తేటగీతి
వికీపీడియా నుండి
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
విషయ సూచిక |
[మార్చు] తేటగీతి
[మార్చు] ఉదాహరణ 1:
విని దశగ్రీవు డంగజ వివశు డగుచు
నర్థి బంచిన బసిడిఱ్రి యై నటించు
నీచు మారీచు రాముడు నెఱి వధించె
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు
[మార్చు] లక్షణాలు
ఆ.
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి"
- అప్పకవీయము
- పాదాలు: 4
- ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి
[మార్చు] యతి
- నాల్గవ గణంలో మొదటి అక్షరం యతి
- ప్రాసయతి చెల్లును
- ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కర గా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
[మార్చు] ప్రాస
- ప్రాస నియమం లేదు
[మార్చు] ఉదాహరణ 2:
అఖిలరూపముల్ దనరూపమైన వాడు
నాదిమధ్యాంతములు లేక యడరువాడు
భక్తజనముల దీనుల పాలివాడు
వినడె చూడడె తలపడె వేగ రాడె;