నేలవేము

వికీపీడియా నుండి
నేలవేము
Andrographis paniculata (Kalpa) in Narshapur forest, AP W2 IMG 0867.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: Lamiales
కుటుంబము: అకాంథేసి
ప్రజాతి: Andrographis
జాతి: A. paniculata
ద్వినామము
Andrographis paniculata
(Burm.f.) Wall. ex Nees

నేలవేము ఒకరకమైన ఔషధ మొక్క.

దీనిని ఇంటి వద్ద కుండీలలో పెంచుకోవచ్చును. ఇది వేప కన్నా చేదుగా ఉంటుంది. కాండంలోను, ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

[మార్చు] నేలవేము ఇంట్లో పెంచే విధానం

కుండీలో విత్తనాలు చల్లుకోవాలి. 8 రోజులకు మొక్క మొలుస్తుంది. కుండీకి రెండు మొక్కలు ఉంచితే చాలు. జూన్‌లో విత్తుకోవచ్చు.

ఇది వంద సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. పిలకలు కత్తిరిస్తుంటే గుమ్మటంలా పెరుగుతుంది.

సెప్టెంబర్ నాటికి పూత వస్తుంది. ఆ సమయంలో మొక్కను కత్తిరించి నీడన ఆరబెట్టి భద్రపరచుకోవచ్చు. 10-15 సెంటీమీటర్ల ఎత్తున మొక్కను కత్తిరిస్తే.. మళ్లీ చిగుళ్లు వస్తాయి. 60 రోజుల్లో రెండోసారి కోసుకోవచ్చు.

చూర్ణం చేసి దాచుకోవచ్చు. తులసి మాదిరిగానే.. దీన్ని రోజూ రెండు పచ్చి ఆకులు లేదా కాండం, ఆకుల పొడి లేదా వాటి కషాయం ఎలా వీలైతే అలా వాడొచ్చు.

[మార్చు] ఉపయోగాలు

చక్కెర వ్యాధిని అరికడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది. వైరల్ / విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా / విష జ్వరాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది. ఈ ఆకుల చేదు తెలిసే అంతవరకూ తినిపిస్తుండాలి.

ఔషధం వాడే మోతాదు 
  • 1. జ్వరాలు - 1 నుంచి 2 చెంచాల (టేబుల్ స్పూన్ల) చూర్ణం / అర ఔన్సు కషాయం
  • 2. కామెర్లు - 1 నుంచి 2 చెంచాల చూర్ణం / అర ఔన్సు కషాయం
  • 3. మధుమేహం - 1 నుంచి 2 చెంచాల చూర్ణం
  • 4. చర్మ వ్యాధులు - 1 చెంచా చూర్ణం
  • 5. కాలేయ వ్యాధులు - 1 చెంచా చూర్ణం

[మార్చు] వెలుపలి లింకులు

Wiktionary-logo-en.png
నేలవేము గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
"http://te.wikipedia.org/w/index.php?title=నేలవేము&oldid=706113" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు