పెద్దమనుషులు (1954 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దమనుషులు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం కె.వి.రెడ్డి
కథ కె.వి.రెడ్డి,
డి.వి.నరసరాజు,
డి.బి.జి.తిలక్
తారాగణం జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
ఎ.వి.సుబ్బారావు,
ఎమ్.లింగమూర్తి,
వంగర,
రేలంగి,
సి.హెచ్.కుటుంబరావు,
రామచంద్ర కాశ్యప్,
గోపాల్ పిళ్ళై,
శ్రీరంజని,
కె.పద్మావతిదేవి,
సి.హెచ్.హేమలత,
తాడంకి శేషమాంబ,
స్వరాజ్యలక్ష్మి,
ప్రభావతి,
జయలక్ష్మి,
సీత
సంగీతం ఓగిరాల రామచంద్రరావు,
అద్దేపల్లి రామారావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.లీల,
కృష్ణవేణి(జిక్కి),
పి.నాగేశ్వరరావు,
మాధవపెద్ది,
వర్మ
నృత్యాలు వి.జె.శర్మ
గీతరచన ఊటుకూరి సత్యనారాయణరావు,
కొసరాజు రాఘవయ్య చౌదరి,
ఎన్.రాఘవరావు
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం బి.ఎన్.కొండారెడ్డి
కళ ఎ.కె.శేఖర్
కూర్పు ఎమ్.ఎస్.మణి
నిర్మాణ సంస్థ వాహినీ ప్రొడక్షన్స్
నిడివి 191 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పెద్దమనుషులు 1954 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో హెన్రిక్ ఇబ్సన్ (Henrik Ibsen) రచించిన ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ (The Pillars of Society) అనే నాటకం ఆధారంగా నిర్మితమైన తెలుగు చిత్రం. ఇది తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది. పల్లెటూరు, అక్కడి రాజకీయాలు, రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ, అది ఎదుర్కునే వారి అడ్డు తొలగింపులు చిత్ర కథాశం. రేలంగి తను ధరించిన పాత్రలలో ఉత్తమమైనదిగా ఈ చిత్రంలోని పాత్ర గురించి చెప్పారు.

కథ[మార్చు]

ఆదికేశవపురం అనే ఊరికి ఛైర్మన్ అయిన ధర్మారావు, కాంట్రాక్టరు నాగోజీ, ప్రముఖ వ్యాపారియైన చింతపులుసు శేషావతారం, దేవాలయ పూజారి సిద్ధాంతి ఊర్లో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతుంటారు. కానీ ఎవరికీ తెలియకుండా ప్రజాధనం దోపిడీ చేస్తుంటారు. ధర్మారావు తమ్ముడు శంకరం. చెల్లెలు సుందరమ్మ విధవరాలు. ధర్మారావు పుట్టిల్లు చేరిన సుందరమ్మ ఆస్తిని కాజేయడంతో పాటు తమ్ముడి ఆస్తిని కూడా కాజేయడానికి శంకరానికి పిచ్చి అని ప్రచారం చేస్తుంటాడు. శంకరం నిజానికి పిచ్చివాడు కాకపోయినా అలా నటిస్తూ అన్న మోసాలన్నీ గమనిస్తూ ఉంటాడు. వీరితో పాటు నిజాయితీపరుడైన రామదాసు ప్రజాసేవ అనే పేరుతో ఒక పత్రిక నడుపుతూ ఉంటాడు. దాంతో పాటు అనాథ పిల్లలకోసం ఒక శరణాలయం కూడా నిర్వహిస్తుంటాడు. రామాదాసు ధర్మారావును గుడ్డిగా నమ్ముతుంటాడు. శంకరం తన అన్న నిజస్వరూపాన్ని రామదాసు దగ్గర బయటపెట్ట బోతే అతన్ని తీవ్రంగా మందలిస్తాడు. శంకరం ఎప్పుడూ కొంతమంది పిల్లల్ని వెంటేసుకుని తత్వాలు, భజన పాటలు పాడుతూ పెద్ద మనుషుల కుట్రలను ప్రజలకు వెల్లడిస్తుంటాడు. ఇది గిట్టని సిద్ధాంతి, నాగోజీ తదితరులు శంకరం మీద అతని అన్నకు లేనిపోని చాడీలు చెప్పి అతనికి చీవాట్లు పెట్టిస్తారు. ప్రతిగా శంకరం కూడా సిద్ధాంతికి దేహశుద్ధి చేస్తాడు.

రామదాసుకు అంధురాలైన ఒక కుమార్తె ఉంటుంది. ధర్మారావు కుమారుడు ప్రభాకరం పట్నంలో వైద్యవిద్యనభ్యసిస్తూ ఉంటాడు. ప్రభాకరానికి రామదాసు కూతురు అంటే అభిమానం. ఆమెను పట్నంలో వైద్యం చేయిస్తే చూపు వస్తుందని తెలుసుకుంటాడు. దాని ఖర్చు కోసం రామదాసు ధర్మారావు దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటాడు. వితంతువైన ధర్మారావు చెల్లెల్ని అతని కారు డ్రైవరు ప్రేమిస్తున్నాడని తెలుసుకుని అతన్ని తుపాకీతో కాలుస్తాడు ధర్మారావు. ధర్మారావు తనకు చేసిన సహాయాన్ని తలుచుకుని అతని అసలు స్వరూపం తెలియక ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళతాడు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

విడుదల, స్పందన[మార్చు]

1954లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయవంతమైంది. విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా సాధించగలిగింది. సినిమా రంగం అనే అలనాటి సినీ పత్రిక అప్పట్లో 1954లో విడుదలైన ఉత్తమ చిత్రం ఏదంటూ పాఠకుల స్పందన కోరగా వారు పెద్దమనుషులు సినిమాను ఎంచుకున్నారు.[2]

పాటలు[మార్చు]

ఈ సినిమాలో 9 పాటలను చిత్రీకరించారు.[3]

క్రమసంఖ్య పాట గాయకులు
1. అంతభారమైతినా అంధురాల నే దేవా అఖిల చరాచర పి. లీల
2. ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందారా పి. లీల బృందం
3. చెప్పలేదంటనక పొయ్యేరు జనులార గురుని చేరి మ్రొక్కితే
4. నందామయా గురుడ నందామయా ఆనందదేవికీ నందామయా ఘంటసాల బృందం. రచన:

కొసరాజు.

5. నీడలేదమ్మా నీకిచట తోడు లేదమ్మా నీవారనుకొని నమ్మినవారే వి.జె.శర్మ
6. నీమీద ప్రాణాలు నిలిపింది రాధా రావోయీ గోపాల కృష్ణా పి. లీల
7. పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా పరిమట్ అమ్మి జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
8. వద్దంటే వచ్చావు కన్నోడు అదిగో పెద్దపులుల అడవి చిన్నోడా మాధవపెద్ది, సరోజిని
9. శివ శివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా రేలంగి వెంకట్రామయ్య,ఘంటసాల.

రచన: కొసరాజు

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  2. "1954 సం.లో ఉత్తమ చిత్రం". సినిమా రంగం. April 1955. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 25 July 2015.
  3. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  4. "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 23 August 2011.

బయటి లింకులు[మార్చు]

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య