్నె చెట్టు) (Jamun) ఒక పెద్ద వృక్షం. దీనిని పండ్లు కోసం పెంచుతారు. నేరేడు శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. భారతదేశం, పాకిస్థాన్, మరియు ఇండోనేషియా లో ప్రధానంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఫిలిప్పైన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినపుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్ కు తీసుకుని వెళ్ళారు. అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం. ఉంది. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు.

[మార్చు] మత విశ్వాసం

బెంగళూరు మార్కెట్ లో నేరేడుపళ్ళు

రామాయణం లో శ్రీరాముడు పద్నాలుగేళ్ళు వనవాసం చేసినపుడు, ఎక్కువ భాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. అందుకనే భారతదేశంలోని గుజరాత్ మరియు వివిధ ప్రాంతాల్లో దీనిని దేవతా ఫలంగా భావిస్తారు.

[మార్చు] ఉపయోగాలు

హైదరాబాద్ వివేకానంద నగర్ కాలనీ పార్క్ లో గిన్నె చెట్టు
  • నేరేడు పండ్లు గుజురుతో కసగా ఉండి తియగా ఉంటాయి. వీనితో పచ్చళ్ళు, జామ్ లు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు.
  • నేరేడు కలపను వ్యవసాయ పనిముట్లు, దూలాలు తయారుచేయుటకు వాడతారు.
  • చెట్టు బెరడులో మరియు విత్తనాలలో 13- 19 % వరకు టానిన్లు ఉంటాయి.
  • విత్తనం నుండి తీసిన రసం అధిక రక్తపోటును నయం చేస్తుంది. ఇవి కొంతవరకు మధుమేహంలో కూడా పనిచేస్తాయి[1].

[మార్చు] మూలాలు

  1. [1] Article in The Hindu, retrieved June 23 2007
"http://te.wikipedia.org/w/index.php?title=నేరేడు&oldid=684121" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు