ప్రేమించి చూడు (1965 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ప్రేమించిచూడు (1965)
Preminchi Choodu.jpg
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం వి.వెంకటేశ్వర్లు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జగ్గయ్య,
రాజశ్రీ,
కాంచన,
రేలంగి వెంకట్రామయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
శాంతకుమారి,
చలం
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

ఇది ఒక పూర్తి హాస్య రస చిత్రం. ప్రముఖ దర్శకుడు శ్రీధర్ తమిళంలో నిర్మించిన "కాదలిక్క నేరమిల్లై" చిత్రం దీనికి మాతృక. సరదాగా, హాయిగా సాగిపోయే సినిమా. ఆ తర్వాత దీనిని హిందీలోకి "ప్యార్ కియే జా" పేరుతో పునర్నించారు. ఇందులో కిషోర్ కుమార్, మెహమూద్ మొదలైనవారు నటించారు.

చిత్రకథ[మార్చు]

బుచ్చబ్బాయి (రేలంగి) ధనవంతుడు. ఎస్టేట్ ఓనర్ అతనికి ఇద్దరు కుమార్తెలు (కాంచన, రాజశ్రీ), కమారుడు (చలం). అతనికి కూతుర్లంటే ప్రాణం. ఇద్దరూ కాలేజిలో చదువుతూ ఉంటారు. పెద్దకుమార్తె ఆ కాలేజిలో చుదువుతున్న వాసు (జగ్గయ్య) ని ప్రేమిస్తుంది. శలవులకు అప్పచెల్లెళ్లు ఇంటికి బయలుదేరడంతో సినిమా ప్రారంభమవుతుంది. బుచ్చబ్బాయి దగ్గర అసిస్టెంట్ మానేజర్ రంగారావు. ఒక సాధారణ బడిపంతులు (రావి కొండలరావు) కుమారుడు. రంగ స్నేహితుడు బుచ్చబ్బాయి పెద్ద కూతురును ప్రేమించిన వాసు. రంగాకి అతను ఫైనాన్సియర్. అతని తండ్రి ఓ కోటీశ్వరుడు (గమ్మడి). తల్లి (శాంతకుమారి). రంగ ఒక డకోటా వంటి కారు కొని తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు,షికారు గా ఊరిచివరకు వచ్చిన బుచ్చబ్బాయి కుమార్తెలను రంగా ఆట పట్టిస్తాడు. కూతుర్ల మాట మీద రంగాను పనిలోంచి తీసేస్తాడు బుచ్చబ్బాయి. బుచ్చబ్బాయి పని కావాలోయ్ అని ఆందోళన మొదలు పెడతాడు రంగా. రంగా వీరంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో బాల్కనీ నుంచి బాల్చీలతో నీళ్లు పోసే ప్రక్రియ చేపడతారు బుచ్చబ్బాయి, కుమార్తెలు. ఆ ప్రయత్నంలో రెండో కూతురు చేతినుండి బాల్చీ జారి రంగా మీద పడుతుంది.అతడిని పరామర్శిండానికి వచ్చి అతని ప్రేమలో పడుతుంది. తనకంటే డబ్బున్న వాడికి తప్ప కూతుర్లనిచ్చి పెళ్లి చేయనంటాడు బుచ్చబ్బాయి. దానితో వాసుని పెద్దకారులో రమ్మనమని, వాసు చేత డబ్బున్న తండ్రి వేషం వేయిస్తాడు. వీళ్ల నటనకి బచ్చబ్బాయి పడిపోతాడు. తన కుమార్తెలలో ఒక కుమార్తెను రంగాకిచ్చి పెళ్లి చేయాలనకుంటాడు. వాసుని ప్రేమించిన పెద్దకుమార్తె ఒప్పుకోదు. రెండో కుమార్తె తన అంగీకారం తెలుపుతుంది. కాస్త బెట్టు చూపి,ఒప్పుకుంటారు రంగా, మారు వేషంలో ఉన్న వాసు. ఊరి చివరకు తీసుకువెళ్లి కూతుర్లకు తమ కథ అంతా చెబుతారు వాసు, రంగా. రంగా బీద వాడైనా పెండ్లి చేసుకోడానికి అభ్యంతరం లేదని చెబుతుంది బుచ్చబ్బాయి చిన్నమ్మాయి. ఇంతలో ఆ ప్రాంతంలో ఉన్న తోటని కొనడానికి వచ్చిన వాసు తండ్రి బుచ్చబ్బాయిని తన బాల్యమిత్రుడిగా గుర్తుపడతాడు. తన కుమారుడికి పెద్దకూతురిని ఇచ్చి పెండ్లిచేయమని బుచ్చబ్బాయిని అడుగుతాడు వాసుతండ్రి. బుచ్చబ్బాయి పెద్దకూతురు ఒప్పుకోదు. వాసు పక్కకి తీసకువెళ్లి ఆ పెండ్లి కుమారడు తనే నని చెబుతాడు. వివాహం నిశ్చయమవుతంది. రెండు వివాహాలు కలిపి చేయడానికి నిర్ణయమవుతుంది. తమఊరికి వచ్చి కారు ఇబ్బంది పెట్టడంతో రోడ్డు మీద ఉన్న వాసు తల్లి దండ్రులను తన ఇంటికి తీసుకు వెళతాడు. అక్కడ గోడ మీద రంగా ఫొటో చూసి బుచ్చబ్బాయి కి హెచ్చరికగా ఫోన్ చేస్తాడు వాసు తండ్రి.బుచ్చబ్బాయి పోలీస్ కంప్లైట్ ఇస్తాడు. పోలీసులు వాసు రంగాలను అరెస్ట్ చేస్తారు. రంగా లాంటి మనిషి మరొకడని బుకాయిస్తారు వాసు, రంగా. బుచ్చబ్బాయి కేసు వాపసు తీసుకుంటాడుయ వివాహ ముహూర్తం సమీపించింది కాని వాసు జాడలేదని అతని తల్లి దండ్రులు గాభరాపడతారు. మారువేషంలో ఉన్న వాసు అందర్నీ ఏమార్చి తాళి కట్టి తమ నాటకాన్ని బయట పెడతాడు. కథ సుఖాంతం.

పాటలు[మార్చు]

  1. అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు సరదాలు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్
  2. అందాలే తొంగిచూసే హాయిహాయి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి, బసవేశ్వర్
  3. కళ కళలాడే కన్నులు తహ తహలాడే ఊహలు - రచన: ఆరుద్ర; ఎల్. ఆర్. ఈశ్వరి, ఎం. ఎస్. రాజు
  4. దొరికేరూ దొరగారు ఇక నన్ను విడలేరు దోచుకున్న వలపులు - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  5. ప్రేమించి చూడు పిల్లా పెళ్ళాడుదాము మళ్ళా వయసున్న ఇలా - ఘంటసాల - రచన: ఆత్రేయ
  6. మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడదా - రచన: ఆరుద్ర[1] ; - పి.బి. శ్రీనివాస్
  7. మేడమీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి ... బుచ్బబ్బాయి పని కావాలోయి - పి.బి. శ్రీనివాస్ బృందం
  8. వెన్నెల రేయీ ఎంతో చలిచలి వెచ్చనిదానా రావే నా చెలి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. ప్రేమించి చూడు, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 17-18.