డి.వి.నరసరాజు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దాట్ల వెంకట నరసరాజు
Narasa-raju-d.v.-01.jpg
డి.వి.నరసరాజు
జన్మ నామం దాట్ల వెంకట నరసరాజు
జననం 1920 , జూలై 15
ముత్యాలంపాడు
మరణం 2006 , ఆగష్టు 28
ఇతర పేర్లు డి.వి.నరసరాజు
ప్రాముఖ్యత హేతువాది , తెలుగు సినిమా రచయితలు
మతం హిందూ
సంతానం ఒక కూతురు

డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు 1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరు లో జన్మించాడు.[1] ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు. ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రిక లో కొంతకాలం పనిచేశాడు.

నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.[2]

నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. 1951లో పాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.[3] గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత మరియు దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ మరియు భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.

2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.[4] ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య నరసరాజు మనవరాలే.


సినిమాలు[మార్చు]

కథ లేదా మాటల రచయితగా


 1. మనసు మమత (1990)
 2. కారు దిద్దిన కాపురం (1986) దర్శకుడు కూడాను
 3. వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
 4. యుగంధర్ (1979)
 5. యమగోల (1975)
 6. అమ్మ మనసు (1974)
 7. ఇద్దరు అమ్మాయిలు (1972)
 8. మూగనోము (1969)
 9. బాంధవ్యాలు (1968)
 10. భక్తప్రహ్లాద (1967)
 11. చదరంగం (1967)
 12. గృహలక్ష్మి (1967)
 13. రామ్ ఔర్ శ్యామ్ (1967) కథ, స్క్రీన్ ప్లే
 14. రంగుల రాట్నం (1966)
 15. నాదీ ఆడజన్మే (1965)
 16. రాముడు భీముడు (1964)
 17. గుండమ్మ కథ (1962)
 18. మన్ మౌజీ (1962)
 19. మోహినీ రుక్మాంగద (1962)
 20. రేణుకాదేవి మహాత్మ్యం (1960)
 21. రాజమకుటం (1959)
 22. దొంగరాముడు (1955)
 23. పెద్దమనుషులు (1954)

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]