అల్లం

వికీపీడియా నుండి


అల్లం
భద్రంగా ఉన్నది
Zingiber officinale - Köhler–s Medizinal-Pflanzen-146.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: పుష్పించే మొక్కలు(Magnoliophyta)
తరగతి: ఏకదళబీజాలు(Liliopsida)
వర్గము: జింజిబరేలిస్
కుటుంబము: జింజిబరేసి
ప్రజాతి: జింజిబర్
జాతి: Z. officinale
ద్వినామము
Zingiber officinale
Roscoe

అల్లం ఒక చిన్న మొక్క.ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్థావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు.

విషయ సూచిక

[మార్చు] లక్షణాలు

220

  • కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము.
  • దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు.
  • కంకి పుష్పవిన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు.

[మార్చు] శొంఠి

ఏండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.

  • మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
  • బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
  • పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు.
  • ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.

[మార్చు] ఔషధముగా

ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.

[మార్చు] ఉత్పత్తి

[మార్చు] కొన్ని విశేషాలు

[మార్చు] వెలుపలి లింకులు

Wiktionary-logo-en.png
అల్లం గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=అల్లం&oldid=710884" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు