కాండం

వికీపీడియా నుండి

మొక్కలో వాయుగతంగా పెరిగే వ్యవస్థను 'ప్రకాండ వ్యవస్థ' (Shoot system) అంటారు. ఇది ప్రధమాక్షం (Plumule) నుంచి ఉద్భవిస్తుంది. ప్రకాండ వ్యవస్థ అక్షాన్ని 'కాండం' (ఆంగ్లం: Stem) అంటారు. పత్రాలు, మొగ్గలు, పుష్పాలు వంటి ఉపాంగాలు కాండం మీద లేదా శాఖల మీద ఉద్భవిస్తాయి.

విషయ సూచిక

[మార్చు] లక్షణాలు

  • కాండం ప్రకాండవ్యవస్థలో నిటారుగా పెరిగే అక్షం.
  • కాండం చివరలో ఉండే కొన మొగ్గ (terminal bud) కాండం నిలువు పెరుగుదలను నియంత్రిస్తుంది.
  • కాండం కణుపులు (nodes), కణుపుమధ్యమాలు (internodes) గా విభేదన చెంది ఉంటుంది.
  • కాండం మీద పత్రాలు కణుపుల నుంచి ఏర్పడతాయి. పత్రానికి, కాండానికి మధ్య ఉండే పై కోణాన్ని గ్రీవం (Axil) అంటారు. గ్రీవంలో ఏర్పడే గ్రీవపు మొగ్గలు శాఖలను ఉత్పత్తి చేస్తాయి.
  • సాధారణంగా లేత కాండం ఆకుపచ్చగాను, ముదిరిన కాండం గోధుమవర్ణంలోను ఉంటాయి.

[మార్చు] విధులు

  • కాండం పత్రాలన్నింటికి సూర్యరశ్మి తగిలేటట్లుగా విస్తరింపచేయడంలో సహాయపడుతుంది.
  • పేళ్ళు భూమినుంచి గ్రహించిన నీటిని, లవణాలను పత్రాలకు అందజేయడం, పత్రాలలో తయారైన ఆహారపదార్ధాలను మొక్కలోని ఇతర భాగాలకు అందించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

[మార్చు] కాండం రూపాంతరాలు

కాండం వాతావరణానికి అనుగుణంగా సాధారణ విధులతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది. ఇలాంటి శాశ్వతమార్పులను 'కాండ రూపాంతరాలు' అంటారు. ఉనికిని బట్టి కాండం రూపాంతరాలు మూడు రకాలు.

[మార్చు] వాయుగత కాండ రూపాంతరాలు

[మార్చు] ఉపవాయుగత కాండ రూపాంతరాలు

  • రన్నర్లు (Runners)
  • స్టోలన్లు (Stolons)
  • పిలకమొక్కలు (Suckers)
  • ఆఫ్ సెట్లు (Offsets)

[మార్చు] భూగర్భ కాండ రూపాంతరాలు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%82" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు