యోగివేమన (1947 సినిమా)
| యోగి వేమన (1947) | |
| దర్శకత్వం | కె.వి.రెడ్డి |
|---|---|
| నిర్మాణం | బి.యన్.రెడ్డి, మూలా నారాయణ స్వామి |
| తారాగణం | చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, ఎమ్.వి.రాజమ్మ, దొరైస్వామి, పార్వతీబాయి, కృష్ణవేణి, బెజవాడ రాజారత్నం, పద్మనాభం |
| సంగీతం | చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| నిర్మాణ సంస్థ | వాహినీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
విషయ సూచిక |
చిత్రం గురించి [మార్చు]
యోగి వేమన ఒక చక్కటి చలనచిత్రం. ఈ చిత్రంలో వేమన పాత్రధారి ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో నాగయ్య నటన ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. వేమన ఎల్ల ఉంటాడో తెలియని తెలుగు ప్రజ, నాగయ్యలో వేమనను చూసుకుని పులకించిపొయారు. నాగయ్య నటనతో పాటు కె వి రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. 1947వ సంవత్సరములో దేశమునకు స్వతంత్రము వచ్చిన వెంటనే విడుదలయిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో నాగయ్య నటన ఒక ఎత్తు, ఆయన పాడిన పాటలు పద్యాలు ఒక ఎత్తు. తన అద్భుతమైన గాత్రంతో నాగయ్య వేమన పద్యాలను చక్కగా గానం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ పాటలు ఇప్పటికి "క్లాసిక్స్" గా పరిగణింపబడుతున్నాయి.
ఇతర వివిరాలు [మార్చు]
- సినిమాటోగ్రఫీ - మార్కస్ బార్ట్‌లీ
- సహాయ దర్శకుడు - కమలాకర కామేశ్వరరావు
- నేపధ్యగానం - చిత్తూరు నాగయ్య, బెజవాడ రాజారత్నం
- కోరియోగ్రఫీ - వేదాంతం రాఘవయ్య
పాటలు [మార్చు]
01. అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలికేటి నా జ్యోతి - నాగయ్య
02. ఆపరాని తాపమాయెరా పాలేందుమౌళి ప్రాపుగోరి - ఘంటసాల, ఎం.వి. రాజమ్మ
03. ఇదేనా ఇంతేనా జీవిత సారము ఇదేనా.. అంతులేని జీవన - నాగయ్య
04. కనుపించుమురా మహదేవా కనులారా నిను కాంచి - నాగయ్య
05. చదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు (పద్యాలు) - నాగయ్య
06. జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి - నాగయ్య
07. తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి (పద్యాలు ) - నాగయ్య
08. తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - ఎం.వి. రాజమ్మ
09. తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - నాగయ్య
10. మాయను పడకే మనసా సాయము కలిమి సతమని నమ్మి - బెజవాడ రాజారత్నం
11. వదలజాలరా నా వలపుదీర్పరా నిన్ను వదలజాలరా మనసారా - నాగయ్య
12. వచ్చేపోయే తాడిలోన కోతి ఉన్నాది కోతిమూతిలోన - బేబి కృష్ణవేణి బృందం
13. వెలదులార ముదముమీర నలుగిడ రారే - బృందం
14. సేవకజన శుభకారి భవనాశ చంద్రమకుట చర్మాంభరధారి - ఎం.వి. రాజమ్మ
ఇవి కూడా చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
| కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
|---|---|
| భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కధ | శ్రీకృష్ణసత్య |