కందం

వికీపీడియా నుండి
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

విషయ సూచిక

[మార్చు] కందం

తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.

[మార్చు] ఉదాహరణ 1

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

[మార్చు] లక్షణములు

>open

క.

కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్

బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.

</open

  • పాదాలు: 4
  • కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, , , , నల ఇవీ ఆ గణాలు
  • 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
  • 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
  • 1,3 పాదాలలో 1,3 గణాలు గణం కారాదు
  • 2,4 పాదాలలో 2,4 గణాలు గణం కారాదు
  • 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) కాని, నల కానీ అయి ఉండాలి
  • 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా అయి ఉండాలి
  • పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
యతి
2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
ప్రాస
ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు

[మార్చు] ఉదాహరణ 2

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

పై పద్యానికి గణములు లెక్కిస్తే

భ గణము భ గణము భ గణము

గగ గణము గగ గణము జ గణము నల గణము స గణము

గగ గణము గగ గణము గగ గణము

గగ గణము స గణము నల గణము స గణము గగ గణము

భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }

గగ గణము = UU { గురువు, గురువు }

జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }

నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }

స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}

"http://te.wikipedia.org/w/index.php?title=కందం&oldid=440165" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె