కె.మాలతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాతాళ భైరవి చిత్రంలో ఎన్.టి.రామారావు సరసన కె.మాలతి

కె.మాలతి తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని.కె.మాలతి 1926లో ఏలూరులో జన్మించింది.[1]

మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతన ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. పాతాళ భైరవి చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారిగుణసుందరి కథ(1949), అందులో శాంతకుమారితో కలిసి కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా, చల్లని దొరవేలే చందమామ పాటలు పాడింది. 1951లో విజయా వారి పాతాళ భైరవిలో ఆమెకు పి.లీల పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత కాళహస్తి మహత్యం (1954)లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్తో నటించింది. బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం ఎన్.టి.రామారావు తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం.

చిత్ర సమాహారం[మార్చు]

లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 111.
"https://te.wikipedia.org/w/index.php?title=కె.మాలతి&oldid=3884976" నుండి వెలికితీశారు