గుణసుందరి కథ
వికీపీడియా నుండి
| గుణసుందరి కథ (1949) | |
| దర్శకత్వం | కె.వి.రెడ్డి |
|---|---|
| చిత్రానువాదం | కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు |
| తారాగణం | శ్రీరంజని (గుణసుందరీ దేవి), కస్తూరి శివరావు, వల్లభజోస్యుల శివరామ్, గోవిందరాజుల సుబ్బారావు, పి.శాంతకుమారి, రేలంగి వెంకటరామయ్య, కె.మాలతి, పామర్తి వెంకటేశ్వరరావు, జంధ్యాల గౌరీనాథశాస్త్రి (శివుడు), టి.జి.కమలాదేవి (పార్వతి), హేమలత, కల్లకూరి సదాశివరావు , శ్రీరంజని |
| సంగీతం | ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, కస్తూరి శివరావు, పి.లీల, టి.జి.కమలాదేవి |
| నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి |
| గీతరచన | పింగళి నాగేంద్రరావు |
| సంభాషణలు | పింగళి నాగేంద్రరావు |
| ఛాయాగ్రహణం | మార్కస్ బార్ట్లీ |
| కళ | కుదరవల్లి నాగేశ్వరరావు |
| కూర్పు | ఎమ్.ఎస్.మణి |
| నిర్మాణ సంస్థ | వాహిని పిక్చర్స్ |
| భాష | తెలుగు |
విషయ సూచిక |
[మార్చు] కథ
[మార్చు] కధా గమనం
ఈ కధ పార్వతి శివుడు విహారం చేస్తూ వెళుతుండగా మొదలౌతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తూ ఉండటం ఆమె ప్రక్కన ఒక ఎలుగుబంటి|ఎలుగు కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కధ వివరించమని పరమేశ్వరుని వేడుకొంటుంది. ఆయన ఆక్ధను వివరిస్తూ ఉంటాడు.
[మార్చు] మూల కధ
ధారానగరఅన్ని పరిపాలించే రాజు ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి మరియు గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు ఉంటారు. గుణ సుందరి(శ్రీరంజని)కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్ళీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలనూ అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలూ యవ్వనవతులైనాక ప్రజలకు పరిచయం చేసేందుకు సభకు తీసుకొస్తాడు. అక్కడ వారిని తనగురించి చెప్పమన్నపుడు పెద్దకుమార్తెలు తండ్రిని తాము అందరికంటె ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెపుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరి కంటే అధికంగా ప్రేమించాలని చెపుతుంది. దానితో కోపం వచ్చిన రాజు నీ భర్త ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి(కస్తూరి శివరావు)ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే మూహూర్తంలో ఆమె అక్కలకు తన మేనళ్ళుళ్ళతో వివాహం జరుపుతాడు.
తదనంతరం ఒకానొక సంధర్భంలో ఆ ముదుసలి వినికిడి వాక్కు బాగా ఉన్నవాడని తెలియడం, అతడు తన మేనళ్ళుళ్ళతో వాదనలకు దిగటం చూసిన రాజు వాళ్ళ ఉనికి సహించలేనివాడై ఇంటినుండి పొమ్మంటాడు. అ సందర్భంలో ముసలివానిని కొట్టబోయి పట్టు తప్పి మెట్ట్లపైనుండి పడి కాలుకు బలమైన గాయాలు తగులుతాయి. గుణ సుందరి భర్తకు జరిగిన అవమానంతో అతడితో కలసి అతడి పల్లెకు వచ్చేస్తుంది. అతడితో కలసి సామాన్యజీవితం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నీటికై చెరువుకు వెళ్ళిన ఆమెను ఒక యువకుడు వెంబడించి ఆమెను వివాహం చేసుకొంటానని చెపుతూ చేయి పట్టుకొంటాడు. ఆమె అతడిని చెంబుతో నుదుటిపై కొడుతుంది. ఇంటికి వచ్చి భర్తతో జరిగింది చెపుతుంది. తరువాత భర్త నుదుటన కూడా గాయం ఉండటం చూస్తుంది. ఒకనాడు భర్త ఆమె ఎప్పుడూ చదువుతుండే పతివ్రతల పుస్తకంలో ఆమె కధను రాసి ఆమెను వెంటాడిని యువకుని బొమ్మ వేస్తాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి మీరు సామాన్యులు కాదు, మారురూపాన ఉన్న ఎవరో గొప్పవారు, నన్ను పరిక్షీంచక నిజం చెప్పమని కోరుతుంది. అతడు చెరువు దగ్గర వెంటాడిన తన నిజరూపంలో ఆమెకు కనిపిస్తాడు. తన పేరు వీరశేనుడని తను ఒక రాకుమారుడనని చెప్పి తను తన గురువు కారణంగా శాపానైకి గురియైన వైనమ్ చెప్పి, దానిని భార్యకు తప్ప పరులు ఎవరికీ తెలియనివ్వరాదని తెలిసిన క్షణం తాను ఎలుగుబంటిగా మారిపోతానని ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకొంటాడు. గుణ సుందరి ఇంటినుండి వెళ్ళిన కొద్ది కాలానికి ఆమె తండ్రి కాలు గాయాలు పెద్దవై అధిక బాధ పడుతుంటాడు. కూతుళ్ళు అతడికి సేవచేయక సూటి పోటి మాటలని తమభర్తల సహాయంతో తండ్రి కాలు తీసేయించే ప్రయత్నం చేస్తారు. కూతుళ్ళ గురించి నిజం తెలిసి భయపడిన రాజు మంత్రికి చెప్పి తన కాలు బాగుచేయించే మార్గం చూడమంటాడు. అంజనం ద్వారా మహేంద్రమణి తెచ్చి తాకిస్తే తగ్గుతుందని చెపుతారు పండితులు. అది తెచ్చిన వారికి తనరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించమంటాడు రాజు.
తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన గుణ సుందరి తన భర్తను అ మణిని తీసుకొచ్చి తన తండ్రి అనారోగ్యాన్ని తొలగించమని వేడుకొంటుంది. వీరశేనుడు ముసలి రూపునే మణి కోసం బయలుదేరుతాడు. ఇటు రాజు పెద్ద అళ్ళుళ్ళు కూడా బయలుదేరుతారు. వీరశేనుడు మణీ సాధనలో తన తెలివితేటలతో దారిలో ఎదురైన ఆపదలను గట్టెక్కి, అక్కడ ఉన్న యక్షిణిలను గెలిచి తన తోడళ్ళుళ్ళతో పాటు అక్కడకు చేరుకొని అక్కడ యక్షిణి ద్వారా మంత్రం నేర్చి మహేంద్రమణిని సాదిస్తాడు. అందరూ తిరిగి వస్తుండగా ఒక రాత్రి పడుకొన్న వీరశేనుడి తలపై మోది అతడిని బావిలో తోసి మణి తీసుకొని పారొపోతారు అతడి తోడళ్ళుళ్ళు ఇద్దరూ. ఇక్కడ పల్లెనుండి గుణసుందరి రాజును వెళ్ళి చూసేందుకు వెళ్ళగా ఆమె అక్కలు ఆమెను అవమానించి ఆమె భర్త గురించి అవమానంగా మాట్లాడటంతో ఆవేశంలో నిజం చెప్పేస్తుంది. అక్కడ బావిలో వీరశేనుడు బల్లూకంగా మారిపోతాడు. మణిని తీసుకొని వచ్చిన రాజు అళ్ళుళ్ళు దాని మంత్రం గాయాలను మాన్పలేకపోతారు. బల్లూకంగా మారిన వీరశేనుడు జనాలు తరుముతుంటే పల్లెకు వస్తాడు. గుణ జనాలనుండి కాపాడి తన ఇంటికి తీసుకుపోయి క్షమించమని ఆవేశంలో చెప్పేసానని ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రార్ధనకు మెచ్చి కోయరూపాలలో ఆమెను, బల్లూకాన్ని వెంటబెట్టుకొని రాజు దగ్గరకు వచ్చి వీరశేనునికి పూర్వరూపం ఇచ్చి అతడి గురించి అందరికీ వివరిమ్చి గుణసుందరి పాతివ్రత్యకారణంగానే తాము మెచ్చి భువికి వచ్చామని చెప్పి నిజరూపాలతో అందరికీ ధర్శనమిచ్చి అదృశ్యమవుతారు.
[మార్చు] విశేషాలు
[మార్చు] పాటలు
- అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం - రేలంగి, పామర్తి కృష్ణమూర్తి
- అమ్మ మహలక్ష్మి దయసేయవమ్మా మమ్ము మా పల్లే పాలింపవమ్మా - ఘంటసాల
- ఈ వనిలో కోయిలనై కోయిల పాడే గానమునై గానముకోరే - టి.జి. కమలాదేవి
- ఉపకార గుణాల నిలవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి - పి. లీల
- ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్యా - కస్తూరి శివరావు
- ఓ మాతా రావా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరజేశ్వరి - పి. లీల
- ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా - వి. శివరాం
- కలకలా ఆ కోకిలేమో పలుకరించె వింటివా - మాలతి, శాంతకుమారి
- కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని - పి.లీల
- చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే - కస్తూరి శివరావు, టి. కనకం
- శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవే - పి. లీల
- హరహరహర ఢమరుక నాదం ...తెలుసుకోండయా - టి.జి. కమలాదేవి బృందం
[మార్చు] వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
[మార్చు] బయటి లింకులు
| కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
|---|---|
| భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కధ | శ్రీకృష్ణసత్య |