తరలము

వికీపీడియా నుండి
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

విషయ సూచిక

[మార్చు] తరలము

[మార్చు] ఉదాహరణ 1

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ

శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో

దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో

ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్

[మార్చు] లక్షణములు

  • పాదాలు : నాలుగు
  • ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
  • యతి : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
  • ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

[మార్చు] నడక

  • మతత కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
  • తనన తానన తాన తానన తాన తానన తాన తా

[మార్చు] ఉదాహరణ 2

క్రతుశతంబుల బూర్ణకుకుక్షివి కాని, నీవిటు క్రేపులున్

సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక

స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా

సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!

పోతన భాగవతము - 10 - 569

[మార్చు] గ్రహించగలరు

  • ఇది మత్తకోకిలకి జంట వృత్తము
  • మత్తకోకిలలో ని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది.
"http://te.wikipedia.org/w/index.php?title=తరలము&oldid=369338" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె