పండిట్ జస్రాజ్
| పండిట్ జస్రాజ్ | |
|---|---|
Panditji at Pandit Motiram Pandit Maniram Sangeet Samaroh, Hyderabad. |
|
| Background information | |
| Origin | Hissar, హర్యానా, భారతదేశం |
| Genres | Hindustani classical music, Mewati Gharana |
| Occupations | Classical Vocalist |
| Years active | 1945 - present |
| Website | Official site |
పండిట్ జస్రాజ్ (జ: జనవరి 28, 1930), హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
విషయ సూచిక |
బాల్యం[మార్చు]
జస్రాజ్ హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో మేవాతి ఘరానాకు చెందిన కుటుంబంలో జన్మించాడు. తండ్రి పండిట్ మోతీరామ్‌జీ శాస్త్రీయ సంగీత కళాకారుడు. జస్రాజ్ తన నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు.
సంగీత ప్రస్థానం[మార్చు]
జస్రాజ్ తొలి సంగీత గురువులు తండ్రి పండిట్ మోతీరామ్ మరియు అన్న పండిట్ మణిరామ్‌జీ లు. తరువాత జస్రాజ్ మహరాజా జయవంత్ సింగ్‌జీ వఘేలా వద్ద శిష్యరికం చేశాడు. జస్రాజ్ తన చిన్నప్పుడు ప్రఖ్యాత గజల్ గాయని ,బేగం అక్తర్ శ్రావ్యమైన గొంతు విని ఎంతో ప్రభావితుడై, బడికి ఎగనామం పెట్టి ఒక చిన్న హోటల్‌లో వినిపించే ఆమె పాటలను రోజంతా వినేవాడు. 1960 లో, జస్రాజ్ ఒకసారి హాస్పిటల్‌లో ఉన్న బడే గులాం అలీఖాన్ ను కలిసినప్పుడు, ఆయన జస్రాజ్‌ను తన శిష్యుడిగా ఉండమన్నాడు. కాని తను ఇదివరకే పండిట్ మోతీరామ్ శిష్యుడినని, జస్రాజ్ ఆయనను తిరస్కరించాడు. అన్న మణిరామ్‌జీ జస్రాజ్‌ను, తబలా సహకారం కోసం తన వెంట తీసికెళ్ళేవాడు. ఆ కాలంలో సారంగి వాద్యకారుల మాదిరే, తబలా వాద్యకారులను జనం చిన్నచూపు చూసేవారు. దాంతో జస్రాజ్ అసంతృప్తిపొంది, తబలాకు స్వస్తి చెప్పి, గాత్రం నేర్చుకొన్నాడు. జస్రాజ్ ఒక ప్రత్యేక వినూత్న పద్ధతిని జుగల్‌బంది లో ప్రవేశపెట్టాడు. అందులో పురాతన మూర్ఛనల పై అధారపడిన ఒక శైలిలో, గాయని, గాయకుడు తమ వేర్వేరు రాగాలను ఒకేసారి ఆలపిస్తారు.
పేరెన్నికగన్న శిష్యులు[మార్చు]
సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్‌నాథ్ లు. బాలివుడ్ గాయని సాధనా సర్గమ్ జస్రాజ్ శిష్యురాలే. తన తండ్రి జ్ఞాపకార్థం, జస్రాజ్ ప్రతి సంవత్సరం, పండిట్ మోతీరామ్, పండిట్ మణిరామ్ సంగీత్ సమారోహ్ ను హైదరాబాద్‌లో గత 30 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాడు.
అవార్డులు[మార్చు]
- పద్మ విభూషణ్ 2000 లో
- సంగీత నాటక అకాడమీ అవార్డు 1987 లో
- సంగీత కళారత్న
- మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
- లతా మంగేష్కర్ పురస్కారం
- మహారాష్ట్ర గౌరవ పురస్కారం
- సురేర్ గురు
ఆల్బంలు[మార్చు]
- బైజూ బావ్రా ( 2008 )
- ఉపాసన ( 2007 )
- తపస్య వాల్యూమ్. 1 ( 2005 )
- దర్బార్ ( 2003 )
- మహేశ్వర మంత్ర ( 2002 )
- సౌల్ ఫుడ్ ( 2005 )
- జస్రాజ్, పండిట్ - వాల్యూమ్. 2 - హవేలీ సంగీత్
- ఇన్స్పిరేషన్ ( 2000 0
- రాగాలు - త్రివేణి మరియు ముల్తానీ
- రాగాలు - బిహడ మరియు గౌడగిరి మల్హార్
- వర్షిప్ బై మ్యూజిక్ / లైవ్ స్టుగ్గార్ట్' 88
- ఆర్నమెంటల్ వాయిస్
బయటి లింకులు[మార్చు]
- [1]పండిట్ జస్రాజ్ వీడియో ఇంటర్‌వ్యూ
- [2]పండిట్ జస్రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్, న్యూయార్క్
- [3] పూర్వి రాగ - వీడియో
- [4] జస్రాజ్‌తో ముఖాముఖి
- [5] మేరో మన్ మోహియా