Coordinates: 6°52′36″N 81°03′42″E / 6.876709°N 81.061622°E / 6.876709; 81.061622

నైన్ ఆర్చ్ వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నైన్ ఆర్చ్ వంతెన 
నైన్ ఆర్చ్ వంతెన 
దేమోదరలోని నైన్ ఆర్చ్ వంతెన 
Coordinates6°52′36″N 81°03′42″E / 6.876709°N 81.061622°E / 6.876709; 81.061622
OS grid reference[1]
Characteristics
Materialరాళ్లు, ఇటుకలు, సిమెంట్
Total length300 అడుగులు (91.44మీ)[1]
Width25 అడుగులు (7.62మీ)
Height80 అడుగులు (24.38మీ)
No. of spans9
History
Construction end1921[2]
Location
పటం

నైన్ ఆర్చ్ వంతెన దీనిని బ్రిడ్జ్ ఇన్ ది స్కై అని కూడా పిలుస్తారు.[3] ఇది శ్రీలంకలో ఉన్న వయాడక్ట్ వంతెన (పొడవైన వంతెన లాంటి నిర్మాణం, సాధారణంగా వంపుల శ్రేణి, ఒక లోయ లేదా ఇతర లోతట్టు ప్రాంతాల మీదుగా రోడ్డు లేదా రైలుమార్గాన్ని కలుపుతుంది), ఇది బ్రిటిష్ కాలం నాటిది. సముద్ర మట్టానికి 3100మీ ఎత్తులో, సెంట్రల్ హైలాండ్స్ క్రాగీ కొండలలో నిర్మించబడింది. ఇది ఎల్లా, దేమోదర రైల్వే స్టేషన్ల మధ్య దేమోదరలో ఉంది. ఇది ఒక్క ఉక్కు ముక్క లేకుండా పూర్తిగా ఇటుక, రాతి, సిమెంటుతో నిర్మించబడింది. ఈ వంతెన 1921 నుండి ఇప్పటి వరకు పటిష్టంగా ఉంది.

చరిత్ర[మార్చు]

మెలిమడలోని కప్పటిపోల ప్రాంతంలో 1870లో జన్మించిన పి.కె.అప్పుహామి అనే ప్రసిద్ధ కర్మ నృత్య కారుడు (డ్రమ్మర్, డెవిల్ డ్యాన్సర్) ఒకరోజు అతను పోటీలో ఓడిపోవడంతో దిగులుగా ఇంటికి తిరిగి వస్తుండగా, అప్పుహామిని ఒక బ్రిటిష్ అధికారి చూశాడు. ఆ సమయంలో అక్కడ రైల్వే లైను నిర్మాణం జరుగుతోంది, అతనిని ఆ వేషధారణలో చూసిన బ్రిటీష్ అధికారి మొదట భయపడ్డాడు. కానీ తరువాత వారి మధ్య స్నేహ సంబంధం ఏర్పడింది. బ్రిటీష్ అధికారి ఆ ప్రాంతంలో రైలుమార్గాన్ని నిర్మిస్తున్నాడని తెలుసుకొని బ్రిటీష్ వారికి కార్మికులను సరఫరా చేస్తాడు. రెండు కొండల మధ్య నిర్మాణం చేస్తున్నప్పుడు, దిగువన ఉన్న గుంతలలో బ్రిటిష్ ఇంజనీర్లకు పిల్లర్లను కట్టడం సమస్యగా మారి నిర్మాణాన్ని నిలిపివేశారు.[4] అప్పుడు అప్పుహామి ఈ భారీ వంతెన నిర్మాణాన్ని తనకు అప్పగించాలని అభ్యర్థించాడు. మొదటి సారి వారు తిరస్కరించారు, కానీ వారు చివరకు ఈ పనిని అప్పుహామికి అప్పగించడానికి అంగీకరించారు. అతను 1913లో పనిని ప్రారంభించాడు, రాళ్ళ బెడ్‌పైన ఇటుక స్తంభాలను నిర్మించాడు, చాల తక్కువ వ్యయంతో ఒక సంవత్సరంలోపు పనిని మొత్తం పూర్తి చేసాడు. దీని మీదుగా మొదటి రైలు వెళ్ళేటపుడు అతను వంతెన కింద పడుకుంటానని హామీ కూడా ఇచ్చాడు, రైల్వే లైన్ ప్రారంభించినప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. మిగిలిన డబ్బును బ్రిటిష్ వారు వెండి నాణేల రూపాల్లో తిరిగి ఇచ్చారు. అప్పుడు అప్పుహామి నాలుగు బండ్ల వెండి నాణేలతో తన గ్రామానికి తిరిగి వచ్చి వాటిని తన గ్రామం, పొరుగు గ్రామ ప్రజల రెండు రోజుల భోజనం కోసం ఖర్చు చేసాడు, ప్రతి గ్రామస్థుడికి ఒక వెండి నాణెం కూడా ఇచ్చాడు.[5]

వివరాలు[మార్చు]

  • వంతెన 1:44 వాలుతో వంపుగా నిర్మించబడింది.
  • వంతెన ఎత్తు: 24 మీ
  • పరిధి: 9.144 (30 అడుగులు )
  • 4.57 మీ (15 అడుగులు ) వ్యాసార్థంతో సగం వంపు తిరిగిన దిమ్మెలు
  • వంతెన పొడవు: 91.44 మీ (300 అడుగులు)
  • వెడల్పు: 7.62 మీ (25 అడుగులు)
  • ఈ రైల్వే వంతెన శ్రీలంక స్టాంపుపై కూడా కనిపిస్తుంది.

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "DEMODARA NINE ARCH BRIDGE". Archived from the original on 2018-01-25. Retrieved 2018-01-24.
  2. "Demodara 9 Arch Bridge". Archived from the original on 2017-06-06. Retrieved 2018-01-24.
  3. amazinglanka (2023-05-22). "Demodara Nine Arch Bridge". AmazingLanka.com. Retrieved 2023-06-03.
  4. "Demodara Nine Arches Bridge, Ella - Timings, History, Best time to visit". Trawell.in. Retrieved 2023-06-03.
  5. "Nine Arch Bridge ෴ ආරුක්කු නවය පාළම". Lakpura LLC. Retrieved 2023-06-03.