పిఠాపురం నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిఠాపురం నాగేశ్వరరావు
పిఠాపురం నాగేశ్వరరావు
జననం
పాతర్లగడ్డ నాగేశ్వరరావు

(1930-05-05)1930 మే 5
మరణం1996 మార్చి 5(1996-03-05) (వయసు 65)
జాతీయతభారతీయుడు
విద్యఎస్.ఎస్.ఎల్.సి.
విద్యాసంస్థఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వోన్నత పాఠశాల, పిఠాపురం
వృత్తిసినిమా నేపథ్య గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1946-1978
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సరదా పాటలు
గుర్తించదగిన సేవలు
అవేకళ్ళు
కులగోత్రాలు
తల్లిదండ్రులువిశ్వనాథం, అప్పయమ్మ

పిఠాపురం నాగేశ్వరరావు (మే 5, 1930 - మార్చి 5, 1996) ప్రముఖ సినీ సంగీత దర్శకులు.

తెలుగు సినీ జగత్తులో మాధవపెద్ది - పిఠాపురం లను జంట గాయకులు అంటారు. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాధం - అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు పాతర్లగడ్డ, కానీ, 'చిత్తూరు' నాగయ్య లాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు.

బాల్యం

[మార్చు]

పిఠాపురం నాగేశ్వరరావు అసలు పేరు పాతర్లగడ్డ నాగేశ్వరరావు. పిఠాపురం నుంచి వచ్చాడనో ఏమో, అందరూ పిఠాపురం నాగేశ్వరరావు అనేవారుగాని, అసలు ఇంటిపేరు కలిపేవారుకారు. పిఠాపురంలో ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి.వరకు చదువుకున్నారు. ఇతనికి రంగస్థలంపై మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి, ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ధి బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలంతో, తండ్రి ప్రోత్సాహంతో 1944 నుంచి నవ్యకళాసమితి వారి నాటకాలైన శ్రీకృష్ణతులాభారం, బాలనాగమ్మ, కృష్ణార్జునయుద్ధం, దేవదాసు, ఏకలవ్య, లోభి, చింతామణి, రంగూన్‌రౌడీ వంటి నాటకాలలో అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, సుబ్బిసెట్టి పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పు పొందారు. విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకోని తన అదృష్టన్ని పరీక్షించుకున్నారు.[1]

సినీ జీవితం

[మార్చు]

1946 లో విడుదలైన మంగళసూత్రం అనే సినిమాలో తొలిసారిగా పాడి, సినిరంగంలో కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్ఠాత్మక సినిమా చంద్రలేఖలో పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు. అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన "మా ఊళ్ళో ఒక పడుచుంది" (అవేకళ్ళు) పాట, మాధవపెద్దిగారితో కలిసిపాడిన " అయ్యయో! జేబులోడబ్బులుపొయనే " (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయోక్తికాదు. ఆయన చివరిసారిగా "చల్లని రామయ్య - చక్కని సీతమ్మ" అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమాకోసం పాడారు. 1996 మార్చి 5 న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠాపురం.

పాడిన పాటలు

[మార్చు]

పిఠాపురం తెలుగు లోనెగాక, తమిళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడారు. అందులో ఆయన పాడిన కొన్ని హుషారైన పాటలు:

బిరుదులు

[మార్చు]
  • ఆంధ్రా రఫీ
  • జనతా సింగర్
  • గానగంధర్వ

మూలాలు

[మార్చు]
  1. ఏలూరు అశోక్ కుమార్ రావు. "ఆంధ్రారఫీ పిఠాపురం నాగేశ్వరరావు". సాహితీకిరణం. 12 (1): 41.